ఆమె నా సోల్‌మేట్.. పెళ్లి చేసుకొంటానో లేదో.. వరలక్ష్మితో మ్యారేజ్ గురించి విశాల్
నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త విశాల్ నటించిన తాజా చిత్రం పందెంకోడి2. 13 ఏళ్ల క్రితం విడుదలైన పందెంకోడి చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తుండగా విశాల్ మీడియాతో సంతృప్తిని వ్యక్తం చేశారు. తన సినిమా సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా వరలక్ష్మితో పెళ్లి గురించి, టెంపర్ రీమేక్ గురించి, పందెంకోడి2 సీక్వెల్ గురించి పలు విషయాలు వెల్లడించారు. విశాల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

లవ్ మ్యారేజ్ చేసుకొంటా
జీవితంలో నేను పెళ్లి చేసుకొంటే లవ్ మ్యారేజ్ చేసుకొంటాను. అందుకు నా తల్లిదండ్రుల నుంచి కూడా అభ్యంతరం లేదు. నా తల్లిదండ్రలకు, నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాత నేను పెళ్లి చేసుకొంటాను. అప్పటి వరకు పెళ్లి ప్రస్తావన లేదు అని విశాల్ అన్నారు.

వరలక్ష్మీ నా సోల్‌మేట్
హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ నాకు సోల్ మేట్. నాకు మంచి స్నేహితురాలు. పెళ్లి ఎప్పుడు చేసుకొంటానో లేనో చెప్పలేను. పెళ్లి కూతురు స్లాట్‌ను బ్లాక్ చేశాను. పెళ్లి స్లాట్‌ను కూడా బుక్ చేశాను. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ నా ముందు ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిపైనే నా దృష్టిపెట్టాను.

వారివైపు నుంచి అభ్యంతరాలు
పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి రెడీగా ఉంది. అమ్మాయి తరుఫు వాళ్లకు కూడా అభ్యంతరం లేదు. నా కుటుంబం నుంచి కూడా ఎలాంటి అవరోధాలు లేవు. పెళ్లి కంటే నాకు వేరే ప్రయారిటీలు ఉన్నాయి. వాటి కోసం పెళ్లిని కొంత వెనక్కు జరిపాను. పెళ్లి చేసుకోవడం ఖాయం కాకపోతే ఎప్పుడనేది సమయమే నిర్ణయిస్తుంది.

అది పూర్తి కావడమే ముఖ్యం
పెళ్లి కంటే నిర్మాతల మండలి భవనం పూర్తి కావడమే నా ముందు ఉన్న లక్ష్యం. మండలి భవనం పూర్తయితే పేద కళాకారులకు మేలు జరుగుతుంది. తమిళనాడుకు మణిహారంగా మిగిలిపోతుంది. అది పూర్తయితే నా కోరిక నెరవేరినట్టే.


Click it and Unblock the Notifications











