చిరంజీవి బయోపిక్‌పై ఆ డైరెక్టర్ కసరత్తు.. ఆ హీరో నటించకపోతే నేను చేస్తా.. వరుణ్ తేజ్

'ముకుంద', 'కంచె', 'లోఫర్‌' లాంటి విభిన్నకథా చిత్రాలతో నటుడిగా తనని తాను ప్రూవ్‌ చేసుకొని 'ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్‌ 2' లాంటి సక్సెస్‌ ఫుల్‌ కమర్షియల్‌ చిత్రాలతో ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన హీరోగా పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్‌తో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ..

ప్లే బాయ్‌ జోనర్‌లో చాలా సినిమాలు చేశాను. అయితే ఇప్పుడు ఈ మాస్‌ ఎక్స్పీరియన్స్‌ కొత్తగా ఉంది. మనం ఏ మాస్‌ క్యారెక్టర్‌ చేసిన ఆ క్యారెక్టరైజేషన్‌ తాలూకు రీజన్‌ కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే దానికి పూర్తి న్యాయం చేయగలుగుతాం. ఈ సినిమాలో గద్దలకొండ గణేష్‌ క్యారెక్టర్‌ ఎందుకంత భయంకరంగా ఉంటుందో అన్నదానికి కరెక్ట్‌ రీజన్‌ చూపించారు హరీష్‌ శంకర్‌. అందుకే ఈ క్యారెక్టర్‌ను ఎంజాయ్‌ చేస్తూ చేశాను అని వరుణ్ తేజ్ చెప్పారు.

ప్రమోషన్స్‌లో కూడా అదే గెటప్‌లో కనిపిస్తున్నారు?

ప్రమోషన్స్‌లో కూడా అదే గెటప్‌లో కనిపిస్తున్నారు?

గద్దలకొండ గణేష్ చిత్రంలో గెటప్, పాత్ర నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఇంకా కొన్ని సన్నివేశాలు నన్ను వెంటాడుతున్నాయి. దీనిని మించిన కంఫర్ట్‌ దేనిలో ఉండదు. నేను ఇంట్లో కూడా ఇలానే ఉంటాను. షర్ట్ వేసుకోవడం కంటే కుర్తానే బాగుంటుంది అని వరుణ్ తేజ్ అన్నారు.

ఈ ప్రాజెక్ట్‌ ఎలా స్టార్ట్‌ అయింది?

ఈ ప్రాజెక్ట్‌ ఎలా స్టార్ట్‌ అయింది?

ఫిదా, తొలిప్రేమ తర్వాత చాలా మంది దర్శకుల మాదిరిగానే దర్శకుడు హరీష్‌ శంకర్ కూడా లవ్‌స్టోరీతో వచ్చారు. నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన దాగుడుమూతలు కథ అద్భుతంగా ఉంది. కానీ ఇలాంటి లవ్‌ స్టోరీస్‌ మీరు చేయరు కదా? అని అడిగాను. మీరు ఫిదా, తొలిప్రేమ చిత్రాలు చేశారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్‌ ఉందేమో అని ఈ కథతో వచ్చాను అన్నారు. దానికి లేదు సర్‌ నేను మీతో మీ కైండ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైనర్‌ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. దాంతో జిగర్తాండ చూశావా? అని అడిగారు. చూశాను సర్‌ అన్నాను..దాంతో ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయింది.

తమిళ మాతృకలో ఎంతవరకూ మార్పులు చేశారు?

తమిళ మాతృకలో ఎంతవరకూ మార్పులు చేశారు?

జిగర్తాండ ఒక వండర్ఫుల్‌ స్క్రిప్ట్‌. ఆ ఫీల్‌ పోకుండా మన నేటివిటీకి తగ్గట్లు ఫిఫ్టీ పర్సెంట్‌ చేంజెస్‌ చేశాం. గద్దల కొండ గణేష్‌ క్యారెక్టర్‌ ఎందుకంత భయంకరంగా ఉంటుందో అన్నదానికి ఫ్లాష్‌ బ్యాక్‌ యాడ్‌ చేసి నిడివి కొంచెం ఎక్కువ చేశాం. మిగతా క్యారెక్టర్స్‌ అలానే కొన్ని సీన్లు అలాగే తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ క్యారెక్టర్‌ చేస్తున్నాఅనగానే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ రియాక్షన్‌ ఏంటి?

ఈ క్యారెక్టర్‌ చేస్తున్నాఅనగానే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ రియాక్షన్‌ ఏంటి?

- మా ఫ్యామిలిలో చాలా మంది జిగర్తాండ సినిమా చూడలేదు. నా స్నేహితులు చాలా మంది కరెక్ట్‌ కాదేమో ఆలోచించుకో అన్నారు.. నేను చిరంజీవి గారికి ఫోన్‌ చేసి డాడీ కథ ఇలా అనుకుంటున్నాను అన్నాను. తరువాత హరీష్‌ నేను వెళ్లి కలిసాం. కథ చాలా బాగుంది నువ్వు తప్పకుండా చేయాలి అని చిన్న చిన్న సజెషన్స్‌ ఇచ్చారు. హరీష్‌ గారు కూడా వాటిని అప్లై చేశారు.

చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి గారిని సైరా సినిమాలో హిస్టారికల్‌ రోల్‌లో చూస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంది. ఆయన ఏం చేసినా నేను చూస్తాను. నా సినిమాల కన్న కూడా ఆయన సినిమాలే ఎక్కువ చూస్తాను. దర్శకుడు హరీష్ శంకర్ ఈ మధ్య మాటల్లో చిరంజీవి బయోపిక్ చేస్తాను అని అన్నాడు. అందుకు రాంచరణ్ అయితే బాగుంటుంది అని చెప్పాను. ఒకవేళ రాంచరణ్ చేయకపోతే నేను మాత్రం చేస్తానని చెప్పాను అని వరుణ్ తేజ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X