Sai Dharam Tej యాక్సిడెంట్ వార్త వినగానే.. నేను కోమాలోకి.. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు (ఇంటర్వ్యూ)
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకొన్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
నిజంగా మంత్రాలు వస్తే..: విరూపాక్ష చిత్రంలో దెయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడా కనిపించదు. హారర్ థ్రిల్లర్ సినిమాకు నేను గ్రేట్ ఫ్యాన్‌ను. హారర్ బ్యాక్ డ్రాప్‌తో కామెడీ సినిమాలు వస్తున్నాయి. కానీ ప్రాపర్ థ్రిల్లర్ రాలేదనే ఫీలింగ్‌తో ఉన్నాను. ఆ సమయంలో గుజరాత్‌లో మంత్రగత్తె అనే కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చంపేశారు. అయితే లేని అపనిందను వేసి చంపారు. నిజంగా ఆమెకు మంత్రాలు వస్తే.. వీళ్లందరూ బతికే వాళ్లా? అనే కోణంలో కథను ఆలోచించి రాయడం మొదలు పెట్టాను అని కార్తీక్ దండు తెలిపారు.

సుకుమార్‌తో నా జర్నీ: నేను సుకుమార్ వద్ద పనిచేయలేదు. భమ్‌బోళేనాథ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాను. ఆ సినిమా విషయంలో డైరెక్టర్‌గా నేను ప్రూవ్ అయ్యానే విషయం రివ్యూల ద్వారా తెలుసుకొన్నాను. 2016లో వచ్చిన ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. 2018 తర్వాతే నేను విరూపాక్ష సినిమా కథ చెబితే.. ఆయనకు బాగా నచ్చింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నేనే చేస్తాను. ఈ మూవీకి నేను ప్రొడ్యూసర్‌గా ఉంటానని చెప్పారు. అప్పటి నుంచి ఆయనతో నా జర్నీ మొదలైంది అని వెల్లడించారు.

విరూపాక్ష క్లైమాక్స్ సుకుమార్‌దే: కథ విన్న తర్వాత ఈ సినిమాకు సాయిధరమ్ తేజ్ హీరో అయితే బాగుంటుందని చెప్పారు. అలాగే బీవీఎస్ఎన్ ప్రసాద్‌ను కూడా ఆయనే డిసైడ్ చేశారు. సుకుమార్ వద్దకు వెళ్లక ముందు ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్‌తో ప్లాన్ చేశాను. సుకుమార్‌ను కలిశాక ఈ సినిమా విస్తృతి పెరిగింది. దాదాపు 6, 7 వెర్షన్లు రాశాను. విరూపాక్ష చిత్రంలో సుకుమార్ కొన్ని మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న క్లైమాక్స్‌ను ఆయన చేశారు. అని కార్తీక్ దండు చెప్పారు.

సంయుక్త మీనన్‌ను ఎందుకు తీసుకొన్నామంటే? : విరూపాక్షలో నందిని క్యారెక్టర్ల కోసం కొత్త అమ్మాయి అయితే బాగుంటుదని అనుకొన్నాను. కొత్త ఫేస్ కాకుండా ఒకట్రెండు సినిమాలు చేసిన అనుభవం ఉండాలని అనుకొన్నాను. అలా నలుగురు హీరోయిన్ల గురించి అనుకొన్నాం. చివరకు సంయుక్త మీనన్ అయితే బాగుంటుందని నేను అనుకొని డిసైడ్ చేశాను. అలా సంయుక్త మీనన్ విరూపాక్ష సినిమాలో భాగమైంది. ఆమె చేసిన ఫెర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి అని కార్తీక్ దండు తెలిపారు.
సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ సమయంలో: నా మొదటి సినిమా తర్వాత నాలుగేళ్లకు విరూపాక్ష మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. మేము సోమవారం షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆఫీస్‌లో ప్లానింగ్ చేసుకొంటున్నాం. శుక్రవారం రాత్రి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంతా కూర్చొని ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొంటున్నాం. అప్పుడు మా ఫోన్లన్నీ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నాయి. సడెన్‌గా అన్ని ఫోన్లు ఒకేసారి మోగడం ప్రారంభించాయి. మేము గదిలో డోర్ వేసుకొని కూర్చున్నాం. బయట ఆఫీస్ బాయ్ ఉన్నాడు. అతడు డోర్ తీసుకొని వచ్చి.. టీవీలో న్యూస్ చూడండని చెప్పాడు. న్యూస్ పెట్టగానే సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ వార్త తెలిసి షాక్ అయ్యాం అని కార్తీక్ దండు చెప్పారు.
దాదాపు నేను కోమాలోనే ఉన్నట్టు ఫీలింగ్: యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ 22 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు. నేను ఆ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో తిరుగుతున్నా కానీ.. నేను కోమాలోనే ఉన్నాను. ఆ 22 రోజులు మైండ్ బ్లాంక్ అయింది. ఆయన హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత మేము రిలాక్స్ అయ్యాం. ఆ తర్వాత సినిమా స్క్రిప్టుపై దృష్టిపెట్టాం. సినిమా మొత్తానికి స్టోరి బోర్డు వేశాం. విరూపాక్ష సినిమా బెటర్ కావడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకొన్నాం అని కార్తీక్ దండు తెలిపారు.
యాక్సిడెంట్ తర్వాత సెట్‌లోకి వచ్చి..:సాయిధరమ్ తేజ్‌కు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మూడు రోజుల కోసం షూటింగ్ ప్లాన్ చేశాం. ఆ పరిస్థితుల్లో సాయిధరమ్ తేజ్‌కు యాక్టింగ్ చేయడం కష్టమైంది. డైలాగ్ చెప్పడం రాలేదు. ఆ మూడు రోజుల షూటింగ్ రష్ చూసిన సాయిధరమ్ తేజ్.. కొంత ప్రాబ్లెం ఉంది. నేను నెక్ట్స్ షెడ్యూల్‌కు ఇంకా బెటర్ అవుతానని చెప్పాడు. ఆ లోపు స్పీచ్ థెరపీ, డ్యాన్స్ లాంటి ప్రాక్టీస్ చేశాడు. పది రోజుల తర్వాత చాలా కాన్ఫిడెన్స్‌తో షూటింగ్ చేశాడు అని కార్తీక్ చెప్పారు.


Click it and Unblock the Notifications











