ధనుష్, మోహన్‌లాల్‌పై వెంకటేష్ షాకింగ్ కామెంట్స్.. నా స్టయిల్‌లో నేను చేస్తా అంటూ..

టాలీవుడ్‌లో విక్టరీని ఇంటి పేరుగా చేసుకొన్న నటుడు వెంకటేష్‌కు స్ట్రెయిట్ సినిమాల కంటే రీమేక్ చిత్రాల్లే ఇష్టం అనేది కాదనలేని వాస్తవం. చంటి, సుందరకాండ, గురు, దృశ్యం, నారప్ప చిత్రాలు రీమేక్‌లు కావడం తెలిసిందే. తమిళంలో ఘనవిజయం సాధించిన అసురన్‌కు రీమేక్‌గా వస్తున్న నారప్ప గురించి వెంకటేష్ పలు విషయాలు వెల్లడించారు. నారప్ప చిత్రం జూలై 20వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ..

కరోనా సమయంలో నారప్ప షూటింగ్ ఎలా జరిగింది?

కరోనా సమయంలో నారప్ప షూటింగ్ ఎలా జరిగింది?

నారప్ప చిత్రం ఏకధాటిగా షూటింగ్ సాగి.. ఒకే షెడ్యూల్‌లో ముగిసింది. గ్యాప్ లేకుండా సాగడంతో సినిమాపై, పాత్రపై మంచి గ్రిప్ దొరికింది. సినిమా చేసేటప్పుడు, రిలీజ్ అయ్యేటప్పుడు ప్రతీ హీరో మీద ఒత్తిడి ఉంటుంది. దానిని పట్టించుకోకుండా ఉదయం నుంచే కష్టపడి పనిచేయాలి. దాంతో ఫలితం సానుకూలంగా ఉంటుంది అని వెంకటేష్ తెలిపారు.

రీమేక్స్‌కు గుడ్‌బై చెబుతున్నారా?

రీమేక్స్‌కు గుడ్‌బై చెబుతున్నారా?

తెలుగు సినిమా రంగంలో కొత్త కథలు వస్తున్నాయనేది నిజమే కానీ.. రీమేక్‌లకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదు. నేను నా స్టయిల్‌లో సినిమాలు చేస్తాను. అక్కడేమి జరుగుతుంది.. ఇక్కడేమి జరుగుతుంది.. వాళ్లేమి చేస్తున్నారు? వీళ్లేమి చేస్తున్నారనే పట్టించుకోవద్దు. అలా పక్కలకు చూస్తే మీ జీవితం ఖతం అయిపోతుంది. నీ నిర్ణయాలు నీవు తీసుకోవాలి. వయసు మీద పడుతుంది. వయసుకు తగ్గిన పాత్రలు చేయాలి. కొన్నిసార్లు చేయాలని ఉన్నా.. పాత్రలు, కథలు సరిగా రావు. మనచేతుల ఏమీ ఉండదు అని వెంకటేష్ అన్నారు.

భవిష్యత్ సినిమాలపై ఎలాంటి నిర్ణయం తీసుకొంటున్నారు?

భవిష్యత్ సినిమాలపై ఎలాంటి నిర్ణయం తీసుకొంటున్నారు?

గత రెండేళ్లుగా ఏమి జరుగుతున్నదో మీకు తెలుసు. ప్రకృతి విలయతాండవం ఎలాంటిదో అందరికీ అర్దమైంది. 2020 సంవత్సరం ఉందంటే మనం నమ్మలేం. ప్రకృతి ఎలాంటి గుణపాఠం నేర్పిందో మీకు తెలుసు. అయినా మనం ఆ గుణపాఠాన్ని మరిచిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయాలంటే ఆందోళన కలుగుతున్నది అని వెంకటేష్ అన్నారు.

ధనుష్ చేసిన పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకొన్నారా?

ధనుష్ చేసిన పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకొన్నారా?

అసురన్ రీమేక్ విషయానికి వస్తే.. అల్టిమెట్‌గా ధనుష్ ధనుషే.. వెంకటేష్. వెంకటేష్‌గానే కనిపిస్తారు. వెంకటేష్, ధనుష్ గురించి మరిచిపోండి. నారప్ప పాత్ర ఎలా ఉందనేది ముఖ్యం. ఫలితం విషయంలో ప్రేక్షకులు తమ తీర్పును వెల్లడిస్తారు. దాని కోసం వేచి చూడటమే మన డ్యూటి నేను నటించిన పాత్ర నుంచి త్వరగా బయటపడ్డాను. తెలుగు నేటివిటికి తగ్గినట్టుగా నారప్పను డిజైన్ చేశాం అని వెంకటేష్ అన్నారు.

మీకు ఎలాంటి ఎమోషన్స్ అంటే ఇష్టం?

మీకు ఎలాంటి ఎమోషన్స్ అంటే ఇష్టం?

నటుడిగా నాకు అన్ని రకాల ఎమోషన్స్ అంటే ఇష్టం. అసురన్‌లో భావోద్వేగాలు వేరు. దృశ్యం2లో మరో రకంగా ఉంటాయి. మోహన్ లాల్ కళ్లతోనే భావాలు పలికిస్తారు. ఆయన నటనే మరో రకంగా ఉంటుంది. నేను చేస్తున్న సినిమాలోన్ని పాత్రలను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రస్తుతం పరిస్థితులు అనేక మార్పులు వస్తున్నాయి. పరిస్థితులను బట్టి మనం కూడా అడ్జస్ట్ కావాలి. అటూ ఓటీటీ ఇటూ థియేటర్ల రిలీజ్ బ్యాలెన్స్ చేయాలి. అయితే నా మటుకు నటించడం వరకే నా పరిధిలో ఉంటుంది. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ నా కంట్రోల్‌లో ఉండదు అని వెంకటేష్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X