Sita Ramam సిరివెన్నెల స్వయంగా చెన్నైకు వచ్చి.. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఎమోషనల్ (ఇంటర్వ్యూ)

హృదయం ఎక్కడున్నది, కృష్ణ గాడి వీర ప్రేమగాథ, కథలో రాజకుమారి, పడిపడి లేచే మనసు చిత్రాల తర్వాత విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ చేసిన సినిమా సీతారామం. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రెండింగ్‌గా మారాయి. సీతారామం చిత్రం ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విశాల్ చంద్రశేఖర్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

హను రైటింగ్ చాలా స్ట్రాంగ్

హను రైటింగ్ చాలా స్ట్రాంగ్


దర్శకుడు హను రాఘవపూడిని కలిసినప్పుడు సీతా రామం సినిమా గురించి చెప్పారు. ఆ సమయంలో సాంగ్ సిట్యుయేషన్స్ గురించి వివరించారు. కథా ప్రయాణంలో పాటలు సరైన సమయంలో వస్తాయి. అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. రైటింగ్ చాలా స్ట్రాంగ్. మెలోడిస్ ఇవ్వడమే నా బలం. రొటీన్, కమర్షియల్ పాటలు ఇవ్వడం నా వల్ల కాదు. హను రాఘవపూడి రైటింగ్ చాలా స్ట్రాంగ్. పడిపడిలేచే మనసు సినిమా సమయంలోను, సీతారామం సినిమా టైంలో అతడి నుంచి స్క్రిప్టు తీసుకొని చదివాను. అందుకే మంచి సంగీతం ఇవ్వడానికి స్కోప్ లభించింది అని విశాల్ చంద్రశేఖర్ చెప్పారు.

 సిరివెన్నెల స్వయంగా వచ్చి..

సిరివెన్నెల స్వయంగా వచ్చి..


నేను ప్రతీ సినిమాకు మనసు పెట్టి మ్యూజిక్ ఇస్తాను. వందకు 200 శాతం ఎఫర్ట్ పెడుతాను. రకరకాల ట్యూన్ ఇస్తాను. కొన్నిసార్లు ఒక ఆప్షన్ నచ్చకపోతే.. మరో ఆప్షన్ ఇస్తాను. సీతారామం సినిమాకు మాత్రం ఒకే ట్యూన్‌తో హను రాఘవపూడి సంతృప్తి చెందారు. దాని వల్లే మంచి పాటలు ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఆకట్టుకొనేలా చేశాయి. కానున్న కల్యాణం పాట రికార్డ్ చేస్తున్నప్పుడు.. సిరివెన్నెల స్వయంగా వచ్చారు. చెన్నైలో నాతోపాటు కూర్చొని అలంకారాలను తెలుగు, తమిళం, సంస్కృతంలో చర్చించాం. ప్రతీ గేయ రచయితతో మంచి కెమిస్ట్రీ, బాండింగ్ ఉంటుంది. దాని వల్లే మంచి పాటలు ఇవ్వడం కుదురుతుంది.ఎస్పీ చరణ్‌తో పాటలు పాడించాలనే ఐడియా మాత్రం నిర్మాతదే అని విశాల్ చంద్రశేఖర్ తెలిపారు.

బీజీఎం కోసం జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ నుంచి

బీజీఎం కోసం జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ నుంచి


ప్రతీ పాటకు సెన్సిబులిటీస్ ఉంటాయి. ప్రతీ ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని పాటలకు ట్యూన్స్ చేస్తాం. ఇంత అందం పాటలో చిన్నపిల్లలతో కోరస్ చేయించాలనే ఆలోచన హను రాఘవపూడిదే. కేజీఎఫ్, అఖండ సినిమాల తర్వాత బీజీఎంకు ప్రాధాన్యత పెరిగిందనేది నిజమే. ఈ సినిమా బీజీఎం కోసం చాలా కష్టపడ్డాం. 140 మంది మ్యూజిషన్స్‌తో బీజీఎం చేశాం. జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో రికార్డింగ్ చేశాం. మన వద్ద లభించని సంగీత వాయిద్యాలను వెతికి ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాం అని విశాల్ చంద్రశేఖర్ చెప్పారు.

తమిళం, మలయాళం వెర్షన్ కోసం

తమిళం, మలయాళం వెర్షన్ కోసం


సీతారామం బీజీఎం కోసం స్పెషల్‌గా ఒక టీమ్‌ను పెట్టి ఎక్స్‌ట్రా కేర్ తీసుకొన్నాం. నేను, నా భార్య, ముగ్గురు అసిస్టెంట్స్‌తో బీజీఎం చేశాం. నా భార్య తమిళ వెర్షన్‌కు చెన్నైలో, మలయాళ వెర్షన్‌కు కోచ్చిలో, నేను హైదరాబాద్‌లో ఉండి చూసుకొన్నాం. 60, 70 దశకంలో ఉండే రాగాలను ఈ సినిమాల్లో ఉపయోగించాం. ఈ సినిమాలో మొత్తం 9 పాటలు ఉంటాయి. నాకు నచ్చిన పాట ఓ సీత. నాకు చాలా దగ్గరగా ఉంటే.. దర్శకుడికి కొన్ని సలహాలు ఇస్తాను. సీతారామంలో కొంత ల్యాగ్ ఉందని చెబితే హను రాఘవపూడి కరెక్ట్ చేసుకొన్నారు అని విశాల్ చంద్రశేఖర్ చెప్పారు.

 ట్యూన్‌ను బట్టి సాహిత్యం రాయడం

ట్యూన్‌ను బట్టి సాహిత్యం రాయడం


సాధారణంగా పరిస్థితులను బట్టి ట్యూన్‌కు సాహిత్యం రాస్తారు. కొన్నిసార్లు పాట రాసిన తర్వాత ట్యూన్ కంపోజ్ చేస్తారు. నాకు మాత్రం ట్యూన్‌ చేసిన పాట రాయడం ఈజీగా అనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో నేను ఓ పరిశోధన చేశాను. దాని వల్ల పై రెండు రకాల్లో కూడా సులభంగా ట్యూన్స్ చేసుకోవచ్చు. సీతారామం సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే ఒక పాట ఉంటుంది. అది లవ్ కాదు, ట్రాజెడీ కాదు. హ్యాపీ కాదు. ఇలాంటి మూమెంట్స్‌ను దృష్టిలో పెట్టుకొని పాట చేయాల్సి వచ్చింది. మాంటేజ్ సాంగ్‌ను చేయడానికి చాలా కష్టపడ్డాను అని విశాల్ చంద్రశేఖర్ అన్నారు.

నా ఫేవరేట్ దర్శకుడు ఎవరంటే?

నా ఫేవరేట్ దర్శకుడు ఎవరంటే?


నాకు నచ్చిన, స్పూర్తి ఇచ్చిన దర్శకుడు రంజిత్ బరోడా. చాలా మందికి ఆయన తెలియదు. తమిళంలో పాత వీఐపీ సినిమాకు సంగీతం అందించారు. ఆయన సాంగ్ చేస్తే అందరూ ఏఆర్ రహ్మాన్ అనుకొన్నారు. ఆయన డ్రమ్మర్. ఆయన నాకు ఇన్సిపిరేషన్. రెహ్మాన్ కోసం పనిచేసే వారు. నాకు మిస్కిన్‌తో పనిచేయాలని ఉంది. మాధవన్‌తో ఒక సినిమా చేస్తున్నాను.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X