నయీం నరరూప రాక్షసుడు.. వారి కోసం అలా తెగించాడు.. అదే నాకు ఛాలెంజ్.. నయీం డైరీస్ హీరో వశిష్ట సింహ
కన్నడ చలన చిత్ర పరిశ్రమలో యష్‌తో రాజు హూలి, కేజీఎఫ్ చిత్రంలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొన్న వశిష్ట సింహ ప్రస్తుతం నయీం డైరీస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. కిల్లింగ్ వీరప్పన్ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించిన దాము బాలాజీ ఈ చిత్రానికి దర్శకుడు. మాజీ నక్సలైట్ అయిన దామూ బాలాజీకి నయీం జీవితంలోపై పూర్తిగా అవగాహన ఉంది. నయీం జీవితానికి సంబంధించి నాణెనికి మరో కోణాన్ని నయీం డైరీస్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో నయీం పాత్రను పోషించిన వశిష్ట సింహ ఫిలింబీట్ తెలుగుతో మాట్లాడుతూ..

కన్నడలో యష్ మూవీతో గుర్తింపు
కన్నడ సినీ రంగంలో నటుడిగా ఒకట్రెండు సినిమాలు చేశాను. కానీ అవి సరిగా ఆడలేదు. కానీ యష్‌తో ఒక సినిమా చేసిన తర్వాత నాకు మంచి గుర్తింపు వచ్చింది. యష్ నటించిన రాజా హూలి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాను. ఆ పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం, మా నాన్న భుజం తట్టి ప్రోత్సహించడంతో నేను నటుడిగా కావాలని నిర్ణయించుకొన్నాను. ఆ తర్వాత కేజీఎఫ్ కూడా మంచి పేరు తీసుకురావడంతో నటుడిగా గుర్తింపు పొందాను అని వశిష్ట సింహ పేర్కొన్నారు.

కిరాక్ పార్టీలో సింగర్‌గా
నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ సినిమాలో నేను సింగర్‌గా పాడపాడటం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత కేజీఎఫ్, నారప్ప చిత్రాలతో నన్ను తెలుగు ఆడియెన్స్ గుర్తించడం మొదలైంది. దాంతో తెలుగులో నటించాలనే కోరిక మరింత పెరిగింది.

నయీం డైరీస్ అవకాశం ఎలా వచ్చిందంటే..
నయీం డైరీస్ సినిమా అవకాశం గురించి చెప్పాల్సి వస్తే.. చిత్తూరుకు చెందిన నిర్మాత వరదరాజు బెంగళూరుకు చెందిన వారు. దర్శకుడు దాము బాలాజీతో ఈ సినిమా తీయాలనుకొన్నప్పుడు నిర్మాత నా గురించి దాముకు చెప్పారు. అలా దాముతో నా ప్రయాణం మొదలైంది. నాకు కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్ అయ్యాను. రకరకాల షేడ్స్ ఉన్న పాత్ర లభించడంతో నాలో ఈ పాత్ర చేయాలనే ఉత్సాహం పెరిగింది. రాక్షసుడి లాంటి ఓ వ్యక్తిలో కూడా మానవత్వం ఉండే అంశం నన్ను బాగా ఆకట్టుకొన్నది. నయీం లాంటి పాత్రను పోషించాలంటే చాలా ఎనర్జీ కావాలి. అదే నాకు అదే ఛాలెంజ్ అనిపించింది. నయీంకు కుటుంబం అంటే చాలా ఇష్టం. అతనిలోనూ ఓ సాధారణ మనిషిలోనూ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉన్నాయి. అతని జీవితంలోనూ ప్రేమ, పెళ్లి లాంటి సందర్భాలు ఉన్నాయి. నయీం ఫ్యామిలీ అంటే చెప్పలేనంత ప్రేమ. వాళ్ల కోసం ఏదైనా చేయడానికి సిద్దమయ్యే వ్యక్తి. తన కుటుంబానికి జరిగిన అన్యాయంతోనే ఓ రాక్షసుడి అవతారం ఎత్తాడు అని వశిష్ట సింహ తెలిపారు.

దర్శకుడు దాము బాలాజీ చేసిన రీసెర్చ్‌తో
నయీం పాత్ర చేసే ముందు చాలా ఆర్టికల్స్ చదివాను. చాలా వీడియోలు చూశాను. ఆయన ఇంటర్వ్యూలు కూడా చూసి ఆ పాత్రను ఆకలింపు చేసుకొనే ప్రయత్నం చేశాను. వాస్తవానికి దర్శకుడు దాము బాలాపీ కూడా మాజీ నక్సలైట్. ఆయన చేసిన రీసెర్చ్ నాకు ఉపయోగపడింది. దర్శకుడు దాము బాలాజీ పాత్ర గురించి చెప్పిన విషయాలు నాలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. నయీం డైరీస్ సినిమాను చాలా వాస్తవికంగా తెరకెక్కించాడు. నయీం డైరీస్ సినిమాలో యాక్షన్, రొమాన్స్ ఆకర్షణగా ఉంటాయి. నయీం డైరీస్ మూవీ కన్నడ, తెలుగులో ఒకేసారి తెరకెక్కించాం. సినిమా పూర్తి చేసిన తర్వాత నేను నయీం పాత్రకు న్యాయం చేశానా అనే భయం పెరిగింది. సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల రియాక్షన్ గురించి ఎదురు చూస్తున్నాను అని వశిష్ట సింహ వెల్లడించారు.

ముందు కోపం.. ఆ తర్వాత జాలి
నయీం కథ ఎవరైనా ముందు వింటే కోపం వస్తుంది, ఆ తర్వాత జాలి కలుగుతుంది. నేను కూడా నయీం గురించి యూట్యూబ్ ద్వారా నెట్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. మీడియా ఇంటర్వ్వూస్ చూశాను, ఆర్టికల్స్ చదివాను. నక్సలైట్స్ గురించి తెలుసుకున్నాను. ఇలా నయీం క్యారెక్టర్ కోసం కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యాను. స్క్రిప్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రైమ్ ను, ఎమోషన్ ను దర్శకుడు కొత్తగా చూపించారు. డైలాగ్స్ బాగుంటాయి అని వశిష్ట సింహ చెప్పారు.

నా తదుపరి చిత్రాలు
నయీం డైరీస్ సినిమా తర్వాత నేను సంపత్ నంది దర్శకత్వంలో ఓదెల రైల్వే స్టేషన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న సింబా మూవీలో హీరో రోల్ చేస్తున్నాను. యష్‌తో నటించిన కేజీఎస్ 2 సినిమా రిలీజ్ సిద్దమైంది. ఏప్రిల్ 2022లో రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











