ఎన్ని హత్యలకైనా రెడీ.. మంచివాడినా?.. చెడ్డ‌వాడినా? అనేది.. విజయ్ ఆంటోని

విజయ్ ఆంటొని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం 'కొలైగార‌న్'. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.న‌రేష్ కుమార్- టి.శ్రీ‌ధ‌ర్ 'కిల్లర్' పేరుతో తెలుగులో అనువాదం చేసి విడుద‌ల చేస్తున్నారు. మ‌ర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సైమ‌న్.కె.సింగ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్, పాటలు విడుదలయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. 'ఎన్ని హత్యలైనా చేయడానికి నేను రెడీ' అంటూ తనలోని కిల్లర్‌ని విజయ్ ఆంటొని చూపిస్తున్నారు. అర్జున్ పోలీస్ అధికారిగా నటించారు. నాజర్ మరో కీలక పాత్ర పోషించారు. ట్రైలర్ చూస్తుంటే విజయ్ ఆంటొని మరో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప‌నులు అన్నీ పూర్తి చేసుకుని 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సంద‌ర్భంగా మీడియాతో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ...

ఈ సినిమా దర్శకుడు నా క్లాస్‌మేట్

ఈ సినిమా దర్శకుడు నా క్లాస్‌మేట్

కిల్లర్ చిత్ర ద‌ర్శ‌కుడు అండ్రూ లూయిస్‌తో నేను క‌లిసి ప‌నిచెయ్య‌డం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందువ‌ల్ల‌న అంటే ఆయ‌న నా క్లాస్‌మేట్‌, నా ఫ్రెండ్‌. చ‌దువుకునేట‌ప్పుడు మా ఇద్ద‌రి మ‌ధ్య ప్రొఫెష‌న‌ల్ రిలేష‌న్ షిప్ ఏమీ లేదు. చ‌దువుకునేట‌ప్పుడే తెలిసింది ఆయ‌న 3, 4 చిత్రాలు డైరెక్ట్ చేశార‌ని. నేను న‌టించ‌డం మొద‌లుపెట్టాక ఆయ‌న నాకొక క‌థ చెప్పారు. క‌థ న‌చ్చి వెంట‌నే చేస్తాన‌ని ఒప్పుకున్నాను. ఆయ‌న గ‌త చిత్రాల‌ను చూశాను చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు. త‌ర్వాత ఈ చిత్రాన్ని కూడా చాలా బాగా తీశారు. ఈ సినిమాకి మ్యూజిక్ నేను చెయ్య‌లేదు. సైమ‌న్‌ కె సింగ్ చాలా అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్ర‌ఫీ మిస్ట‌ర్ ముకేష్‌. త‌మిళ్‌లో ప్ర‌దీప్ గారు ప్రొడ్యూస్ చేశారు. స్నేహితుడు సంజు తెలుగులో దీని రైట్స్ కొన్నారు. అర్జున్‌గారు ఈ చిత్రంలో న‌టించారు. చాలా మంచి పాత్ర ఆయ‌న‌ది.

మీరు మ్యూజిక్ అందించిన చిత్రాలు...

మీరు మ్యూజిక్ అందించిన చిత్రాలు...

నేను గ‌తంలో ఇండియా పాకిస్టాన్ అనే చిత్రానికి ఇచ్చాను. అది నా మూడ‌వ చిత్రం. అలాగే ఇంకా రెండు మూడు సినిమాల‌కు చేశాను. కాని ప్ర‌స్తుతం నేను మ్యూజిక్ మీద ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేదు. నా ఇంట్ర‌స్ట్ మొత్తం న‌ట‌న మీదే ఉంది. నా ఏకాగ్ర‌త మొత్తం న‌ట‌న మీదే పెట్టి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తియ్యాల‌నుకుంటున్నాను. ఈ సినిమాలో నేనే కిల్ల‌ర్‌ని. అర్జున్‌గారు పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు. స్క్రీన్‌ప్లే బాగా న‌చ్చింది. కథ నాకు బాగా న‌చ్చడంతోనే ఈ సినిమాకు ఒకే చెప్పాను.

 సినిమాలో నేనే కిల్లర్‌ను

సినిమాలో నేనే కిల్లర్‌ను

కిల్లర్ చిత్రంలో కొంత మందిని చంపుతాను. నేను ఎందుకు చంపుతున్నాను.. ఎవ‌ర్ని చంపుతున్నాను. నేను మంచివాడినా... చెడ్డ‌వాడినా... ఏంటి అన్న‌దాని పైన స్టోరీ న‌డుస్తుంది. లెజండ‌రీ యాక్ట‌ర్ అర్జున్‌ కూడా ఇందులో ఉండ‌డం చెయ్య‌డం ఈ చిత్రానికి ఒక స్పెష‌ల్ ఎస్పెట్ అనే చెప్పాలి.

 బేసిక్‌గా నేను యాక్టర్‌ను కాదు

బేసిక్‌గా నేను యాక్టర్‌ను కాదు

అర్జున్‌గారి చాలా మంచి ప్రొఫెష‌న‌ల్ యాక్ట‌ర్‌. నేను బేసిక్‌గా యాక్ట‌ర్‌ని కాదు. నేను మంచిగా న‌టించ‌డానికి ట్రై చేస్తున్నాను. నాకు ఏది మంచి యాక్టింగ్ ఏది కాదు అన్న‌ది నాకు తెలియ‌దు కాని నా ఉద్దేశం ప్ర‌కారం ఆయ‌న చాలా మంచి ప్రొఫెష‌న‌ల్ యాక్ట‌ర్‌. ఆయన పెర్‌ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. డెఫినెట్‌గా ఆయ‌న పాత్ర ఈ చిత్రాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. ఇది మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం కాదు. ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ మూవీ. నా గ‌త చిత్రాల్లో మెసేజ్ ఉండేది. కానీ ఇది సందేశం ఇచ్చే చిత్రం కాదు.

 టాలీవుడ్‌లో స్ట్రయిట్ మూవీ

టాలీవుడ్‌లో స్ట్రయిట్ మూవీ

తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలనుకొంటున్నాను. అంతకంటే ముందు నేను తెలుగు బాగా నేర్చుకోనేందుకు ప్రయత్నిస్తున్నాను. ఆ తర్వాతే తెలుగులో స్ర్ట‌యిట్ మూవీస్‌లో చేస్తాను. ప్ర‌స్తుతం నాకు హేమచంద్ర డ‌బ్బింగ్ చెపుతున్నారు.ఈ సినిమాకు మ్యూజిక్ కూడా నేను ఇవ్వ‌లేదండి. పాట‌ల‌న్నీ చాలా బాగా వ‌చ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. మీరు సినిమా చూస్తే అద‌ర్శ‌మ‌వుతుంది.

వేరే బ్యానర్లలోనే నటిస్తాను

వేరే బ్యానర్లలోనే నటిస్తాను

కిల్లర్ సినిమాకు నేను ప్రొడ్యూస‌ర్‌ని కాదు. నా గ‌త చిత్రాల‌న్నీ నేను ప్రొడ్యూస్ చేశాను. నేను వేరే బ్యాన‌ర్‌లో చెయ్య‌డం ఇదే నా మొద‌టి చిత్రం. త‌మిళంలో ఖాకీ అనే చిత్రం చేస్తున్నాను. తెలుగులో జ్వాలా అనే చిత్రం తెలుగులో ప్ర‌కాష్‌రాజు, జ‌గ‌ప‌తిబాబు, అరుణ్‌విజ‌య్‌, స‌త్య‌రాజ్ లాంటి నటులతో వీళ్ళంద‌రితో క‌లిసి చెయ్య‌బోతున్నాను. ప్ర‌స్తుతం కంటిన్యూగా ప‌ది సినిమాలు ఉన్నాయి. ప్రొడక్ష‌న్ చెయ్య‌డంలేదు. ఓన్లీ వేరే బ్యాన‌ర్ల‌కి సినిమాలు చేస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X