twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గూగుల్‌లో టైప్ చేస్తే ఆయన పేరే ఫస్ట్.. అందుకే ఆయన లెజెండ్.. రంగ్ దే గురించి డైరెక్టర్ వెంకీ అట్లూరి

    |

    సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన రంగ్ దే చిత్రం మార్చి 26న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. నితిన్, కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నితిన్, కీర్తి సురేష్ కెమిస్ట్రీ, పీసీ శ్రీరాం కెమెరా పనితనం గురించి వెల్లడిస్తూ...

    మ్యూజిక్ మాంత్రికుడి మరో అవతారం.. నిర్మాతగా మారిన ఏఆర్ రెహ్మన్!

     పక్కింటి యువకుడు, యువతి కథతో

    పక్కింటి యువకుడు, యువతి కథతో

    తొలి ప్రేమ, మజ్ను లాంటి రెండు ప్రేమ కథలను సినిమాలుగా తెరకెక్కించిన తర్వాత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు లవ్ స్టోరిని తెరకెక్కించాలని అనుకొన్నాను. ఇరుగు పొరుగున ఉండే రెండు కుటుంబాల మధ్య, యువతీ, యువకుడి మధ్య కథ ఇది. తెరమీద ఈ కథను చూస్తే మన పక్కింట్లో జరుగుతున్నదా అనే ఫీలింగ్ కలుగుతుంది. అలా పక్కింటి అబ్బాయితో ఓ అమ్మాయి వ్యవహారం పెళ్లి వరకు వస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌తో తెరకెక్కించిన చిత్రం రంగ్ దే అని వెంకీ అట్లూరి తెలిపారు.

    నితిన్ నా మైండ్‌లో లేడు

    నితిన్ నా మైండ్‌లో లేడు

    రంగ్ దే కథను రాసుకొన్నప్పుడు నితిన్ నా మైండ్‌లో లేడు. స్టోరీ పూర్తయిన తర్వాత కొందరు హీరోలకు చెప్పాను. ఆ క్రమంలో నిర్మాత నాగవంశీని కలిసి కథ చెబితే.. నితిన్ వినిపించమని చెప్పారు. నితిన్ కథ చెప్పే సమయంలో ఈ సినిమాకు పీసీ శ్రీరాం పనిచేస్తున్నాడని చెప్పగానే.. మొదటి సిట్టింగ్‌లోనే ఒకే చేశాడు. దాంతో నేను ఓ రకంగా షాక్ తిన్నాను అని వెంకీ అట్లూరి తెలిపారు.

    మహానటి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోలేదు

    మహానటి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోలేదు

    మహానటి‌తో కీర్తి సురేష్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. మహానటి సినిమా తర్వాత ఆమె చేస్తున్న ప్రాజెక్టులు గురించి తెలియదు. నాకు ఓ పక్కింటి అమ్మాయి కావాలి అనే ఆలోచనతో ఆమెకు కథ చెప్పాను. ఆమె వెంటనే అంగీకరించడంతో నా హీరోయిన్ ఎంపిక సులభమైంది అని వెంకీ అన్నారు.

    నాకంటే నితిన్, కీర్తీకే ఎక్కువ నమ్మకం..

    నాకంటే నితిన్, కీర్తీకే ఎక్కువ నమ్మకం..

    కీర్తి సురేష్ సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఆమెతో సెట్లో తొందర్లోనే కంఫర్ట్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దాంతో ఆమెతో పనిచేయడం చాలా సులభమైంది. నితిన్ నాకు చాలాకాలంగా తెలుసు. దాంతో నాకు అతడికి మధ్య ఎక్కువగా గ్యాప్స్ లేవు. రంగ్ దే కథను నా కంటే ఎక్కువగా నితిన్, కీర్తి సురేష్ నమ్మడంతో నా పని సులభమైంది అని వెంకీ వెల్లడించారు.

    Recommended Video

    Nithiin చెక్ మూవీ ఫ్లాప్.. Rang De పైనే ఆశలు.. బాక్సాఫీస్ టార్గెట్
    పీసీ శ్రీరాం గొప్పతనం అదే..

    పీసీ శ్రీరాం గొప్పతనం అదే..

    సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాంతో పనిచేయడం గొప్ప అనుభవం. నేను కథ రాసుకొనేటప్పుడు ఆయనతో పనిచేయాలనే ఆలోచన నాకు లేదు. ఇండియాలో గొప్ప కెమెరామెన్ ఎవరని గూగుల్‌‌లో టైప్ చేస్తే పీసీ శ్రీరాం పేరు మొదట కనిపిస్తుంది. పీసీ శ్రీరాంను కలిసి కథ చెప్పిన తర్వాత ఇంగ్లీష్‌లో బౌండెడ్ స్క్రిప్టు కావాలని అడిగాడు. దాంతో నేను నెలరోజులు సమయం అడిగాను. బౌండెడ్ స్క్రిప్టు ఇచ్చిన తర్వాత తన టీమ్ అందరితో దానిపై వర్క్ చేశారు. షూటింగ్ సమయానికి గంట ముందే సెట్లోకి వచ్చి టీమ్ అందరితో మీటింగ్ పెట్టి షాట్ పెట్టుకొంటారు. అందుకే ఆయన లెజెండ్ అయ్యారు అని వెంకీ అట్లూరి తెలిపారు.

    English summary
    Rang De starring Nithiin and Keerthy Suresh in the lead roles, is releasing grandly worldwide on March 26th. The film is produced by Sithara Entertainments while it is written and directed by Venky Atluri. Ahead of the release, the director interacted with the media to share his working experience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X