‘శ్రీశైలం డ్యామ్ నిర్మాణం వెనుక అమ్మోరు రహస్యం.. వికటకవి సిరీస్‌ కథలో ఆ మిస్టరీనే థ్రిల్లింగ్’

కంటెంట్ ప్రధానంగా వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్, ఆదరణ దక్కుతున్నది. కథ, కథనాలు, ప్రేక్షకుడిని కట్టిపడేసే నేరేషన్ ఉంటే చాలూ అది ఠియేటర్ మూవీనా? ఓటీటీ మూవీనా? అనేది పట్టించుకోకుండా పెద్ద హిట్ చేసేస్తున్నారు. అయితే తాజాగా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రం వికటకవి. జీ5 ఓటీటీలో సర్వం శక్తిమయం సిరీస్‌ను రూపొందించిన ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. నవంబర్ 28వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సిరీస్ గురించి ఆయన మాట్లాడుతూ..

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న వికటకవి చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాం. SRT ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి రూపొందించిన ఈ సిరీస్‌ పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో రూపొందింది. ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, మేఘా ఆకాశ్ తదితరులు నటిస్తున్నారు అని ప్రదీప్ మద్దాలి తెలిపారు.

Vikatakavi Web Series Director Pradeep Maddali s reveals interesting Point in Srishailam Project construction

నేను దర్శకుడిగా మారడానికి ముందు ప్రశాంత్ వర్మ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాను. రచయిత తేజ దేశ్ రాజ్ ఈ కథను రాసుకొన్నారు. జీ5 ఓటీటీ వారికి చెప్పడంతో ఒకే అయింది. ఆ తర్వాత నాతో కలిసినప్పుడు మీరు దర్శకత్వం చేస్తారా? అని అడిగారు. ఈ కథ 40వ దశకం నుంచి 70వ దశకం వరకు జరుగుతుంది. అప్పటి వాతావరణానికి తగినట్టుగా క్యాస్టూమ్, లైటింగ్, ఇతర సాంకేతిక అంశాలను సమకూర్చడం ఓ పెద్ద ఛాలెంజ్ అయిందని చెప్పారు.

ఇండియాకు స్వాతంత్ర్యం రాకపూర్వం దేశంలో సంస్థానాల పాలన ఉండేది. అందులో తెలంగాణలో అమరగిరి ప్రాంతం ఒకటి. ఆ సమయంలో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మాణ సమయంలో ముంపు గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. అయితే తాము ఉంటున్న ఊరు మునిగిపోతుందనే విషయం అందర్నీ ఆవేదనకు గురి చేసింది. ఆ సమయంలో జరిగిన కొన్ని ఎమోషనల్ అంశాలను ఆధారంగా కథ పుట్టింది అని ప్రదీప్ మద్దాల తెలిపారు.

Vikatakavi Web Series Director Pradeep Maddali s reveals interesting Point in Srishailam Project construction
ఈ సినిమాకు వికటకవి అని టైటిల్ పెట్టాడానికి కారణం ఉంది. శ్రీకృష్ణదేవరాయల వద్ద తెనాలి రామకృష్ణుడు ఉండేవాడి. అతడిలో ఉండే చతురత అందరికి తెలిసిందే. అలాంటి బ్యాక్ డ్రాప్‌తో నరేష్ ఆగస్త్య క్యారెక్టర్ డిజైన్ చేశాం. ఇందులో డిటెక్టివ్ పాత్రను ఆయన పోషిస్తున్నారు. ఆమరగిరి ప్రాంతంలో చోటు చేసుకొన్న ఓ సమస్యను పరిశోధించే పాత్ర అతడిది. తప్పకుండా అందర్ని మెప్పిస్తాడు అని ప్రదీప్ మద్దాలి తెలిపారు.

1940ల్లో అమ‌ర‌గిరి ప్రాంతంలో ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. 1970లో అది మ‌ళ్లీ పున‌రావృత్త‌మ‌య్యేలా ఉంటుంది. అలా జ‌ర‌గ‌టాన్ని అక్క‌డి ప్రజ‌లు అమ్మోరు శాపంగా భావిస్తుంటారు. నిజంగానే అది అమ్మోరు స‌మ‌స్యా? అని హీరో అక్క‌డ‌కు వ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తాడు. అదేంటనేది తెలుసుకోవాలంటే వికటకవి సిరీస్ చూడాల్సిందే అని అన్నారు.

More from Filmibeat

Read more about: vikatakavi pradeep maddali zee5
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X