నన్నుతొక్కాలని చూస్తే ఊరుకొను.. కాంగ్రెస్ వాళ్లనే అడగండి.. ఆ భయం ఉంది.. విజయ్ దేవరకొండ

వరుస సినిమాలు, విజయాలతో దూసుకెళ్తున్నాడు విజయ దేవరకొండ. అర్జున్ రెడ్డి, మహానటి, గీత గోవిందం చిత్రాల తర్వాత నోటా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత సినిమాల వరకు తెలుగుకే పరిమితమైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం దక్షిణాదికి విస్తరించాడు. నోటా చిత్రం కేరళ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో విడుదలవుతున్నది. తెలంగాణాలో ఎన్నికలు ఉన్నందున నోటా సినిమాను నిలిపివేయాలని రాజకీయ పార్టీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో విజయ్ దేవరకొండ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. విజయ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

Recommended Video

Vijay Deverakonda Speech @Nota Pre Release Event

 నిద్ర లేకుండా బిజీగా ప్రమోషన్

నిద్ర లేకుండా బిజీగా ప్రమోషన్

నోటా చిత్రంతో తొలిసారి దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నాను. నోటా రిలీజ్‌కు ముందు చాలా బిజీగా గడుపుతున్నాను. నిద్రలేకుండా ప్రమోషన్‌లో ఉన్నాను. బెంగళూరు, కొచ్చి, చెన్నై, హైదరాబాద్‌లో ప్రమోషన్ చేస్తున్నాం. రోజకు దాదాపు 8 వీడియో ఇంటర్వ్యూలు చేస్తున్నాం.

జీవితం ఎటుపోతుందో అర్ధం కావడం లేదు

జీవితం ఎటుపోతుందో అర్ధం కావడం లేదు

తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ రావడం ఆనందమే. కానీ దాని గురించి ఆలోచించే సమయమే లేదు. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూ.. ప్రమోషన్‌లో బిజీగా ఉంటూ జీవితం గడిచిపోతుంది. ఓ రోజు నా జీవితం ఎటూ పోతుందో అర్ధం కావడం లేదు. ప్రజలందరూ నా పట్ల క్రేజ్ చూపించడం ఆనందంగా, భయంగా ఉంటుంది.

 యాక్టర్ అవుతానో లేదో

యాక్టర్ అవుతానో లేదో

సినీ రంగంలో నిద్రలేకుండా బిజీగా కావాలని కోరుకోలేదు. యాక్టర్ కావాలనుకొన్నాను. ఓ దశలో యాక్టర్ కానేమో అనే అనుమానం ఉండేది. అప్పట్లో యాక్టర్‌గా కాకుండా డైరెక్షన్, రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నాను. వరుస సినిమాలతో బిజీగా అయ్యాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.

 నేనే ఎందుకు దొరుకుతున్నానో..

నేనే ఎందుకు దొరుకుతున్నానో..

నేను నటించిన ప్రతీ సినిమాను ఏదో వివాదం చుట్టుముట్టడం ఇబ్బందిగా ఉంది. నాకే ఎందుకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి.. నేనే ఎందుకు దొరుకుతున్నానో అర్ధం కాలేదు. నా సినిమా మీద ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ వాళ్లనే అడగండి. వారైతే సరిగ్గా సమాధానం చెబుతారేమో.

 గీత గోవింద లీక్ కావడంతో

గీత గోవింద లీక్ కావడంతో

నా సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం సాధారణమైంది. నోటా వివాదాన్ని నేను పట్టించుకోవడం లేదు. గీత గోవిందం సినిమా లీక్ కావడం చాలా ఆందోళన కలిగించింది. ఎందుకంటే సినిమా నిడివి 2 గంటల 11 నిమిషాలైతే.. దాదాపు 2.30 గంటల సినిమా లీక్ అయింది. ఫైనల్ సినిమాలో లేని సీన్లు బయటకు వెళ్లాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత పైరసీ కావడం తెలిసిందే. సినిమా రిలీజ్‌కు ముందే గీత గోవిందం, టాక్సీవాలా బయటకు రావడంతో భయమేసింది. సంవత్సరానికి పైగా కష్టపడితే రిలీజ్‌కు ముందు లీక్ కావడం ఏం చేయాలో తెలియలేదు.

 తొక్కాలని చూస్తే ప్రతిఘటిస్తాను

తొక్కాలని చూస్తే ప్రతిఘటిస్తాను

వివాదాలు చుట్టుముడుతున్నప్పటికీ.. అలాంటి వాటిని సానుకూలంగా మలుచుకొంటున్నాను. నోటాను అడ్డుకుంటే మరో రూ.20 కోట్లు వసూలు చేసే విధంగా వివాదాన్ని వాడుకొంటాను. నన్ను తొక్కాలని ప్రయత్నిస్తే నేను చూస్తూ ఊరుకోను. నేను ఇంకా ప్రతిఘటిస్తాను. నా సినిమాను వివాదాల నుంచి బయటకు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X