Narappa on Amazon అభిమానులకు సారీ చెబుతున్నా.. అది చాలా రిస్క్.. వెంకటేష్ ఎమోషనల్!
తమిళంలో ధనుష్, వెంట్రీమారన్ కాంబినేషన్‌లో వచ్చిన అసురన్ సినిమాకు రీమేక్ వస్తున్న నారప్ప ఓటీటీలో రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ నారప్పగా అసురన్‌లో ధనుష్ పోషించిన పాత్రను చేస్తున్నారు. నారప్ప చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 20వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ ఫిలింబీట్ తెలుగులో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే..
Recommended Video

ఓటీటీలో సడెన్‌గా నారప్ప రిలీజ్ చేయాల్సి వచ్చింది?
నారప్ప సినిమాను ఓటీటీలో సడెన్‌గా రిలీజ్ చేయడం లేదు. కాలంతో ప్రయాణిస్తే మీకు సడెన్‌గా అనిపిస్తుంది. నేను కాలంతో ప్రయాణించను. అందుకే నాకు సడెన్‌గా తీసుకొన్న నిర్ణయం అనిపించదు. కొన్నిసార్లు నిర్ణయాలు జరిగిపోతాయి. వాటిని ఎందుకు అని ప్రశ్నించకూడదు. అందరికి ఫస్ట్ టైమ్ అనేది ఉంటుంది. నా సినిమా విషయంలో ఓటీటీలో రిలీజ్ కావడం ఇదే ఫస్ట్‌టైమ్. జీవితంలో ఏది మన ముందుకు వస్తే దానిని అంగీకరించాలి అని వెంకటేష్ అన్నారు.

ఓటీటీ రిలీజ్ విషయంలో ఎంత వరకు మీ నిర్ణయం ఉంది?
నా కెరీర్ ఆరంభం నుంచి సినిమా కమర్షియల్స్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. నా డ్యూటీ నేను బాగా చేశానా? లేదా నా కర్తవ్యాన్ని నిర్వహించానా అనేది చూసుకొంటాను. గతంలో కూడా ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారని నా ఫ్యాన్స్, సినీ వర్గాలు అడుగుతుంటారు. దానికి నేను పట్టించుకోను అని అంటాను. పరిస్థితుల వల్ల అలాంటివి చోటుచేసుకొంటాయి అని వెంకటేష్ అన్నారు.

నారప్ప థియేటర్లలో రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురికారా?
నారప్ప థియేటర్లలో రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురికారా?
సాధారణంగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేయాలని నా ఫ్యాన్స్ కోరుకొంటారు. కానీ పరిస్థితులు వల్ల ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. నా ఫ్యాన్స్ చాలా డిజాపాయింట్ అయ్యారు. నా అభిమానులు నిరుత్సాహపడ్డారు. ఆ విషయంలో నేను సారీ చెబుతున్నాను. నా ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు నన్ను అర్థం చేసుకొంటారని తెలుసు. నా సినిమాలు 100 రోజులు ఆడకపోయినా.. కలెక్షన్లు సరిగా రాకపోయినా ఎప్పుడూ వారు కంప్లయింట్ చేయలేదు. ఎప్పుడూ ప్రేమను కురిపిస్తారు. అని వెంకటేష్ అన్నారు.

అసురన్ రీమేక్‌లో నటించడానికి కారణం ఏమిటి
అసురన్ సినిమా చూసిన తర్వాత ఇది చేస్తే ఛాలెంజింగ్‌గా ఉంటుందని అనుకొన్నాను. అసురన్ లాంటి క్లాసిక్ ఫిలింను అందించిన ధనుష్, వెంట్రీమారన్‌కు ధన్యవాదాలు. రీమేక్ సినిమాలు చేయడమంటే గొప్ప ఛాలెంజ్. ఇంతకు ముందు నటించిన వారి హావభావాలు చాలా ఫర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. వాటిని పండించాలంటే మామూలు విషయం కాదు. నా కెరీర్ ఆరంభం నుంచి రీమేక్ చేయడం, వాటిని ప్రేక్షకులు మెప్పించేలా చేయడం జరుగుతూ వస్తున్నది. చంటి, సుందరకాండ, గురు లాంటి సినిమాలు నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి అని వెంకటేష్ అన్నారు.

హిట్టయిన సినిమాలను చేయడం రిస్క్ కాదా?
రీమేక్ సినిమాల్లో నటించడం అంత సులభం కాదు. అప్పటికే పెద్ద హిట్ అయిన సినిమాలు చేయడం ఓ రిస్క్. ఫలానా హీరో బాడీ లాంగ్వేజ్‌ను చూసి.. దాని కంటే ఎక్కువగా, బెటర్‌గా చేయడమనేది ఈజీ కాదు. నా కెరీర్‌లో రియల్ ఛాలెంజ్ అంటే నారప్ప సినిమానే. ధనుష్ లాంటి ఆర్టిస్ట్‌ను కాదు. కాకపోయినా డిఫరెంట్ రోల్స్ చేయాలన్నది నా కోరిక. వయసు మీరిన పాత్రలు చేయడం ఛాలెంజ్. నేను కూడా మధ్య వయసులో ఉండటంతో ఆ పాత్రలో ఒదిగిపోయాను. 50 రోజులపాటు అదే డ్రస్సులో ఉన్నాను. ఆ పాత్ర తాలుకు ఇంపాక్ట్ నాపై ఉండటానికి అదే డ్రస్‌లో కొనసాగాను అని వెంకటేష్ తెలిపారు.

రీమేక్ చేస్తే ఒరిజినల్ సినిమాను పోల్చి చూస్తే?
ఏదైనా సినిమా రీమేక్ చేస్తే.. పోలీకలు అనేది ఉంటాయి. రీమేక్ సినిమాలకు తప్పనిసరి. అయితే పాత్రను పండించడంలో నేను ఎంత నిజాయితీగా ఉన్నాననేది ముఖ్యం. నారప్ప ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ముందు నాటురకం సినిమాలు చేయలేదు. నా కోసం ఇలాంటి పాత్రలు ఎవరూ రాయలేదు. నాకు ఈ అవకాశం రావడంతో అంగీకరించాను. కమర్షియల్‌గా కూడా నిర్మాతలకు వర్కువుట్ అవుతుందనే అభిప్రాయం ఉండటంతో నారప్ప సినిమా చేశాను.


Click it and Unblock the Notifications











