ఆ ట్రాక్ ఒక్కటే అర్జున్ రెడ్డిలా.. డాడీ రిఫరెన్స్‌తో ఆ పాత్ర.. విజయ్ దేవరకొండ కామెంట్స్
టాలీవుడ్‌లో కొత్తగా ట్రెండ్ క్రియేట్ చేయాలంటే అది విజయ్ దేవరకొండకే సాధ్యమవుతుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం ఇలా వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతోన్న విజయ్‌కు నోటా, డియర్ కామ్రేడ్ స్పీడ్ బ్రేకుల్లా తగిలాయి.అయినా సరే ఎక్కడా తగ్గకుండా...మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ఈ ప్రేమికుల రోజున ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్దమయ్యాడు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ చేపట్టాడు. ఈ క్రమంలో సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారట..
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాణంలో విజయ్ దేవరకొండనే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాడనే వ్యాఖ్యలను విజయ్ దేవరకొండ వద్ద ప్రస్థావిస్తే అందుకు సమాధానమిచ్చాడు. తానేమీ అలా చేయలేదనీ, పైగా ఈ మూవీ ప్రమోషన్స్‌ను ఎక్కువగా కూడా చేయడం లేదని, షూటింగ్స్ అంటూ ముంబైలోనే ఉన్నానని.. ఈ సినిమాకు ఎలాంటి పేరు వచ్చిన ఆ క్రెడిట్ దర్శకుడు క్రాంతి మాధవ్, సినిమాటోగ్రఫర్, నిర్మాత రామారావుదేనని స్పష్టం చేశాడు.

చాలా రోజులు పట్టింది..
వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్‌కు చాలా సమయమే పట్టిందని చెప్పుకొచ్చాడు. శీనయ్య పాత్రలోకి మారడానికి కష్టపడ్డాడని, ఆ క్యారెక్టర్ గెటప్ ఒకలా ఉంటుందని, ఫారెన్ గెటప్ మరోలా ఉంటుందని, కాలేజ్ ఎపిసోడ్స్‌లో ఇంకోలా ఉంటుందని వాటికోసమే చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు.

ఆ పాత్ర డాడీ రిఫరెన్స్‌తోనే..
శీనయ్య పాత్రకు రిఫరెన్స్ తన డాడీయే అనే సీక్రెట్ బయట పెట్టాడు విజయ్. చిన్నప్పటి తన తండ్రి ఎలా మాట్లాడేవారో, ఎలా ప్రవర్తించేవారో గుర్తుకు తెచ్చుకుని వాటినే రిఫరెన్స్‌గా తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. మాట తీరు, లుంగి కట్టే విధానం ఇలా ప్రతీ ఒక్కటి ఆయన నుంచే తీసుకున్నానని తెలిపాడు.

ఆ ఒక్క ట్రాక్..
వరల్డ్ ఫేమస్ లవర్‌లో నాలుగు ట్రాక్‌ల లవ్ స్టోరీస్ ఉంటాయని తెలిపాడు. అయితే వేటికవే భిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఒక్క ట్రాక్ మాత్రం అర్జున్ రెడ్డిని పోలి ఉంటుందని పేర్కొన్నాడు. తనకు మాత్రం సువర్ణ-శీనయ్య ట్రాక్ ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇంతవరకు చూడని విధంగా చాలా కొత్తగా ఉంటుందని అన్నాడు.


Click it and Unblock the Notifications











