For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vishnu Vishal నా తుదిశ్వాస వరకు నా గుండెల్లో రవితేజ..నన్ను ఎవరూ నమ్మని సమయంలో.. విష్ణు విశాల్

  |

  మాస్ మహారాజ్ రవితేజ్ సొంత బ్యానర్ ఆర్‌టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోజ్ బ్యానర్‌పై తమిళ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటిస్తున్న చిత్రం మట్టి కుస్తి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు రవితేజ నిర్మాతగా మారడంతో ప్రాజెక్టు క్రేజీగా మారింది. ఈ సినిమ డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విష్ణు విశాల్ తెలుగు ఫిల్మీబిట్‌తో మాట్లాడుతూ...

   ట్రైలర్‌లో చూపించని సర్‌ప్రైజ్‌లు

  ట్రైలర్‌లో చూపించని సర్‌ప్రైజ్‌లు


  మట్టి కుస్తి సినిమా స్పోర్ట్స్ ఫిలిం. పక్కా ఫ్యామిలీ మూవీ. భార్యభర్తల మధ్య ఇగోస్ నేపథ్యంగా కథ సాగుతుంది. మట్టి కుస్తీ కేరళకు సంబంధించిన క్రీడ. హీరోయిన్ క్యారెక్టర్ మలయాళం నేపథ్యంతో ఉంటుంది. భార్య భర్తల మధ్య కలహాలు, అభిప్రాయబేధాలతో సాగే కథ అందరికి కనెక్ట్ అవుతుంది. వినోదాత్మకంగా సినిమా కథ సాగుతుంది. ఈ సినిమా ట్రైలర్‌లో చూపించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. ఆడియెన్స్ చాలా ఇంటెలిజెంట్స్. అందుకే కథ రివీల్ కాకుండా కొన్ని దాచిపెట్టాం అని విష్ణు విశాల్ చెప్పారు.

  పెళ్లి కోసం రెండు అబద్దాలు

  పెళ్లి కోసం రెండు అబద్దాలు


  సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాకు మట్టి కుస్తీ మూవీకి చాలా పోలీకలు ఉన్నాయి. మట్టి కుస్తీ ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తుంది. సుల్తాన్ సినిమాకు మా మూవీకి ఎక్కడ పోలీకలు ఉండదు. ఒకసారి సినిమా చూస్తే చాలా సర్‌ప్రైజెస్ ఉండటమే కాకుండా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఈ సినిమాలో నేను కబాడ్డీ ప్లేయర్. అయితే నేను మట్టికుస్తీ ఎందుకు ఎంచుకొన్నాదనే కథలో ట్విస్టు. నూరు అబద్దాలు ఆడి పెళ్లి చేయమంటారు. కానీ పెళ్లి కోసం రెండు అబద్దాలు ఆడాం. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. భార్యభర్తల ఎమోషన్స్ ఉంటాయి. ఆ రెండు అబద్దాలు ఏమిటి? అనే కథలో ఆసక్తికరమైన అంశాలు. అని విష్ణు విశాల్ అన్నారు.

  రవితేజ నిర్మాత ఎలా అయ్యారంటే?

  రవితేజ నిర్మాత ఎలా అయ్యారంటే?


  మట్టి కుస్తీ మూవీకి నిర్మాతగా రవితేజ మారడం వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటన మీతో షేర్ చేసుకొంటాను. నా భార్య గుత్తా జ్వాలా ఫ్రెండ్ శ్వేత వల్ల రవితేజను కలిశాం. అప్పటి నుంచి మా మధ్య బాండింగ్ ఏర్పడింది. రాక్షసుడు సినిమా హిట్ కావడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటని రవితేజ అడిగారు. అయితే నాకు మాస్ కథలతో మాస్ హీరో కావాలని ఉందని మోహన్ దాస్ టీజర్ చూపించాను. అప్పుడే మట్టి కుస్తీ కథ గురించి లైన్ చెప్పాను. తనకు బాగా నచ్చడంతో తాను నిర్మించడానికి ఆసక్తి చూపారు అని విష్ణు విశాల్ అన్నారు.

   నేనే హీరోగా చేస్తానని రవితేజ అంటే..

  నేనే హీరోగా చేస్తానని రవితేజ అంటే..


  నేను చెప్పిన మట్టి కుస్తీ స్టోరీలైన్ నచ్చడంతో..డైరెక్టర్ పంపి కథ నేరేట్ చేయించాను. ఆ తర్వాత రవితేజ కాల్ చేసి.. కథ బాగుంది. కాకపోతే చిన్న రిక్వెస్ట్. తమిళంలో మీరు హీరోగా చేయండి.. నేను తెలుగులో హీరోగా సినిమా చేస్తానని అన్నారు. అయితే లేదు సార్.. తెలుగు, తమిళంలో నేనే చేస్తానని చెప్పారు. యాక్టర్‌గా నాకు నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకొంటానని చెప్పాను. దాంతో ఆయన కన్విన్స్ అయ్యారు. అలా నిర్మాతగా రవితేజతో ప్రయాణం అలా మొదలైంది. నన్ను ఎవరూ నమ్మని సమయంలో రవితేజ నమ్మారు. నా జీవితంలో హిట్లు, ఫ్లాపులు వచ్చినా.. వాటికి అతీతంగా రవితేజ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారు. ఈ సినిమా నిర్మాతగా పేరు మాత్రమే కాదు.. భారీగా డబ్బు తెచ్చిపెడుతుంది. ఈ సినిమా బిజినెస్ రిలీజ్‌కు ముందే పూర్తి అయింది అని విష్ణు విశాల్ వివరించారు.

  మట్టి కుస్తీ ట్రైలర్ కోసం ముగ్గురు ఎడిటర్లు

  మట్టి కుస్తీ ట్రైలర్ కోసం ముగ్గురు ఎడిటర్లు


  మట్టి కుస్తీ ట్రైలర్ కటింగ్ అనేది నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఛాలెంజ్‌గా నిలిచింది. ముగ్గురు ఎడిటర్లు పనిచేశారు. రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ట్రైలర్ కట్ చేశాం. ట్రైలర్ బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకొన్నాం. కరోనా సమయంలో ప్రేక్షకులు ప్రపంచ సినిమాను చూశారు. వారికి సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఆడియెన్స్ ఉన్న అంచనాలకు తగినట్టుగా కంటెంట్‌ను రెడీ చేశాం. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా ద్వారా చిన్న సందేశం కూడా ఉంటుంది. మహిళలకు బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాం అని విష్ణు విశాల్ చెప్పారు.

  రజనీకాంత్‌తో లాల్ సలామ్ మూవీ

  రజనీకాంత్‌తో లాల్ సలామ్ మూవీ


  మట్టి కుస్తీ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి షూట్ చేశాం. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమా బిగ్ రేంజ్‌లో ప్లాన్ చేశాం. మట్టి కుస్తీ సినిమాను స్క్రిప్టు దశలోనే నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు ఓటీటీ రైట్స్ సొంతం చేసుకొన్నది. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రైస్ లభించింది. నా కెరీర్‌లో బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి. అందుకే ఐదు సినిమాలకు నేను ప్రొడ్యూసర్. బయట సినిమాల్లో నటించకూడదని అనుకొన్నాను. ఐదు సినిమాల తర్వాత రజనీకాంత్‌తో లాల్ సలామ్ సినిమా చేస్తున్నాను. అలాగే రాక్షసుడు డైరెక్టర్‌తో మరో సినిమా చేస్తున్నాను అని విష్ణు విశాల్ చెప్పారు.

  మట్టి కుస్తీ సినిమా చూస్తే..

  మట్టి కుస్తీ సినిమా చూస్తే..

  మట్టి కుస్తీ సినిమా చూస్తే.. దాంపత్య జీవితంపై పురుషులు, మహిళలకు ఉండే భావాలు కనిపిస్తాయి. మహిళా చైతన్యం గురించి మేము చెప్పడం లేదు. అది చాలా పెద్ద సబ్జెక్ట్. ప్రతీ ఒక్కరికి ఒక్కో కోణంలో అభిప్రాయాలు ఉంటాయి. ఫెమినిజం, ఉమెన్ ఎంపవర్‌మెంట్‌ విషయంలో ప్రతీ ఒక్కరికి ఒక్కో అవగాహన ఉంటుంది. దాంపత్య జీవితంలో దంపతులు భావాలను గౌరవించేలా ఉంటుంది అని విష్ణు విశాల్ అన్నారు.

  English summary
  South Actor Vishnu Vishal's latest movie is Matti Kusthi. Ravi Teja is the producer for the movie. This movie is set to release on the Dec 2. Here is the Vishnu Vishal Interview about the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X