కన్నప్ప మూవీకి మోహన్ బాబు డైరెక్టర్ అయితే? విష్ణు మంచు హిలేరియస్ అన్సర్ ఏంటో తెలుసా?
టాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు.
మహ భారతం సీరియల్‌కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో ఫిల్మీబీట్ ఎడిటర్ రాజబాబు అనుములతో అక్షయ్ కుమార్, విష్ణు మంచు మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు విష్ణు మంచు సమాధానం ఇస్తూ..

మా నాన్న గారికి పురాణాలు, కన్నప్ప గురించి బాగా తెలుసు. అయితే మా ఫాదర్ మోహన్ బాబుకు డైరెక్టర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని భావించను. సహజంగా కొందరు యాక్టర్లు తమలో డైరెక్టర్ ఉన్నాడని భావిస్తారు. ఓ సీన్ డైరెక్ట్ చేయడం లేదా సెట్‌లో డైరెక్టర్‌కు కొన్ని సలహాలు ఇవ్వడం వల్ల తమలో దర్శకుడి క్వాలిటీస్ ఉన్నాయని భావిస్తారు. కానీ అది నిజం కాదు. డైరెక్టర్ అంటే చాలా విషయాల్లో పట్టు ఉండాలి. ఒకవేళ మా నాన్న గారు డైరెక్టర్ అయితే సెట్లో ప్రతీ రోజు ఎవరో ఒక యాక్టర్‌ను కొట్టడం జరుగుతుంది. ఇలాంటి జోక్‌లను పక్కన పెడితే.. నాన్న గారికి డైరెక్షన్ చేసే మైండ్ సెట్ లేదు అని విష్ణు అభిప్రాయపడ్డారు.
కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్‌ను తీసుకోవడాన్ని నాన్న గారు కరెక్ట్ అన్నారు. ఆ పాత్రకు ఆయనను తీసుకోవడం సమంజసం అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అయితే ఒకవేళ మనం ఆఫర్ ఇస్తే.. ఆయన అంగీకరిస్తారా? కన్నప్ప సినిమాలో నటించేందుకు ఒప్పుకొంటారా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. అయితే అంతకుముందు ఆయనతో పరిచయం లేకపోవడం వల్ల నేను అక్షయ్‌ని నా తరహాలో నేను రీచ్ అవుతానని చెప్పాను అని విష్ణు మంచు అన్నారు.

అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్న తర్వాత మోహన్ బాబు గారు చాలా సంతోషించారు. ఆయన సెట్‌కు వచ్చినప్పుడు సగౌరవంగా చూసుకోవాలని హెచ్చరించారు. ఆయన మర్యాద విషయంలో ఎలాంటి లోపం రాకూడదు. ఆయన డేట్స్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం వెంటనే రెమ్యునరేషన్ ఇవ్వాలి అని నాన్న గారు సూచించారు. అయితే అక్షయ్ కుమార్‌లో గొప్పతనం ఏమిటంటే? ఆయన షూటింగ్ కంప్లీట్ చేసుకొని..డబ్బింగ్ చెప్పిన తర్వాత కూడా రెమ్యునరేషన్ అడగలేదు. ఆ విషయంలో అక్షయ్‌ను నేను తలఎత్తుకొని చూస్తాను. ఆయనలో గొప్ప నటుడే కాదు. మానవత్వం ఉన్న వ్యక్తి ఉన్నారు. ఆయన తన వ్యక్తిత్వం నన్ను నా హృదయాన్ని టచ్ చేసింది అని విష్ణు మంచు తెలిపారు.
కన్నప్ప సినిమాలో శివుడి పాత్రకు అక్షయ్ కుమార్ గొంతునే వాడుతున్నాం. సెట్‌లో ఆయన తాను సొంతంగా తెలుగు డైలాగ్స్ చెప్పారు. డబ్బింగ్ విషయానికి వస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆయన వాయిస్‌తో డబ్ చేశాం. ఈ సినిమా నాకు తొలి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాను నార్త్‌లో భారీగా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాను నార్త్‌లో 1800 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. అదీ కూడా అక్షయ్ కుమార్ స్టార్ పవర్ కారణంగా సాధ్యమైంది అని విష్ణు మంచు చెప్పారు.


Click it and Unblock the Notifications











