రష్మిక మందన్న అలాంటి ధైర్యాన్ని ఇచ్చింది.. ఆమె లేకపోతే.. దీక్షిత్ శెట్టి ఎమోషనల్ (Video)

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు.

ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందించారు. ప్రశాంత్ ఆర్ విహారీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నటుడు దీక్షిత్ శెట్టి సినిమా ప్రమోషన్స్‌లో ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ..

Dikshit Shetty about Rashmika Mandanna

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తనకు స్వేచ్ఛను ఇవ్వడంతో నేను నటించడం చాలా సులభతరమైంది. రాహుల్‌కు ప్రతి విషయంలోనూ స్పష్టత ఉంది, దాని వల్ల విక్రమ్ పాత్రలో నటించడం నాకు సులువైంది. రాహుల్ లాంటి దర్శకుడితో పనిచేయడం నాలాంటి నటుడికి ఎంతో సహాయపడుతుంది.చిత్రీకరణ సమయంలో తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, ఇది చాలా అరుదుగా జరుగుతుంది అని దీక్షిత్ శెట్టి చెప్పారు.

రష్మిక మందన్న నాకు సీనియర్. సెట్‌లో నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. దాంతో ఆమెతో కలిసి నటించడం తనకు సవాల్‌గా అనిపించలేదు. నిజానికి, రష్మికతో కలిసి పనిచేయడం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ చాలా సహజంగా వచ్చాయి. అందుకు కారణం రష్మిక సెట్లో ఎంతో ఉత్సాహంగా ఉండటమే. అయితే, సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని కాస్త ఆందోళనగా ఉంది. ఈ చిత్రం నా కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా అవుతుందని భావిస్తున్నాను అని దీక్షిత్ శెట్టి అన్నారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమా ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమాకు మహిళా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం విజయం వైపు దూసుకెళ్తున్నది. భారీ విజయం వైపు వెళ్లే అవకాశాలు స్పస్టంగా కనిపిస్తున్నాయి. రష్మిక కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X