పైరసీ చేసి.. సారీ అని మెసేజ్.. టాక్సీవాలాకు ఢోకాలేదు.. విజయ్ దేవరకొండ
నోటా ఫ్లాప్ వల్ల నాకు ఝలక్ తగల్లేదు. కానీ టాక్సీవాలా లీకై పైరసీ కావడంతో గట్టిగా దెబ్బ తగిలిన ఫీలింగ్ కలిగింది. వాస్తవానికి నేను టాక్సీవాలాకు ఇంటర్వ్యూ ఇవ్వోద్దని అనుకొన్నాను. నోటా సినిమా కోసం ఇంటర్వ్యూలతో నన్ను పిండేశారు. దాంతో ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని అనుకొంటున్న సమయంలో పైరసీ విషయం బయటకు వచ్చింది అని విజయ్ దేవరకొండ తెలిపాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ..

ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లాలని
టాక్సీవాలా పైరసీ కావడంతో సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ షాక్ గురై సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. వారు పోస్టులు పెట్టడం వల్ల కొంత మేరకు మా బాధ రీచ్ అయిందనిపించింది. మా బాధను నేను కూడా ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకోవడం వల్ల మీతో కలిసి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశాను.

పెళ్లిచూపుల సినిమాను పైరసీ చేస్తే..
టాక్సీవాలా పైరసీ గురి కావడంపై బాధ పెద్దగా అనిపించడం లేదు. ఎందుకంటే ఆ సినిమాపై నాకు ఉన్న నమ్మకం. అందరికి నచ్చుతుందనే కాన్ఫిడెన్స్. అయితే ఈ పైరసీ విషయం పెళ్లిచూపులు సినిమాకు జరిగి ఉంటే నా కెరీర్ ఏమైపోయి ఉండేదేమో అనే బెంగ మాత్రం పట్టుకొన్నది. ఒకవేళ అప్పుడు జరిగితే అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమా నాకు రాకపోయి ఉండేవి. యాక్టింగ్ గుడ్‌బై చెప్పి డైరెక్టర్‌గా మారిపోయి ఉండేవాడినేమో.

కెరీర్ ఏమైపోతుందనే భయంతో
ప్రస్తుతం టాక్సీవాలాకు పనిచేసిన చాలా మంది కొత్తవారే. వారి కెరీర్ ఏమైపోతుందనే భయం పట్టుకొన్నది. అందుకే టాక్సీవాలా సినిమాకు పనిచేసిన యంగ్ టెక్నిషియన్స్‌కు మళ్లీ నా సినిమాల్లో ఛాయిస్ ఇస్తాను. వారికి ఏదో విధంగా కెరీర్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను.

మీ టాక్సీవాలాను పైరసీ
టాక్సీవాలా సినిమా అవుట్ పుట్ రెండు నెలల ముందే మాకు వచ్చింది. మేము రిలీజ్ తర్వాత పెట్టాలనుకొన్నాం. కానీ ఇతర పైరసీ వెబ్‌సైట్లు రిలీజ్ చేయడంతో మేమే పెట్టాల్సి వస్తుంది. మీ సినిమాను పైరసీ చేస్తున్నందుకు సారీ. యంగ్ టీమ్‌కు క్షమాపణలు అని మెయిల్ పెడుతున్నారు.

టాక్సీవాలా పైరసీకి గురైనా
పైరసీకి గురైనా గానీ టాక్సీవాలాకు ఏ మాత్రం ఢోకాలేదు. ఎందుకంటే ఆ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ జనరేట్ అయి సక్సెస్ రేంజ్‌లోకి వెళ్లడం ఖాయం అని విజయ్ దేవరకొండ చెప్పారు.


Click it and Unblock the Notifications











