మహేష్ కటౌట్‌కు పాలాభిషేకం.. సినిమా అంటే అంత పిచ్చి.. ఓ పిట్ట కథ ఎలా అంటే
కేరింత చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విశ్వంత్ తనదైన నటనతో ఆకట్టుకొంటున్నారు. మనమంతా, విస్మయం, జెర్సీ, తోలుబొమ్మలాట లాంటి సినిమాలు యాక్టర్‌గా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ రూపొందిస్తున్న ఓ పిట్ట కథ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 6వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విశ్వంత్ మీడియాతో ముచ్చటించారు. తన కెరీర్ గురించి, ఓ పిట్ట కథ గురించి చెప్పిన విషయాలు మీ కోసం..

చంద్రశేఖర్ ఏలేటి సలహాతో
నేను తోలుబొమ్మలాట సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఫోన్ చేసి చెందు ముద్దు గురించి చెప్పాడు. మంచి కథ అని చెప్పడంతో మీకు నచ్చితే నేను చేస్తానని అప్పుడే చెప్పాను. ఆ తర్వాత దర్శకుడు చెందు ముద్దు చెప్పిన కథ విన్న తర్వాత నేను థ్రిల్ అయ్యాను. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఓ ఫీలింగ్ నింపుతుంది. ఇది కంప్లీట్‌గా డైరెక్టర్ మూవీ. ఓ చిన్న మైండ్ గేమ్ కూడా ఉంటుంది అని విశ్వంత్ అన్నారు.

అందరి నుంచి ప్రశంసలు
ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులు, దర్శకులు ఓ పిట్ట కథ సినిమా కథను విన్నారు. ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే అందరిని కట్టిపడేసింది. నా గురువు చంద్రశేఖర్ ఏలేటికి సినిమా స్క్రీన్ ప్లే నచ్చింది. స్క్రీన్ ప్లేతో ఆయన మ్యాజిక్ చేయడం మనకు తెలిసిందే. అందుకే ఆయన నచ్చినదని చెప్పగానే నేను ఒకే అన్నాను అని విశ్వంత్ తెలిపారు.

కమర్షియల్ సినిమాలు గురించి
నా కెరీర్‌లో మనమంతా గుడ్ ఫిలిం. కమర్షియల్ ఆడకపోయిన ఓ మంచి చిత్రమనే ఫిలింగ్ కలిగించింది. ప్రస్తుతం మంచి చిత్రాలతోపాటు కమర్షియల్ సినిమాలు చేయాలనే కోరిక ఉంది. కాకపోతే ఎక్కువ రోజులు ప్రేక్షకులు గుర్తుంచుకొనే సినిమాలు చేయాలనే ఆశతో ఎదురుచూస్తున్నా అని విశ్వంత్ పేర్కొన్నారు.

చెందు ముద్దు గురించి
ఓ పిట్ట కథ డైరెక్టర్ చెందు ముద్దు పరిచయం చాలా బాగుంది. అమలాపురంలో జరిగిన షూటింగ్ సమయంలో బాగా దగ్గరయ్యాం. ఆయన ఓ పీఠంలో ఉంటారు. అక్కడికి కూడా వెళ్లాం. ఇది ప్రేమ కథతో మొదలై సస్పెన్స్ థ్రిల్లర్‌గా ముగుస్తుంది. బ్రహ్మాజీతోపాటు ఆయన కుమారుడు సంజయ్ రావుతో కలిసి నటిస్తున్నాను. నిత్యశెట్టి సినిమాకు అదనపు ఆకర్షణగా అని చెప్పవచ్చు. పాత్రల ద్వారా సినిమా డ్రైవ్ అవుతుంది అని విశ్వంత్ తెలిపారు.
Recommended Video


మహేష్ బాబు కటౌట్‌కు
నాకు సినిమాలు అంటే పిచ్చి. కోయంబత్తూరులో మేము చదువుకొనేటప్పుడు మహేష్ బాబు సినిమా రిలీజైంది. ఆ సినిమా రిలీజైతే పెద్ద కటౌట్ పెట్టి పాలతో అభిషేకం చేశాం. సినిమా అంటే నాకు అంత పచ్చి. కానీ సినీరంగంలో ఎలాంటి బ్యాకప్ లేకుండా అదృష్ణం పరీక్షించుకొంటున్నాం. మొదటి రోజు షూటింగ్ చాలా విచిత్రంగా ఉంది. ప్రస్తుతం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు మాత్రమే చేస్తున్నా. త్వరలో కమర్షియల్ మూవీస్ చేస్తాను అని విశ్వాంత్ అన్నారు.


Click it and Unblock the Notifications











