ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది.. ఏడింతలు లాభం.. విష్ణు విశాల్
హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయిక. 'ఆర్ టీ టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో హీరో విష్ణు విశాల్ చిత్ర విశేషాలని తెలుగు ఫిల్మీబీట్‌తో పంచుకొంటూ..
నాకు కొన్ని డ్రీమ్ రోల్స్ చేయాలని ఉంది. సూపర్ హీరో క్యారెక్టర్ చేయాలని ఉంది. సౌత్‌లో ప్రాపర్ సూపర్ మలయాళంలో మిన్నల్ మురళీ లాంటి సినిమా చేయాలని అనుకొన్నాను. ఆ సినిమా వచ్చిన తర్వాత కొంత నిరాశ పడ్డాను. కొంత ఆనందపడ్డాను. ఆ సినిమా వచ్చిన తర్వాత దర్శకుడు టోవినోకు కాల్ చేసి అభినందించాను. నేను ఇలాంటి సినిమా చేయాలని అనుకొన్నాను. ఆ సినిమా మీరు చేశారు. నేను చేయలేకపోయానే అనే బాధ కలిగింది. అయినా ఎవరో ఒకరు చేశారని సంతృప్తి పడ్డాను అని విశాల్ తెలిపారు.

రాక్షసుడు సినిమా తర్వాత నా కెరీర్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకొన్నాయి. ఆ సినిమా నుంచి చాలా నేర్చుకొన్నాను. ఆ సినిమాకు నేను ప్రొడ్యూసర్ కాదు. అయినా ఆ మూవీ లర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్. నా జీవితాన్ని మార్చేసిన సినిమా. ఆ సినిమా బిజినెస్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యాను. ఆ సమయంలో కంటెంట్‌కు దూరం కావొద్దని సలహా ఇచ్చారు. రాక్షసుడు సినిమా కంటెంట్ వల్లే నడిచిందనే విషయం తెలిసింది కంటెంట్ అనేది సినిమాకు ఎంత ముఖ్యమో రాక్షసుడు చెప్పింది. ఆడియెన్స్ కమర్షియల్ వాల్యూస్ కంటే కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నట్టు అర్ధమైంది. ఆ తర్వాతే ఎఫ్ఐఆర్, మట్టి కుస్తీ చిత్రాలను ఎంచుకొన్నాను అని విష్ణు విశాల్ చెప్పారు.
రాక్షసుడు సినిమా నా కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా నాకు భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది. రాక్షసుడు సినిమా రిలీజ్‌కు ముందే రీమేక్ రైట్స్ తీసుకొన్నాను. ఆ హిందీ రీమేక్ రైట్స్‌కు మాటల్లో చెప్పలేనంత డబ్బు వచ్చింది. నేను కొన్న డబ్బుకు ఏడింతలు డబ్బు తెచ్చిపెట్టింది. డిజిటల్ రైట్స్ అవకాశాలు పెరిగాయి. రాక్షసుడు సినిమా అలా నా జీవితాన్ని మార్చేసింది. హీరోగా నా భుజాల మీద మోసిన చిత్రం రాక్షసుడు. ఈ సినిమా నాకు ఎన్నో అనుభవాలను నేర్పడటమే కాకుండా నిర్మాతగా నా ఆలోచనలు మార్చేసింది.


Click it and Unblock the Notifications











