సీట్లకు అత్తుకుపోయే ఎక్సైటింగ్‌తో కస్టడీ.. కొత్త నాగచైతన్యను చూస్తారు.. వెంకట్ ప్రభు (ఇంటర్వ్యూ)

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వస్తున్న తెలుగు, తమిళ చిత్రం కస్టడీ. అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్‌ కుమార్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మే 12న కస్టడీ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

ఓ సాధారణమైన కానిస్టేబుల్ కథ : కోవిడ్ సమయంలో నయట్టు అనే సినిమా చూసినప్పుడు ఈ కథ నా మైండ్‌లోకి వచ్చింది. అయితే ఆ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. కానీ తెలుగు, తమిళ ప్రేక్షకుల కోసం కమర్షియల్ విలువలతో సినిమా చేయాలని అనుకొన్నాను. జీవితంలో మంచి ఆశయంతో ఉన్న ఓ సాధారణ కానిస్టేబుల్ కథ చెప్పాలనేది ఆలోచన. అలాంటి కథ రాస్తున్న సమయంలో నాగచైతన్య నటించిన లవ్ స్టొరీలో ఓ పాట చూశాను. అప్పుడు నా కస్డడీ సినిమాలోని హీరో పాత్రకు నాగచైతన్య సరిపోతాడని అనిపించింది అని వెంకట్ ప్రభు చెప్పారు.

prabhu

కస్టడీ జర్నీ ఎలా ప్రారంభమైందంటే : బంగర్రాజు సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్యను కలిసి కస్టడీ లైన్ చెప్పాను. అరగంట సేపు చెప్పిన ఆ లైన్ వినగానే నాకు బాగా నచ్చిందని చెప్పాడు. స్క్రిప్టు రెడీ చేయమని చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నచ్చడంతో నిర్మాత శ్రీనివాస చిట్టూరి జాయిన్ అయ్యారు. నేను చేసిన ఓ సినిమా చూసిన తర్వాత నాతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఆయనకు అనిపించిందట. అలా కస్టడీ సినిమా జర్నీ మొదలైయింది అని వెంకట్ ప్రభు తెలిపారు.

custody

ఎమోషనల్ లవ్, ఫ్యామిలీ డ్రామా : కస్టడీ సినిమాలో చాలా ఎమోషనల్ అంశాలు ఉంటాయి. ఈ సినిమా కథలో లవ్ ఉంటుంది. కానీ లవ్ స్టోరి ఉండదు. ఈ సినిమా శివ అనే కానిస్టేబుల్ జీవితంలోని కొన్ని సమస్యలతో మొదలవుతుంది. తనది కాని సమస్యను శివ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు నుంచి క్లైమాక్స్ వరకు కస్టడీ సినిమా ప్రేక్షకుడిని సీటుకు అత్తుకుపోయి చూసేలా ఉంటుంది. తెలుగు, తమిళ ఆడియన్స్ అభిరుచికి తగట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించాం. యూనివర్సల్ సబ్జెక్ట్‌ను అందరూ ఎంజాయ్ చేసేలా రూపొందించాం. మంచి స్క్రీన్ ప్లే‌తో సినిమా పరుగులు పెడుతుంది అని వెంకట్ ప్రభు చెప్పారు.

custody

ఇద్దరు బలవంతుల మధ్య నాగచైతన్య : కస్టడీ సినిమా చూసినప్పుడు స్క్రీన్‌పై చైతూ కంటే పవర్ ఫుల్‌గా కనిపించే పర్సనాలిటీ కావాలనే ఆలోచనతో అరవింద్ స్వామిని తీసుకోవడం జరిగింది. మరో పక్క శరత్ కుమార్ లాంటి పవర్‌ఫుల్ వ్యక్తి ఉంటాడు. ఇలాంటి ఇద్దరు బలవంతులైన సాధారణమైన వ్యక్తి ఎలా కంట్రోల్ చేస్తారనే ఉత్సాహం, ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ ఇద్దరిని ఎలా డీల్ చేస్తాడనే ఆసక్తితో పాత్ర‌తో కనెక్ట్ అవుతారు. అరవింద్, శరత్ కుమార్ పాత్రలను నాగచైతన్య పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేక్షకులకు పరిచయం చేయడం ఈ కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అని వెంకట్ ప్రభు చెప్పారు.

custody

కృతి శెట్టి ఎలా నటించిందంటే : నాగచైతన్య అద్భుతమైన నటుడు. ఈ చిత్రంలో కొత్త చైతన్యను చూస్తారు. ఈ సినిమాకు శివ అని టైటిల్ పెడుదామని అనుకొన్నాను. కానీ చై వద్దని చెప్పాడు. ఎందుకంటే కంపారిజన్స్ వస్తాయి. కాబట్టి మన కథ విషయంలో కరెక్ట్ కాదని చెప్పారు. ఇందులో రేవతి అనే పాత్రలో కృతి శెట్టి నటించింది. గ్రామీణ నేపథ్యం ఉన్న అమ్మాయిగా చాలా నటించింది. కథలో కృతి పాత్ర కీలకంగా ఉంటుంది.నేను ఎలాగైతే ఊహించుకొన్నానో.. అలానే తెర మీద కనిపిస్తుంది అని వెంకట్ ప్రభు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X