Varun Tej మూడు పేజీల డైలాగ్స్ సింగిల్ టేక్‌లో.. నేనే ఆశ్చర్యపోయా.. గాండీవధారి అర్జున బలం అదే!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఏజెంట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన సాక్షి వైద్య జంటగా నటించిన గాండీవధారి అర్జున చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ..

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సినిమాలను చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన తీసే సినిమాలు చాలా డిఫరెంట్‌గా, విభిన్నమైన కాన్సెప్ట్‌తో తీస్తారు. చందమామ కథలు, గరుడ వేగ సినిమాల నాకు బాగా నచ్చాయి. గని సినిమా షూట్‌లో ఉండగా ప్రవీణ్ సత్తారు నుంచి కాల్ వచ్చింది. యాక్షన్ మూవీ తీద్దామని అనుకొంటున్నానని చెప్పారు. నేను కథేంటి అని అడగలేదు. ఆయన యాక్షన్ సినిమాలు ఎలా తీస్తారో నాకు బాగా తెలుసు. ఆ నమ్మకమే కథ వినకుండా ఒప్పుకొన్నాను. ఆ తర్వాత కథ విన్న తర్వాత ఎంత స్టైలిష్‌గా తీయబోతున్నారో నాకు అర్ధమైంది అని వరుణ్ తేజ్ చెప్పారు.

Varun Tej Interview About Gandeevadhari Arjuna

కంటెంట్ తక్కువగా, స్టైలిష్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ సినిమాలు ఉంటాయి. కానీ ప్రవీణ్ కథ చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకొన్నది. ఈ సినిమాలో డీల్ చేసిన పాయింట్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొంటుంది. ఈ సినిమాలోని పాయింట్ అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ప్రధానమైన పాయింట్ చుట్టూ ప్రవీణ్ సత్తారు అల్లిన ఎమోషన్స్ చాలా బాగా వచ్చాయి. ప్రతీ ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది అని వరుణ్ తేజ్ చెప్పారు.

Varun Tej Interview About Gandeevadhari Arjuna

గాండీవధారి అర్జున చిత్రంలోని పాత్ర బాధ్యతాయుతమైనది. అలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయి. నా కెరీర్‌లో F2, F3 లాంటి కామెడీ సినిమాలు చేశాను. కానీ ఎమోషన్స్‌తో ఉండే యాక్షన్ సినిమాలను నేను ఎక్కువగా ఇష్టపడుతాను. మంచి కథతో సోషల్ రెస్సాన్సిబిలిటి ఉండే సినిమా చేయాలనే సమయంలో ఈ సినిమా నా ముందుకు వచ్చింది. ఇలాంటి కథలు చెప్పాలనే ఓ బాధ్యతయుతమైన ప్రయత్నమే గాండీవధారి అర్జున అ3ని వరుణ్ తేజ్ అన్నారు.

Varun Tej Interview About Gandeevadhari Arjuna

కథకు పక్కాగా సరిపోయే టైటిల్ గాండీవధారి అర్జున. ఈ సినిమా టైటిల్ అర్ధం ఏమిటంటే ఆపదలో ఉన్నవారు సహాయం కోసం ఆర్థించడం. ఏదైనా సమస్య ఉంటే.. హీరోను అందరూ కాల్ చేస్తుంటారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు అర్జున్. అందుకే ఈ సినిమా టైటిల్‌ను అలా పెట్టాం. ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీన్లు ఉంటాయి.రోప్ షాట్స్, సీజీ వర్క్‌తో యాక్షన్ సీన్లను అద్బుతంగా తీశాం అని వరుణ్ తేజ్ చెప్పారు.

Varun Tej Interview About Gandeevadhari Arjuna

గాండీవ‌ధారి అర్జున సినిమాలో ఓ కీలకమైన పాత్రలో సాక్షి వైద్య నటిస్తున్నారు. సాక్షి వైద్య ఫోకస్ ఉన్న యాక్టర్. మూడు పేజీలున్న డైలాగ్స్‌ను సింగిల్ టేక్‌లో క్లియర్ చేయడంతో నేను ఆశ్చర్యపోయాను. సినిమా పరిశ్రమలో ఏదో సాధించాలనే తపనతో వచ్చిన ఆమె ఆ దిశగా దృష్టిపెట్టారని అనిపించింది. సాక్షితో కాంబినేషన్ సీన్లు బాగుంటాయి అని వరుణ్ తేజ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X