త్రివిక్రమ్, రాజమౌళికి కథలు చెప్పాం.. వారేమన్నారంటే? కుమారి శ్రీమతి రచయితల ఇంటర్వ్యూ

ఐఐటీలో ఉన్నత విద్య, అత్యధిక ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో రచయితలుగా రాణించాలన్న ఒక సంకల్పంతో ముగ్గురు యువకులు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రకరకాల ప్రయత్నాల తర్వాత ప్రముఖ నిర్మాత స్వప్న దత్ నిర్మించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‌కు రైటర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. తమకు లభించిన అవకాశాన్ని చేజిక్కించుకొన్న జయంత్ తాడినాడ, ఉదయ్ ఆగమర్షన్, కౌశిక్ సుబ్రహ్మణ్యం రచయితలుగా ప్రశంసలు అందుకొంటున్నారు. యువ రచయితలు తమ జీవితాల్లో చోటు చేసుకొన్న సంఘటనలు, అనుభూతులను పంచుకొంటూ..

త్రివిక్రమ్, రాజమౌళికి కథలు చెప్పాం:మేము రాసిన కథలు ప్రేక్షకులకు చెప్పాలనే తపన ఉండేది. మా కథలను త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ఎస్ రాజమౌళి లాంటి అగ్ర దర్శకులకు వినిపించాం. వారు మా కథలు విని ప్రశంసించినప్పుడు మాకు మాపై నమ్మకం కుదిరింది. కలిసి పనిచేద్దాం అంటూ వారు చెప్పిన మాటలు భరోసాగా నిలిచాయి. రైటింగ్ అనేది మాకు ఆర్ట్. మేము రాసే కథలు, మాటలు మాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తాయి అని జయంత్ తాడినాడ, ఉదయ్ ఆగమర్షన్, కౌశిక్ సుబ్రహ్మణ్యం చెప్పారు.

We narrated stories to Trivikram, SS Rajamouli, says Kumari Srimathi writers

ఎమోషన్స్ బేస్ చేసుకొని..:తెలుగులో ఒక వెబ్ సిరీస్‌కు పక్కాగా స్క్రిప్ట్ రాయగలమని నమ్మకం వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదలేసి ఇండస్ట్రీకి వచ్చేశాం. నాలుగు, ఐదు గంటల మూవీకి రాయాల్సి వచ్చినప్పుడు టెక్నిక్స్ డిఫరెంట్. మేము ఎంచుకొన్న ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి. ఎమోషన్స్ రాయడం మా బలంగా భావిస్తాం. దానిని చూసే స్వప్నదత్ మాకు అవకాశం ఇచ్చింది అని చెప్పారు.

We narrated stories to Trivikram, SS Rajamouli, says Kumari Srimathi writers

పాత్రలను అలా స్టడీ చేసి:కుమార్ శ్రీమతి సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ప్రతీ క్యారెక్టర్‌కు సంబంధించిన సైకాలజీని స్టడీ చేసి రాశాం. పాత్ర మనస్తత్వాలు, ఆడంబరాలు, బిహేవియర్‌ను స్టడీ రాశాం. చిన్న చిన్న క్యారెక్టర్ల బిహేవియర్‌ను కూడా వదల్లేదు. అందుకే ప్రతీ పాత్ర ఈ వెబ్ సిరీస్‌లో రిజిస్టర్ అయింది. మా ప్రతిభకు మంచి ఫలితం లభించిందనే ఫీలింగ్‌లో ఉన్నాం అని చెప్పారు.

We narrated stories to Trivikram, SS Rajamouli, says Kumari Srimathi writers

మా అమ్మ చెప్పిన మాటలే..:కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‌‌ స్ట్రీమింగ్ తర్వాత మా అమ్మ నుంచి మంచి ప్రశంస రావడం మాకు సంతోషాన్ని కలిగించింది. ఆమెకు బాగా నచ్చింది. మేము ఐఐటీలో చదివేటప్పుడు మా అమ్మ, నాన్న చాలా కష్టపడ్డారు. అనకాపల్లి నుంచి హైదరాబాద్‌లో చదవడానికి వారు చాలా కష్టపడ్డారు. మేము సినిమా ఇండస్ట్రీకి వెళ్తామని చెప్పినప్పుడు.. మాకు ఇచ్చిన ప్రోత్సాహమే మా సక్సెస్‌కు కారణం. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‌లో ఆశకు ఆశయానికి ఓ తేడా ఉంటుందనే డైలాగ్స్ ఉంటుంది. మేము ఇండస్ట్రీకి వెళ్లాలనుకొన్న సమయంలో ఆ డైలాగ్‌ను మాతో మా అమ్మ చెప్పింది చెప్పారు అని జయంత్, ఉదయ్,

నిత్యమీనన్, గౌతమి, రామేశ్వరి ప్రశంసలు:కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత నిత్యమీనన్ మాతో మాట్లాడుతూ.. మీరు రాసిన స్క్రిప్టు చదువుతుంటే నవ్వు వస్తున్నది. మంచి ఫీల్ కలిగిస్తున్నది. నాకు మరింత ఫెర్ఫార్మెన్స్ చేయాలనిపిస్తున్నది అని చెప్పిన మాటలు బాగా సంతోషం కలిగించాయి. గౌతమి గారికి కూడా స్క్రిప్టు పరంగా మంచి అవగాహన ఉంది. ఆమెలో కూడా మంచి రచయిత ఉంది. కార్‌వాన్‌లో స్క్రిప్టు గురించి చర్చించినప్పుడు మా వర్క్‌ను అప్రిషియేట్ చేశారు. అలాగే సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి కూడా మా వర్క్‌ను ప్రశంసించారు. డాక్టర్ బాబు నిరుపమ్ కూడా మా వర్క్‌ను మెచ్చుకొన్నారు. అది మాకు ఓ బ్లెస్పింగ్‌గా భావిస్తాం.

We narrated stories to Trivikram, SS Rajamouli, says Kumari Srimathi writers

డైరెక్షన్ చేస్తామా? అంటే.. :మేము రచయితలుగా కాకుండా, మా వద్ద సినిమాలకు కావాల్సిన ఫుల్ కథలు రాసుకొని ఉన్నాం. హీరోల వద్దకు వెళ్లి కథలు చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథలు చెప్పి సినిమాలు చేయాలనే ఉంది. కానీ డైరెక్టర్ అవుతామా? లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో రెండు కథలు చెప్పాం. ప్రాజెక్ట్K మూవీ తర్వాత అవి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇంక కొంత మంది నిర్మాతలకు చెప్పాం. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‌కు సీక్వెల్ ఉండే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X