నేను ఆ స్టేజ్‌లో ఉన్నా.. అందరూ నా గురించే అంటుంటే ఏదోలా ఉంది.. విజయ్ కామెంట్స్

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన మాటలతో, యాటిట్యూడ్‌తో, స్టైలింగ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. వరుస సినిమాలతో ఆకట్టుకున్న విజయ్.. చివరగా డియర్ కామ్రేడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో ప్రేమకథ వరల్డ్ ఫేమస్ లవర్‌తో ఆడియెన్స్‌ను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ మాట్లాడుతూ.. అనేక విషయాలను వెల్లడించాడు.

ప్రస్తుతం ఆ స్టేజ్‌లో ఉన్నా..

ప్రస్తుతం ఆ స్టేజ్‌లో ఉన్నా..

ప్రస్తుతం మనిషిగా మారుతున్నానని, లైఫ్‌లో ప్రతీ ఒక్కరికి ఓ స్టేజ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ప్రారంభించేప్పుడే ఇది నా చివర ప్రేమ కథ చిత్రమని అర్థమైనట్టు పేర్కొన్నాడు. ఇంకో రెండు మూడు నెలల్లో కొత్త విజయ్‌ను చూస్తారు.. మొహం కూడా పూర్తిగా మారుతుందని చెప్పుకొచ్చాడు. రాబోయే రెండేళ్లతో కొత్త రకమైన చిత్రాలు వస్తాయని తెలిపాడు.

బాల్ గాల్లో ఉంది..

బాల్ గాల్లో ఉంది..

ఈ చిత్రం సిక్సర్ కొట్టబోతున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు విజయ్ సరదాగా స్పందించాడు. బాల్ అయితే గాల్లో ఉందని, అది బౌండరీ అవతల పడుతుందో.. ఎవరైనా క్యాచ్ పట్టి అవుట్ చేస్తారో తెలీదంటూ ఫన్నీగా జవాబిచ్చాడు.

 సువర్ణ, శీనయ్య అంటే ఇష్టం..

సువర్ణ, శీనయ్య అంటే ఇష్టం..

వరల్డ్ ఫేమస్ లవర్‌లో నాలుగు ట్రాక్‌లుంటాయని అందులో తనకు శీనయ్య, సువర్ణ కథ చాలా ఇష్టమని తెలిపాడు. ఓ చిన్న టౌన్‌లో చదువు రాని వారు, వారి మధ్య ఉండే ప్రేమ చాలా బాగుంటుందని అన్నాడు. ఎల్లందులో జరిగే ఆ ఎపిసోడ్ తనకు చాలా ఇష్టమని పేర్కొన్నాడు.

Recommended Video

World Famous Lover Is My Last Love Story Says Vijay Devarakonda | ఇదే నా చివరి లవ్ స్టోరీ!
అందరూ నా గురించే..

అందరూ నా గురించే..

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందరూ తన గురించే మాట్లాడారని, కొందరైతే మరీ ఎక్కువగా పొగిడారని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తనకు ఏదోలా అనిపించిందన్నాడు. తనపై బాధ్యత కూడా చాలా పెరిగిందనే విషయం అర్థమైనట్టు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X