Video Interview: అప్పుడే నోరు విప్పలేదు ఎందుకు? జానీ మాస్టర్ కేసుపై కావ్య థాపర్ సంచలనం (వీడియో)
మ్యాచో స్టార్ గోపిచంద్, సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం దసరా పండుగ కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఫిల్మీబీట్ తెలుగుతో మాట్లాడుతూ..
దర్శకుడు శ్రీను వైట్ల మార్కుకు తగినట్టే విశ్వం సినిమా ఉంటుంది. కామెడీ, ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. ఒక విభిన్నమైన మైన కథతో రూపొందింది. మదర్ సెంటిమెంట్‌తోపాటు ఉగ్రవాద నేపథ్యంగా సాగే కథ అందర్నీ కట్టిపడేస్తుంది. డైలాగ్స్ కొత్త అనుభూతికి గురి చేస్తాయి అని కావ్య థాపర్ అన్నారు.

మలయాళ సినిమా పరిశ్రమలో మీటూ సంఘటనలు రావడం, జానీ మాస్టర్ కేసు దురదృష్టకరం. ఇలాంటి విషయాల్లో ఎవరు బాధితులైనా సరే నాకు చాలా బాధగా ఉంది. అయితే నీకు ఏదైనా జరగకూడనిది జరిగితే.. వెంటనే స్పందించాలి. ఎవరైనా నిన్ను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఆ విషయం అప్పుడే బయటపెట్టి వారి నోరు మూయించాలి. కానీ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని వెల్లడించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని కావ్య థాపర్ అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కొందరు దైనికైనా సిద్దపడుతారు. కొందరు వాటికి దూరంగా ఉంటారు. ఇలాంటి సంఘటనలు నాణెనికి రెండు వైపుల ఉండే విషయం. ఈ విషయంలో కొందరి బలహీనతలను దాచుకోవడానికి వారు ఇలాంటి సంఘటనలతో దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కొంత మేరకు సొంత ప్రయోజనాలు ఆశించి ఇతరులపై బురద జల్లుతున్నారనిపిస్తుంది. అదే జరిగితే తప్పు అని నేను అంటాను అని కావ్య థాపర్ చెప్పారు.
ఒకరిపై బురద జల్లడానికి, ఒకరి ప్రతిష్టను దిగజార్చడానికి ఇలాంటి పద్దతులు ఉపయోగిస్తే నేను ఒప్పుకోను. స్వలాభానికి ఎవరైనా ఇలాంటివి చీప్ ట్రిక్స్ చేయడాన్ని నేను ఖండిస్తాను. ఇలాంటి సంఘటనలు నాకు ఎదురు కాలేదు అని కావ్య థాపర్ అన్నారు. ఆమెకు సంబంధించిన వీడియో ఇంటర్వ్యూ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











