అమ్మకు సీరియస్.. యాక్టింగ్ మానేద్దామనుకొన్నా.. విజయ్ దేవర ఆవేదన.. వాడి తండ్రికి క్యాన్సర్..!

Recommended Video

Taxiwaala Movie : Vijay Deverakonda Talks About Crew's Hard Work | Filmibeat Telugu

గీత గోవిందం బ్లాక్‌బస్టర్, నోటా ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. రిలీజ్‌కు ముందే పైరసీ వెబ్‌సైట్లలో ఈ చిత్రం ప్రత్యక్షమైంది. టాక్సీవాలా 3 గంటల సినిమా లీక్ కావడంతో చిత్ర యూనిట్ దిగ్బ్రాంతికి గురైంది. టాక్సీవాలా చిత్రం నవంబర్ 17న రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో పైరసీ గురించి, చిత్రాన్ని రూపొందించే క్రమంలో పడిన కష్టాన్ని తెలుగు ఫిల్మీబీట్‌కు వెల్లడించారు. విజయ్ దేవరకొండ చెప్పిన విషయాలు ఇవే.

 సుజిత్ నారంగ్ కష్టాల గురించి

సుజిత్ నారంగ్ కష్టాల గురించి

టాక్సీవాలా షూట్‌లో సినిమాటోగ్రాఫర్ సుజిత్ నారంగ్ పడిన కష్టం మాటల్లో చెప్పలేనిది. ఆ సమయంలో ఆయన వెన్నునొప్పితో బెడ్‌పైనే విశ్రాంతి తీసుకొన్నారు. అప్పుడు నీవు బరువులు ఎత్తవద్దు. మీరు వేరే ప్రొఫెషన్‌కు మారిపోమ్మని వైద్యులు సలహా కూడా ఇచ్చారు. సినిమా ప్రారంభానికి ముందు ఫిజియోథెరపీ తదితర చికిత్స తర్వాత ఆరోగ్యం కుదుటపడటంతో షూట్‌కు వచ్చారు.

మెడకు పట్టి వేసుకొన్నాడు

మెడకు పట్టి వేసుకొన్నాడు

టాక్సీవాలా షూట్ కోసం మెడకు పట్టివేసుకొని భుజాన కెమెరా పెట్టుకొని చాలా కష్టమైన పరిస్థితిలో షూట్ చేశారు. షూటింగ్ గ్యాప్‌ దొరికితే మధ్యలో ఫిజియోథెరపీ చేసుకొని మళ్లీ సిద్ధమయ్యేవాడు. అలాంటి కష్టం సుజిత్ నారంగ్‌ది. ఇలా కష్టపడిన సినిమా రిలీజ్‌కు ముందే వస్తే ఎవరికైన దు:ఖం రావడం సహజం అందుకే సోషల్ మీడియాలో ఆవిధంగా స్పందించాడు.

మ్యూజిక్ డైరెక్టర్ తండ్రికి క్యాన్సర్

మ్యూజిక్ డైరెక్టర్ తండ్రికి క్యాన్సర్

ఇక మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్‌ది మరో రకమైన కష్టం. షూటింగ్ దశలోనే జేక్స్ తండ్రికి క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. ఇక ఆ సమయంలో సినిమాకు మ్యూజిక్ చేయాల్సి వచ్చింది. తండ్రికి కిమోథెరపీ చేయించాల్సి రావడం. ప్రతీసారి కొచ్చికి వెళ్లి తిరిగి చెన్నైకి వచ్చేవాడు. చాలా మానసిక క్షోభను అనుభవిస్తూ సినిమాకు మ్యూజిక్ చేశాడు జేక్స్ బిజోయ్ అని విజయ దేవరకొండ చెప్పాడు.

అమ్మకు తీవ్ర అనారోగ్యం

అమ్మకు తీవ్ర అనారోగ్యం

ఇక ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు మా అమ్మకు హాస్పిటల్‌లో చేరింది. హాస్పిటల్ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. నేను షూటింగ్‌లో బిజీ. అటు అమ్మ దగ్గర లేదని ఓ బెంగ.. మరో వైపు షూటింగ్ చేయలేని పరిస్థితి. అలాంటి సమయంలో సినిమాలకు గుడ్‌బై చెబుదామని ఎమోషనల్‌గా నేను ఫిక్సయ్యాను.

యాక్టింగ్ చేయనని డిసైడ్ అయ్యా

యాక్టింగ్ చేయనని డిసైడ్ అయ్యా

డైరెక్టర్లు, నిర్మాతలకు ఫోన్ చేసి నేను ఇక యాక్టింగ్ చేయను. సినిమాల నుంచి విరమించుకొందామనుకొంటున్నాను. మీరు ఇచ్చిన అడ్వాన్సులు తీసుకెళ్లండి. ఇక నా వల్ల కాదని వారికి చెప్పేశా. అలాంటి మానసిక పరిస్థితిలో టాక్సీవాలా సినిమా కోసం కష్టపడ్డాను. అలాంటి సినిమా రిలీజ్‌కు ముందే లీక్ అయిందని తెలిస్తే ఎవరి పరిస్థితైనా చాలా దారుణంగా ఉంటుంది అని విజయ్ దేవరకొండ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X