‘ఆ సినిమాలకు మ్యూజిక్ చేశానని రిజెక్ట్ చేశారు.. పవన్ కల్యాణ్ ప్రశంస మరిచిపోలేను..’
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీడియం బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొంటున్నది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన ఈ చిత్రం కేవలం 9 రోజుల్లోనే 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌కు మించి విజయాన్ని అందుకొంటున్నది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ హిట్‌గా కూడా నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
నాకు మొదటి నుంచి చదువుపై ఆసక్తి లేకపోయింది. నాకు ఇష్టమైన మ్యూజిక్ నేర్చుకొంటానని ఇంట్లో చెబితే కొంత ఆలోచించారు. నా భవిష్యత్ ఏమౌతుందోననే భయం వారికి ఏర్పడింది. కానీ నా ఇష్టాన్ని కాదనలేక సరే అని ప్రోత్సాహించారు. మ్యూజిక్ రంగంలో నాకు ఏఆర్ రెహ్మన్, ఇళయరాజా, కీరవాణి అంటే అభిమానం. నేను ఎవరి వద్ద పనిచేయలేదు అని విజయ్ బుల్గానిన్ చెప్పారు.

బేబీ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం మొదటి నుంచి ఉంది. ఈ సినిమా ఒప్పుకొన్న తర్వాత మనసంతా దీనిపైనే పెట్టాను. రెండేళ్లుగా ఏ ప్రాజెక్టు కూడా కమిట్ కాలేదు. దర్శక, నిర్మాత, ఆనంద్ దేవరకొండ తర్వాత ఈ సినిమాపై నాకే ఎక్కువగా నమ్మకం ఉండేది అని విజయ్ బుల్గానిన్ అన్నారు.
బేబీ ప్రమోషన్స్‌లో గానీ, సినిమా రిలీజ్ తర్వాత గానీ ఈ చిత్రానికి ఫస్ట్ హీరో నేనే అంటుంటే చాలా గొప్ప ఫీలింగ్ కలుగుతున్నది. ఆనంద్, వైష్ణవి, ఎస్కెఎన్ అందరూ కామెంట్ చేస్తుంటే కష్టానికి ఫలితం దక్కినట్టు అనిపించింది. అందరూ మెచ్చే మ్యూజిక్ ఇచ్చానంటే అందుకు కారణం దర్శకుడు సాయి రాజేష్ అని విజయ్ బుల్గానిన్ చెప్పారు.

నా కెరీర్ ఆరంభంలో కామెడీ సినిమాలకు మ్యూజిక్ అందించడంతో నాపై ఓ రకమైన ముద్ర పడింది. కామెడీ సినిమాలకు తప్ప మిగితా సినిమాలకు పనికి రావని ఆఫర్లు ఇవ్వడానికి నిరాకరించారు. అలాంటి సమయంలోనే సాయి రాజేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ట నన్ను ప్రోత్సహించారు. ఈ సినిమాతో వచ్చిన బ్రేక్‌తో నాపై పడిన ముద్ర పూర్తిగా తొలిగిపోయిందనే అభిప్రాయం కలుగుతున్నది.
బేబీ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఏ సినిమాను కూడా ఒప్పుకోలేదు. కథలు వింటున్నాను. నానితో నాకు మంచి పరిచయం ఉంది. ఆయన ప్రొడక్షన్‌లో మీట్ క్యూట్ సిరీస్‌కు పనిచేశాను. నానితో పనిచేయాలని ఉంది. బేబీ సినిమా చూసిన తర్వాత నాని కలుద్దామని అన్నాడు. సప్తగిరి LLB ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మెచ్చుకోవడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అని విజయ్ బుల్గానిన్ అన్నారు.


Click it and Unblock the Notifications











