వీడు పవన్ కమ్‌బ్యాక్ మూవీకి డైరెక్టరా? నాపై నెటిజన్లు దారుణంగా.. ట్రోల్స్ గురించి వేణు శ్రీరాం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ట్రైలర్ రికార్డులను తిరగరాస్తున్నది. రిలీజైన కొద్ది గంటల్లోనే సంచలనాలను నమోదు చేసింది. ఇలాంటి క్రేజీ మూమెంట్స్ మధ్య వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వేణు శ్రీరాం మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్, వకీల్ సాబ్ జర్నీని వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే..

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామా మధ్య వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్.. పవర్ స్టార్ అంటూ జై కొట్టిన దిల్ రాజు, వేణు శ్రీరాం

 రికార్డులను బట్టి సినిమాను..

రికార్డులను బట్టి సినిమాను..

రికార్డులను బట్టి సినిమాను గుర్తించుకోరనేది నా అభిప్రాయం. కంటెంట్‌ను, మేకింగ్‌ను బట్టి సినిమా ప్రేక్షకుల హృదయాల్లో సినిమా నిలిచిపోతుంది. మాయాబజార్ సినిమా కలెక్షన్ల ప్రతిపాదికన గుర్తుంచుకోలేదు. అలాగే బొమ్మరిల్లు లాంటి సినిమాల కంటెంట్‌ మాత్రమే ప్రేక్షకులను మెప్పించింది అని వేణు శ్రీరాం పేర్కొన్నారు.

నేను దర్శకుడినని చెప్పగానే

నేను దర్శకుడినని చెప్పగానే

పింక్ రీమేక్‌గా పవన్ కల్యాణ్ కమ్‌బ్యాక్ సినిమా రాబోతున్నది. వేణు శ్రీరాం దర్శకుడు అనగానే ఫ్యాన్స్, నెటిజన్లలో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నది. పవన్ రీ ఎంట్రీ సినిమాకు మరో డైరెక్టర్ దొరకలేదా.. అసలు వీడెవడూ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకొన్నారు. వాస్తవానికి నేను సోషల్ మీడియాలో లేకపోవడంతో బతికిపోయాను అని వేణు శ్రీరాం తెలిపారు.

వకీల్ సాబ్ ఆఫర్ నా ముందుకు రావడంతో

వకీల్ సాబ్ ఆఫర్ నా ముందుకు రావడంతో

వకీల్ సాబ్ సినిమా కోసం నేను ప్రయత్నించలేదు. వకీల్ సాబ్ సినిమాను డైరెక్ట్ చేయమనే ఆఫర్ నా ముందుకు వచ్చింది. పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేయాలనే నా కోరిక అలా తీరింది. పవన్ కల్యాణ్‌తో ప్రతీ నిమిషం, ప్రతీ అనుభవం అమూల్యమైనది. వకీల్ సాబ్ విషయంలో చేసిన మార్పులు పవర్‌స్టార్‌కు నచ్చాయి అని వేణు శ్రీరాం అన్నారు.

వకీల్ సాబ్ టైటిల్‌లో పవన్ కల్యాణ్

వకీల్ సాబ్ టైటిల్‌లో పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ నడుచుకొంటూ వచ్చే స్టిల్‌ను వకీల్ సాబ్ టైటిల్‌లో పెట్టాలన్నది నా నిర్ణయమే. సినిమా షూటింగు సమయంలో నెటిజన్లు లీక్ చేసిన స్టిల్ నాకు బాగా నచ్చింది. వెంటనే టైటిల్‌లో పెట్టాలని డిజైనర్ అనిల్, భానుకు చెప్పాం. వెంటనే ఆయన టైటిల్‌ను డిజైన్ చేసి ఇచ్చారు అని వేణు శ్రీరాం చెప్పారు.

హీరోయిన్ల ఎంపిక గురించి..

హీరోయిన్ల ఎంపిక గురించి..

హీరోయిన్ల ఎంపిక గురించి మీడియాలో మాత్రమే చర్చ జరిగింది. సినిమాకు సంబంధించిన పాత్రలకు నటీనటుల ఎంపికలో ఎలాంటి డిస్కషన్ జరగలేదు. కొత్తగా, అమాయకంగా కనిపించే అమ్మాయి కోసం అనన్య నాగళ్లను తీసుకొన్నాం. ఎమోషన్స్ పండించే పాత్ర కోసం అంజలిని తీసుకొన్నాం. వర్కింగ్ ఉమెన్ అనే రిఫ్లక్షన్ కోసం నివేదా థామస్‌ను అనుకొన్నాం అని వేణు శ్రీరాం తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X