నాకు ఏ ముఖ్యమంత్రి ఇష్టమంటే.. ఆ పార్టీలకు నోటా అంటే భయం.. విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం విడుదలకు ముందే అనేక వివాదాల్లో చిక్కుకున్నది. అనేక ఒత్తిడుల మధ్య అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలకు తెలుగుకే పరిమితమైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం దక్షిణాదికి విస్తరించాడు. నోటా చిత్రం కేరళ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో విడుదలవుతున్నది. తెలంగాణాలో ఎన్నికలు ఉన్నందున నోటా సినిమాను నిలిపివేయాలని రాజకీయ పార్టీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో విజయ్ దేవరకొండ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. విజయ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

కేటీఆర్ గెటప్‌ను అనుకరించాం

కేటీఆర్ గెటప్‌ను అనుకరించాం

నోటా సినిమాలో నా పాత్ర రూపు రేఖల కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను అనుకరించాం. ఆయన డ్రస్సింగ్, స్టయిల్‌ను నేను అనుకరించాను. ఈ పాత్ర కోసం ఖాదీ బట్టలను ఎక్కువగా ఉపయోగించాం. నా పొలిటికల్ గెటప్‌కు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేస్తాం.

చంద్రబాబు నాయుడు అంటే

చంద్రబాబు నాయుడు అంటే

నాకు నచ్చిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు ఒకరు. ఆయన హైదరాబాద్ నగరాన్ని బాగా తీర్చిదిద్దారు. సిటీకి మంచి పేరు తెచ్చారు. ఆయన వల్ల ఉద్యోగుల్లో సరైన బాధ్యత పెరిగింది. సమయానికి ఆఫీసులకు వెళ్లే పద్దతిని అలవాటు చేసుకొన్నారు.

సీఎం కేసీఆర్ అంటే ఇష్టం

సీఎం కేసీఆర్ అంటే ఇష్టం

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టే పనులు నాకు ఇష్టం. కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగుంది. సిటీలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలను బాగా హ్యాండిల్ చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశాను. ఇక ముందు కూడా ఆ పార్టీకే ఓటు వేస్తాను.

అందరిలా కేటీఆర్ కారు

అందరిలా కేటీఆర్ కారు

రాజకీయ నేతలు చాలా మంది ఫొటోలకు ఫొజులివ్వడం వరకే పరిమితమవుతుంటారు. కానీ మంత్రి కేటీఆర్ అలాంటి వ్యక్తి కాదు. ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం ఎదురుచూస్తుంటాడు. నేను ఆయన కలిసినప్పుడు నాకు చాలా విషయాలు చెబుతుంటాడు. ఖాదీ వాడమని చెప్తుంటాడు. ప్లాస్టిక్ వాడొద్దరి సలహా ఇస్తుంటాడు. కేటీఆర్ గురించి చెప్పే అవకాశం నోటా ద్వారా కలిగింది.

నోటా అంటే ఆ రాజకీయ పార్టీలకు భయం

నోటా అంటే ఆ రాజకీయ పార్టీలకు భయం

నోటా సినిమాను ఆపివేయాలని ఫిర్యాదు చేస్తున్న వారికి కాన్ఫిడెన్స్ లేదు. చాలా మంది మా పార్టీ కంటే నోటా బెటర్ అని భయపడుతున్నందునే ఫిర్యాదు చేస్తున్నారు. నాకు అలాంటి పట్టింపులు లేవు. సినిమా రిలీజ్ అయితే చాలూ అనే అనుకొంటున్నాను. నా సినిమా బాగా ఆడాలని అనుకొంటున్నాను. అంతకంటే నాకు రాజకీయాలపై ఎలాంటి ఇంట్రస్టులు లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X