అల్లు అర్జున్ నాకు ఫ్రెండ్ కాదు.. చిరంజీవి వచ్చారంటే.. వారిని పట్టించుకోను.. విజయ్ దేవరకొండ

నోటా సినిమా రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం టాక్సీవాలా. ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా అన్ కట్ వెర్షన్ పైరసీ వెబ్‌సైట్లో రిలీజ్ కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన సక్సెస్ చూసి ఈర్షపడుతున్నవారికి నా సినిమాలే సమాధానం చెబుతాయని అన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిని ఉద్దేశించి ఏమన్నారంటే..

ఒక్క రోజులో స్టార్‌ని కాలేదు

ఒక్క రోజులో స్టార్‌ని కాలేదు

నాకు స్టార్ స్టేటస్ ఒక్కరోజులో రాలేదు. హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఇక నా స్టార్ హోదాపై కొందరికి కంటగింపు, జెలసీ ఉండొచ్చు. దానిని కాదనలేను. నేను వారి నుంచి ఎలాంటి సమస్యలు లేవు. నేను పట్టించుకోను.

ఎక్కువగా ఎవర్నీ కలువను

ఎక్కువగా ఎవర్నీ కలువను

సాధారణంగా ఇండస్ట్రీలో నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను. నేను పనిచేసే టీమ్‌తో, నా బాల్య స్నేహితులతో కలిసి ఉంటాను. నా పని పూర్తయిన తర్వాత నా లైఫ్ నాదే. వేరే వారితో ఎక్కువగా కలువను. ఎవరి పని చేసుకొంటే వారికి మంచిదనే అభిప్రాయం నాది.

చిరంజీవి పెద్ద మనసుతో

చిరంజీవి పెద్ద మనసుతో

నా సినిమా ప్రమోషన్‌కు చిరంజీవి వచ్చారంటే వారి పెద్ద మనసుతో వచ్చారు. వారికి నేను ఫ్రెండ్‌ను కాదు. నాకు పెద్దగా పరిచయం లేదు. చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాను. అలాంటి వ్యక్తి నా ఫంక్షన్‌కు వచ్చారంటే నాకు చాలా గొప్ప విషయం.

అల్లు అర్జున్ అన్నయ్యతో

అల్లు అర్జున్ అన్నయ్యతో

అల్లు అర్జున్ నాకు ఫ్రెండ్ కాదు. బన్నీ అన్న నాకు ఫంక్షన్లకు వచ్చి.. ప్రమోషన్ చేస్తున్నారంటే ఆయన గొప్పతనం. గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడం వల్ల అల్లు అర్జున్‌తో మంచి రిలేషన్ ఏర్పడింది. ఇక నన్ను చూసి, నా సక్సెస్ చూసి ఎవరైనా నొచ్చుకొంటే పట్టించుకోను. ఎవరైనా నా ఫెయిల్యూర్స్‌ను చూసి ఎంజాయ్ చేస్తే చేసుకోమని చెబుతాను.

నోర్లు మూయిస్తా

నోర్లు మూయిస్తా

నేను ఎలాంటి సినిమాలు చేస్తున్నానో నాకు తెలుసు. ప్రస్తుతం నేను ఎంపిక చేసుకొంటున్న సినిమాలు ఎలాంటివో నాకు తెలుసు. అవి రిలీజ్ అయితే వాళ్లు నోర్లు మూతపడుతాయి. నన్ను చూసి ఈర్ష పడేవారికి నా సినిమాలే సమాధానం చెబుతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X