హృతిక్‌తో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు నటిస్తున్నాడు? నార్త్, సౌత్ విభేదాలపై మంచు విష్ణు

ఇండియన్ సినిమా పరిశ్రమలో సౌత్ ఇండియన్ సినిమాలు పూర్తిగా డామినేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు దేశంలోని వివిధ భాషల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. విభిన్నమైన కంటెంట్‌తో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సౌత్, నార్త్ అనే చర్చ భారీగా మీడియాలో మొదలైంది. కన్నప్ప సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విష్ణు మంచు ఈ అంశంపై ముక్కుసూటిగా ఇచ్చిన సమాధానాలు అందర్నీ ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. ఫిల్మీబీట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు పంచుకొన్న తన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

గతంలో దక్షిణాది సినిమాలు ఉత్తరాదిలో రిలీజైతే ఆడకపోయేవి. కానీ బాహుబలి తర్వాత సినిమా పరిశ్రమల మధ్య, యాక్టర్ల మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. ఒక భాష నటుడు మరో భాషలో నటిస్తే ప్రేక్షకులు ఆమోదిస్తున్నారు. అందుకే నటులకు పరిమితులు లేకుండా పోయాయి. హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు నటిస్తున్నాడు? అంటే.. బిగ్ స్క్రీన్‌పై ఇద్దరు ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలు తలపడితే మాటలకు అందని అనుభూతి ఉంటుంది అని విష్ణు చెప్పారు.

సినిమా పరిశ్రమలో ఇలాంటి హద్దులు చెరిగిపోయిన తర్వాత నార్త్, సౌత్ అనే విభేదాలను పట్టించుకోవద్దు. అలాంటి చర్చకు పాయింట్ లేవనెత్తితే నాకు నచ్చదు. మీకు ఓ చక్కడి ఉదాహరణ చెబుతాను. అవెంజర్ సినిమాలో నటించిన వారందరూ కూడా అమెరికన్లు అనుకొంటారు. కానీ అందులో నటించిన వారందరూ వేరే దేశాల నుంచి వచ్చి నటించి.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించారు అనే విషయాన్ని విష్ణు మంచు వెల్లడించారు.

అవెంజర్స్ సినిమాలో నటించిన థార్ పాత్రను పోషించిన నటుడు ఆస్ట్రేలియన్. వాల్వెరిన్ ఆస్ట్రేలియన్ యాక్టర్. డెడ్‌పూల్‌లో నటించిన యాక్టర్ కెనడియన్. ఇలా రకరకాల దేశాల నుంచి ఎంతో మంది కలిసి ఓ మంచి సినిమాలో భాగమయ్యారు. వారు ఎలా నటించారని చూస్తారే కానీ.. వారు ఎక్కడి నుంచి వస్తారనే విషయాన్ని పట్టించుకోరు అని విష్ణు అన్నారు.

Vishnu Manchu opinion on Hrithik and Jr NTR War and differences between North and South film Industries

అలాగే కన్నప్ప సినిమా కథ డిమాండ్ చేయడం వల్ల, అలాగే మార్కెటింగ్ స్ట్రాటెజీని దృష్టిపెట్టుకొని అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి అగ్ర నటులను సినిమాలో నటింప చేశాం. వారి టాలెంట్‌ను దృష్టిలో పెట్టుకొని.. సినిమాలోని పాత్రలను న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే గొప్ప నటులను సినిమాలోకి తీసుకొన్నాం. కన్నప్ప అన్ని వర్గాల, అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తుంది అనే విశ్వాసాన్ని విష్ణు మంచు వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X