నాలో విశ్వాసాన్ని పెంచింది అదే.. తప్పేమిటో తెలిసేది అక్కడే.. వరుణ్ తేజ్
ముకుంద, కంచె చిత్రాలతో వరుణ్ తేజ్ మంచి ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్నాడు. ఫిదా చిత్రంతో సక్సెస్‌తోపాటు మంచి అభిరుచి కలిగిన నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఫిదా తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి తొలిప్రేమ చిత్రంతో ముందుకొచ్చాడు. రాశీఖన్నాతో వరుణ్ కలిసి నటించిన చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో వరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
Recommended Video


మెగా హీరోలకు భిన్నంగా
మెగా హీరోలకు ఉన్న ఇమేజ్‌కు భిన్నంగా నేను సినిమా కథలను ఎంపిక చేసుకొంటున్నాను. నా తొలి చిత్రంగా ముకుంద చేయాల్సి కాదు. ఆ తర్వాత కంచె చేశాను. మంచి కథ కావడంతో నాకు బాగా పేరు వచ్చింది. ఫిదా సినిమా నాలో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నేను ఎంచుకొంటున్న కథలు సరైనవనే ఫీలింగ్‌ను ఫిదా కలిగించింది.

బాధ కలిగేది అప్పుడే
ఒక్కోసారి మనం ఇష్టపడి చేసిన సినిమాల రిజల్డ్ మరోలా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా బాధ కలుగుతుంది. మనం ఎంపిక చేసుకొనే కథలు సరైనావేనా అనే విషయంపై ఆలోచించుకోవడానికి ఛాన్స్ దక్కుతుంది. ఎక్కడ తప్పు చేసామా అని తెలుసుకొని సరిదిద్దుకొనే అవకాశం కలుగుతుంది.

కంచె అందరి కోసం కాదు..
కొన్నిసార్లు సినిమా అన్ని రకాలుగా బాగా ఉండి ఆడకపోవడం అనేది డిఫరెంట్. కొన్నిసార్లు మేము తీసే సినిమాలు అందర్ని ఆకట్టుకోలేవు. కంచె చిత్రం అందరికి సంబంధించి కాదు. కొంత మంది ప్రేక్షకుల కోసమే తీశాం. కంటెంట్ విషయానికి వస్తే కంచె విషయంలో నేను హ్యాపీ. అలాంటి సినిమాలు తెలుగులో రావాలి. కొత్త నిర్మాతలు వస్తే సినిమా పరిశ్రమకు మంచి కథలు దొరకుతాయి.

ఆ విషయంలో నేను పూర్
తొలిప్రేమ సినిమా విషయానికి వస్తే డ్యాన్సులు బాగా చేశాను. నేను డ్యాన్సుల్లో చాలా పూర్. కానీ ఈ సినిమా కోసం బాగా డ్యాన్సులు ప్రాక్టీస్ చేశాను. చూడాలి. ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారో..


Click it and Unblock the Notifications











