twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rama Naidu Biopic పై విక్టరీ వెంకటేష్ క్లారిటీ.. మూవీ మొఘల్ గురించి ఏమన్నారంటే?

    |

    విక్టరీ వెంకటేష్ నటించిన F3 చిత్రం మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదాతో కలిసి నటించిన F2 సినిమాకు ఫ్రాంచైజీగా ఈ చిత్రం వస్తున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌తో కొద్ది రోజులుగా బిజీగా ఉన్నారు. F3 మూవీ గురించి, వ్యక్తిగత వివరాలును, అలాగే ఫ్యామిలీ అంశాల గురించి వెంకటేష్ పలు విషయాలను వెల్లడించారు. వెంకటేష్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

    ఓటీటీలో మూవీస్ రిలీజ్ గురించి

    ఓటీటీలో మూవీస్ రిలీజ్ గురించి

    నారప్ప, దృశ్యం 2 చిత్రాలు ఓటీటీలో తప్పనిసరి పరిస్థితుల్లో రిలీజ్ అయ్యాయి. కానీ F3 మూవీ మళ్లీ థియేటర్‌లో రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. F3 లాంటి నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు థియేటర్‌లో చూస్తే వచ్చే కిక్ వేరుగా ఉంటుంది. క్యారెక్టర్ల గురించి ప్రేక్షకుడు ఫీలయ్యే అవకాశం కలుగుతుంది. థియేట్రికల్ అనుభూతి అనేది ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటాయి అని వెంకటేష్ తెలిపారు.

    డబ్బు అంటే అందరికి ఇష్టమే

    డబ్బు అంటే అందరికి ఇష్టమే

    F3 సినిమాలో నేను పిసినారి లాంటి క్యారెక్టర్‌ను ప్లే చేశాను. అలాగే రేచీకటితో బాధపడే వ్యక్తిగా నటిస్తున్నాను. అయితే డబ్బు జీవితంలో అందరికి ముఖ్యమే. అంతేగానీ డబ్బు కోసం పాకులాడే వ్యక్తిని కాదు. భగవంతుడు ఎంత ఇస్తే అంత ఆశిస్తాను. ఈ చిత్రంలో పోషించే పాత్రలకు నా నిజ జీవితానికి ఎలాంటి పోలీకలు ఉండవు. నేను పాత్ర వరకే పరిమితం అయ్యాను అని వెంకటేష్ అన్నారు.

    కలెక్షన్లు, రికార్డులపై ఆసక్తి లేదు

    కలెక్షన్లు, రికార్డులపై ఆసక్తి లేదు

    బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. భారీగా కలెక్షన్లు సాధించే రేసులో నేను ఎప్పుడూ లేను. కానీ నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకొంటాను. నా సినిమాలు రికార్డులు సృష్టించే కలెక్షన్లు సాధించాయి. కానీ నాకు రికార్డులపై నమ్మకం లేదు. రికార్డులనేవి ఏదో ఒకరోజు బ్రేక్ కావాల్సిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సెట్ చేయడమనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమా తీయడం వరకే మా చేతుల్లో ఉంటుంది. ఒకసారి ప్రేక్షకుల చేతిలోకి వెళ్లిన తర్వాత అది మన చేతులో ఉండదు అని వెంకటేష్ చెప్పారు.

    నిర్మాతగా ఆలోచిస్తాను

    నిర్మాతగా ఆలోచిస్తాను

    నేను హీరోగా నటించినప్పటికీ.. నా సినిమాల బడ్జెట్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. సెట్‌లో, సినిమా మేకింగ్‌లో దుబారాను నేను సహించలేను. నేను ఓ నిర్మాత ఆలోచించినట్టే ఆలోచిస్తాను. అది మా నాన్న నుంచి నేను నేర్చుకొన్నాను. ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన వాడిగా నాకు డబ్బు విలువ తెలుసు. సినిమాలు కలెక్షన్లు సాధిస్తే.. ఖర్చు, బడ్జెట్ గురించి ఆలోచించం. కానీ సినిమా ఆడకపోతేనే అనేక రకాల ఆలోచనలు వస్తాయి అని వెంకటేష్ అన్నారు.

    మా అబ్బాయి ఎంట్రీ ఎప్పుడంటే?

    మా అబ్బాయి ఎంట్రీ ఎప్పుడంటే?


    మా అబ్బాయి సినిమాల్లోకి తీసుకురావడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం చదువుకొంటున్నాడు. చదువు పూర్తయిన తర్వాత అతడి ఇంట్రెస్ట్‌ను బట్టి ఆలోచిస్తాం. ఇప్పుడే మా అబ్బాయిని సినిమా చేయమని డిస్ట్రబ్ చేసే ఉద్దేశం లేదు. ఏది ఎప్పుడు జరుగాలో అప్పుడే జరుగుతుంది. మా అబ్బాయి సినిమా ఎంట్రీకి చాలా సమయం ఉంది అని వెంకటేష్ పేర్కొన్నారు.

    రామానాయుడు బయోపిక్ గురించి

    రామానాయుడు బయోపిక్ గురించి


    మంచి వ్యక్తుల జీవితానికి సంబంధించిన పాత్రలు పోషించాలని ఉంది. వివేకానందుడి బయోపిక్ చేయాలనే కోరిక ఉంది. ఎవరైనా స్క్రిప్ట్ తీసుకొస్తే మా నాన్న, లెజండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు బయోపిక్‌ను రూపొందించే విషయంపై ఆలోచిస్తాం అని వెంకటేష్ తెలిపారు.

    English summary
    Actor Victory Venkatesh chit chat with media over F3 movie which is releasing on May 27th. Venkatesh reacted on Father and Producer Rama Naidu's Boipic at F3 movie promotions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X