చూడటానికి అలా ఉంటా.. కానీ ఆ విషయంలో నేను ఫాస్ట్.. వరుణ్ తేజ్ (ఇంటర్వ్యూ)

'ముకుంద', 'కంచె', 'లోఫర్‌' లాంటి విభిన్నకథా చిత్రాలతో నటుడిగా తనని తాను ప్రూవ్‌ చేసుకొని 'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్‌ 2' లాంటి సక్సెస్‌ ఫుల్‌ కమర్షియల్‌ చిత్రాలతో ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన హీరోగా పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

ఈ క్యారెక్టర్‌ చేస్తున్నాఅనగానే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ రియాక్షన్‌ ఏంటి?

ఈ క్యారెక్టర్‌ చేస్తున్నాఅనగానే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ రియాక్షన్‌ ఏంటి?

మా ఫ్యామిలిలో చాలా మంది జిగర్తాండ సినిమా చూడలేదు. నా స్నేహితులు చాలా మంది కరెక్ట్‌ కాదేమో ఆలోచించుకో అన్నారు.. నేను చిరంజీవి గారికి ఫోన్‌ చేసి డాడీ కథ ఇలా అనుకుంటున్నాను అన్నాను. తర్వాత హరీష్‌ నేను వెళ్లి కలిసాం. కథ చాలా బాగుంది నువ్వు తప్పకుండా చేయాలి అని చిన్న చిన్న సజెషన్స్‌ ఇచ్చారు. హరీష్‌ గారు కూడా వాటిని అప్లై చేశారు. గద్దలకొండ గణేష్ పాత్ర కోసం పునాదిరాళ్లు, వేట సినిమాలలో చిరంజీవి గారి క్యారెక్టర్‌ని రిఫరెన్స్‌గా తీసుకున్నా అని వరుణ్ తేజ్ అన్నారు.

హరీష్‌ శంకర్‌ మేకింగ్‌ గురించి

హరీష్‌ శంకర్‌ మేకింగ్‌ గురించి

నేను ఈ క్యారెక్టర్‌ను ఇంతబాగా చేయడానికి హరీష్‌ గారు 100 హెల్ప్‌ చేశారు. ఎఫ్‌2 లో తెలంగాణ కొంచెం నీట్‌గా ఉంటుంది కానీ ఈ సినిమాకు వచ్చే టప్పడికి తెలంగాణ యాస కొంచెం కొట్టినట్లు ఉంటుంది. ఆయన డైలాగ్స్‌ కూడా సినిమాకు చాలా హెల్ప్‌ అవుతాయి. ఈ సినిమా ఇంతబాగా రావడానికి మేజర్‌ కారణం ఆయనే. వర్క్ విషయంలో హరీష్ చాలా ఫాస్ట్‌గా, నేను కూడా ఆయన లాగే ఫాస్ట్.. చూడటానికి నెమ్మదిగా ఉంటాను. కానీ వర్క్ విషయంలో ఫాస్టే అని వరుణ్ తేజ్ తెలిపారు.

తమిళంలో బాబీ సింహ చేసిన క్యారెక్టర్‌ను నేను చేస్తున్నాను. ఆయన మన తెలుగువారే. ఆయనది విజయవాడ. ఆ క్యారెక్టర్‌కి ఆయనకు నేషనల్‌ అవార్డు కూడా వచ్చింది. నేను ఆయన క్యారెక్టర్‌ ను ఇమిటేట్‌ చేయడానికి చూడలేదు. నా ఓన్‌గా ఆ క్యారెక్టర్‌ను రీక్రియేట్‌ చేయడానికి ట్రై చేశాను అని వరుణ్ తేజ్ అన్నారు.

'ఎల్లువచ్చి గోదారమ్మ' సాంగ్‌ రీమిక్స్‌ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రజర్‌ ఫీల్‌ అయ్యారా?

'ఎల్లువచ్చి గోదారమ్మ' సాంగ్‌ రీమిక్స్‌ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రజర్‌ ఫీల్‌ అయ్యారా?

జనరల్‌గా నాకు సాంగ్‌ అంటే ఒక ప్రెజర్‌ ఉంటుంది. ఆ ప్రాజెర్‌ ఫీల్‌ అయ్యాను అంతే... ఎందుకంటే మొదటగా హరీష్‌ గారు ఈ సాంగ్‌ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ సాంగ్‌ హిస్టరీ గురించి ఆయనకే ఎక్కువ తెలుసు. మిగతా విభాగాలుఅన్నీ వారి పని వారు కరెక్ట్‌గా చేశారు. నేను డాన్స్‌ వేశాను అంతే..కానీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఆ సాంగ్‌ వేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్‌ నేను ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు అని వరుణ్ సందేశ్ చెప్పారు.

పూజ హెగ్డే గురించి

పూజ హెగ్డే గురించి

పూజ హెగ్డేతో నాలుగు సంవత్సరాల క్రితం ముకుంద సినిమా చేశాను. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ఒక కోఇన్సిడెంట్‌ ఏంటంటే పూజతో ఫస్ట్‌ యానాంలో షూట్‌ చేశాం. ఇప్పుడు 'ఎల్లువచ్చి గోదారమ్మ' సాంగ్‌తో అదే యానాంలో షూటింగ్‌ పూర్తి చేశాం. తను యాక్టింగ్‌, డాన్స్‌ పరంగా చాలా ఇంప్రూవ్‌ అయింది. ఈ సినిమాలో దేవి క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా కుదిరింది. తన క్యారెక్టర్‌ సినిమాకు ఒక ప్లజంట్‌ ఫీలింగ్‌ తీసుకువస్తుంది అని వరుణ్ అన్నారు.

డబ్బింగ్‌ చెప్పడానికి టైమ్‌ ఎక్కువ తీసుకున్నారంట?

డబ్బింగ్‌ చెప్పడానికి టైమ్‌ ఎక్కువ తీసుకున్నారంట?

వాల్మీకి సినిమా కోసం డబ్బింగ్‌కు చాలా ఎక్కువ సమయం తీసుకున్నా. ఈ సినిమాలో ఇంటర్వెల్‌ బ్లాక్‌లో 20 నిమిషాల సీక్వెన్స్‌ ఉంది. అది సినిమాకు చాలా కీలకం. అలాగే పెర్ఫామెన్స్‌కి బాగా స్కోప్‌ ఉన్న సీన్‌. సినిమాలో మేజర్‌ ట్విస్ట్‌ అది. ఒకే సారి రకరకాల ఎమోషన్స్‌ని పండించాలి. ఆ సీన్ థియేటర్ లో ఆడియన్స్ కి థ్రిల్ ఇస్తుంది. అలాంటి సీన్లు చాలా ఉన్నాయి అందుకే కొంచెం టైమ్‌ తీసుకున్నాను అని వరుణ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X