మా నాన్న నుంచి నాకు ఆ అదృష్టం లేదు.. వివాదాస్పద వ్యాఖ్యలపై విజయ్ క్లారిటీ
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ స్పీచ్ ప్రేక్షకుల్లో ఎంత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఎలాంటి విషయాన్నైనా అర్థమయ్యేలా స్పష్టంగా చెబుతుంటారు. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలు, మోటీవేషనల్ వర్డ్స్, సినిమా ప్రమోషన్స్ చేసే సమయంలో ఆయన ఇచ్చే స్పీచ్ ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. ఇదే సమయంలో కొద్ది సందర్భాల్లో ఆయన మాటలు చర్చకు కూడా దారి తీస్తున్నాయి. కాగా గతంలో విజయ్ కామెంట్స్ పై తాజాగా స్పందించారు. ఆ మాటల వెనకాల అర్థాలను విరించే ప్రయత్నం చేశారు.
నెపొటిజంపై విజయ్ దేవరకొండ..
గతంలో విజయ్ దేవరకొండ తనకు చిత్ర పరిశ్రమలో ఎలాంటి అండదండ లేదని, బ్యాక్ గ్రౌండ్ లేదని, ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే విజయ్ చెప్పిన మాటలను కొందరు నెగెటివ్ గా అర్థం చేసుకున్నారు. విజయ్ దేవరకొండ నెపొటిజంపై పైనా మాట్లాడారని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇక ఆ కామెంట్స్ పై తాజాగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం సక్సెస్ మీట్ లో స్పందించారు. అసలు అలా ఎందుకు చెప్పారో ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.

విజయ్ దేవరకొండ క్లారిటీ..
నేను నెటిపోటిజం గురించి మాట్లాడింది కాదది. ప్రతి ఒక్కరికి చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే బాగుటుంది. వారి నుంచి కచ్చితంగా పిల్లలకు మంచి భవిష్యత్ ఏర్పడుతుంది. వాళ్లు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో తమ పిల్లలు సులువుగా రాణించే అవకాశం ఉంటుంది. కానీ నాకు హీరోగా ఎదిగే క్రమంలో అలాంటి అవకాశం లేదనేది నా ఉద్దేశం. ప్రస్తుతం మా తమ్ముడికి నా నుంచి వందశాతం సపోర్ట్ లభిస్తుంది. అది ఆయన కెరీర్ కు ఎంతోకొంత ఉపయోగకరంగా ఉంటుంది.
నన్ను చూసి నేర్చుకునే ఉంటాడు కదా. కానీ నా కెరీర్ బిగినింగ్ లో ప్రతి విషయాన్ని నేనే నేర్చుకున్నారు. సినిమా ప్రమోషన్ ఎలా చేయాలని, ఎలాంటి సినిమాలు చేయాలనే విషయాల్లో తప్పు ఒప్పులు చేస్తూ నేర్చుకుంటూ వస్తున్నానని చెప్పారు. కానీ అనుభవం ఉన్న తల్లిదండ్రులుంటే కెరీర్ లో వెసులుబాటు ఉంటుందని చెప్పుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్ అంటే ఆ రంగంలో అనుభవం ఉన్న పేరేంట్స్ ఉండటం అని చెప్పుకొచ్చారు.
కింగ్డమ్ రెస్పాన్స్ ఇలా..
సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు కింగ్డమ్ చిత్రం కాస్తా ఊరటను ఇచ్చింది. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరిలో కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నాగవంశీ 130 కోట్ల రూపాయాలతో నిర్మించారు. సితార ఎంటర్ టైమ్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లలో సంయుక్తంగా నిర్మించారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం డే1 35 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. మున్ముందు ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందనేది వేచి చూడాలి. ఈచిత్రంలో సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. ఇక హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











