నా తల్లిదండ్రులు అలా పెంచారు.. ఆ పాలిటిక్స్ ఉన్నాయి.. ఆయన అలా షాకిచ్చారు.. వరుణ్

మెగా హీరోలంటే మాస్ హీరోలు అనే ట్యాగ్‌కు దూరంగా ఉంటున్న నటుడు వరుణ్ తేజ్. కంచె, ఫిదా, తొలి ప్రేమ లాంటి చిత్రాల ఎంపికతో తనలోని నటుడిని బయటకు తీస్తున్నారు. సినిమాల పరంగా పలు ప్రయోగాలకు తావిస్తూ కెరీర్‌పరంగా దూసుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో వరుణ్ తేజ్ చేసిన సినిమా అంతరిక్షం. ఘాజీ లాంటి సినిమాను అందించిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. అదితిరావు, లావణ్య త్రిపాఠి కథానాయికలు. ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. అంతరిక్షం గురించి ఆయన ఏమన్నారంటే..

అంతరిక్షం కొత్త అనుభవం

అంతరిక్షం కొత్త అనుభవం

నటుడిగా అంతరిక్షం సినిమా కొత్త అనుభవం. ప్రేక్షకులకు ఏదో కొత్తగా అందించాలని ఎప్పడూ భావిస్తుంటాను. అలాంటి ఆలోచన మధ్య తొలిప్రేమ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి నా వద్దకు వచ్చాడు. ఘాజీ లాంటి సినిమా రూపొందించిన తర్వాత ఎలాంటి కథ చెబుతాడో అని చూసిన నాకు సంకల్ప్ రెడ్డి షాక్ ఇచ్చారు.

 తెలుగు సినిమాను అంతరిక్షంలోకి

తెలుగు సినిమాను అంతరిక్షంలోకి

కథ చెప్పడానికి వచ్చినప్పుడు బ్యాగ్‌లో నుంచి లాప్ టాప్, కొన్ని శాటిలైట్ బొమ్మలు చూపించి చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. కథను పూర్తిగా తయారు చేసిన తర్వాత ఇంకా బాగుందనిపించింది. నటుడిగా పరిపూర్ణంగా సంతృప్తి పొందిన చిత్రంగా భావిస్తున్నాను. తెలుగు సినిమాను అంతరిక్షానికి తీసుకుళ్లే, మరోసారి టాలీవుడ్ ఘనతను మరో మెట్టు ఎక్కించే సినిమా అని ఖచ్చితంగా చెప్పగలను.

అనేక సమస్యలను అధిగమించి

అనేక సమస్యలను అధిగమించి

సినిమా సెకండాఫ్‌లో మొత్తం అంతరిక్షం నేపథ్యంగా సాగుతుంది. దాదాపు 15 కిలోల బరువు ఉన్న దుస్తులను ధరించాల్సి వచ్చేంది. జీరో గ్రావిటి నేపథ్యంలో సాగే కథలో చాలా రకాలైన సమస్యలను ఎదుర్కొన్నాం. తెలుగు సినిమా స్థాయికి మించి అంతరిక్షం గ్రాఫిక్ వర్క్ ఉంటుంది. హాలీవుడ్‌ చిత్రాల మాదిరిగా చేయాలంటే వందల కోట్లు పెట్టాలి. అలాంటి రిస్క్ మనం చేయలేం. మా బడ్జెట్ కేవలం రూ.25 నుంచి రూ.30 కోట్లు మాత్రమే. పక్కాగా ప్రీ ప్రొడక్షన్ డిజైన్ చేసుకోవడం వల్ల గొప్ప క్వాలిటీ అందించగలిగామని సంతృప్తి లభించింది.

 దేవ్ అనే సైంటిస్టు జీవితంలో

దేవ్ అనే సైంటిస్టు జీవితంలో

అందమైన, ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్, వాతావరణంతో ఆకట్టుకొనే చిత్రం అంతరిక్షం. దేవ్ అనే సైంటిస్టు జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఉంటాడు. అతను ఎలా తన లక్ష్యాన్ని చేరుకొంటాడు అనేది కథ. రెగ్యులర్ కథనే అయినప్పటికీ.. బ్యాక్ డ్రాప్ అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తుంది. వరల్డ్ సినిమా చూసే ప్రేక్షకులకు అంతరిక్షం చక్కటి అనుభూతి కలిగిస్తుంది.

సైంటిస్టుల పాలిటిక్స్ గురించి

సైంటిస్టుల పాలిటిక్స్ గురించి

అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో సైంటిస్టుల మధ్య ఉండే పాలిటిక్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయి. కానీ అది ప్రధానమైన అంశం కాదు. సైంటిస్టుల మధ్య రాజకీయాలను పక్కన పెడితే.. ప్రతీ ఒక్కరు దేశ ఖ్యాతిని పెంపొందించాలనే లక్ష్యంతో పనిచేస్తారు. కాకపోతే ఓ ప్రాజెక్ట్‌లో సైంటిస్టుల మధ్య ఉండే వ్యక్తిగత విభేదాలతో సినిమా సాగుతుంది.

నాలో జాతీయభావం పెరుగలేదు

నాలో జాతీయభావం పెరుగలేదు

అంతరిక్షం సినిమా తర్వాత కొత్తగా నాలో జాతీయభావం పెరుగలేదు. నాకు చిన్నతనం నుంచే దేశభక్తి, జాతీయ భావం ఎక్కువ. ఎందుకంటే చిన్నతనం నుంచి మా ఇంట్లో అలాంటి వాతావరణం ఉంది. అలాంటి ఆలోచనతోనే మా పేరెంట్స్ పెంచారు. స్కూల్‌లో కూడా మా టీచర్లు, లెక్చరర్లు దేశంపట్ల గౌరవాన్ని మాలో పెంపొందించారు.

 స్వేచ్ఛగా ఉన్నామంటే సైనికుల వల్లే

స్వేచ్ఛగా ఉన్నామంటే సైనికుల వల్లే

దేశంలో మనం స్వేచ్ఛగా ఉన్నామంటే సైనికుల సేవ, పోరాటం వల్లే. అలాగే శాటిలైట్ల ప్రయోగం వల్ల మనకు తెలియని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కమ్యూనికేషన్ల వ్యవస్థగానీ, జీపీఎస్, మొబైల్ టెక్నాలజీ లాంటి అనేక రకాల లాభాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. శాటిలైట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో అనే విషయాలపై అంతరిక్షం సినిమా చూస్తే అవగాహన కలుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X