ద‌ర్శ‌కేంద్రుడి ప్ర‌శంసను మ‌ర్చిపోలేను: హీరో రామ్ కార్తీక్ ఇంటర్వ్యూ

యువ‌హీరో రామ్ కార్తీక్ న‌టించిన రెండు సినిమాలు వేర్ ఈజ్ వెంక‌ట ల‌క్ష్మి, మౌన‌మే ఇష్టం .. ఒకేసారి థియేట‌ర్ల‌లోకి రిలీజ‌య్యాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు సినిమాల్లో త‌న న‌ట‌న‌కు ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌లు ద‌క్కాయ‌ని, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశంసలు మరిచిపోలేనివి అన్నారు.

నేను న‌టించిన వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి, మౌన‌మే ఇష్టం ఒకేసారి రిలీజ‌య్యాయి. ఇది అరుదైన స‌న్నివేశం. ప్రేక్ష‌కుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో ఎమోష‌న్ సీన్స్ కి ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని రామ్ కార్తీక్ తెలిపారు.

వెంక‌ట ల‌క్ష్మి రెస్పాన్స్? ఎలా ఉంది?

వెంక‌ట ల‌క్ష్మి రెస్పాన్స్? ఎలా ఉంది?

ఎమోష‌న్స్ కి.. భ‌య‌పెట్టే స‌న్నివేశాల‌కు జ‌నం బాగా క‌నెక్ట‌వుతున్నారు. నా పాత్ర‌కు స్పంద‌న బావుంది. రాయ్ ల‌క్ష్మీని త‌ప్ప ఆ పాత్ర‌లో వేరొక‌రిని ఊహించుకోలేరు అన్నంత‌గా త‌ను న‌టించారు.

మౌనమే ఇష్టం` స్పందన ఎలా ఉంది?

మౌనమే ఇష్టం` స్పందన ఎలా ఉంది?

ఆ సినిమా ఓ అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం. ఈ సినిమాలో నా రోల్ యువ‌త‌రం అంద‌రికీ బాగా క‌నెక్ట‌వుతోంది. బాగా న‌టించాన‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. నిజాయితీ ఉన్న ప్రేమ‌క‌థ ఇది. సీనియ‌ర్ క‌ళాదర్శకులు అశోక్ గారు అద్భుతంగా తెర‌కెక్కించారు. స‌హ‌జ‌సిద్ధంగా చూపిస్తూనే క‌మ‌ర్షియ‌ల్ కోణంలో తెర‌కెక్కించారు. ఆయ‌న‌కు నా సిన్సియ‌ర్ థాంక్స్.

ఎవరెవరి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి?

ఎవరెవరి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి?

`మౌన‌మే ఇష్టం` సినిమా చూసిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు గారు .. ఆన్ స్క్రీన్ చాలా ఎత్తుగా క‌నిపిస్తున్నావ్.. న‌ట‌న స‌హ‌జంగా ఉంది .. ఎమోష‌న్ పండించావ్.. బాగా న‌టించావ్‌.. అని ప్ర‌శంసించారు.``హీరో కాదు.. ఆ రోల్ క‌నిపించింది!!`` అని అంత పెద్ద ద‌ర్శ‌కుడి ప్ర‌శంస ద‌క్క‌డం ఎంతో ఆనందాన్నిచ్చింది. నాలో కాన్ఫిడెన్స్ మ‌రింత పెరిగింది.

థియేట‌ర్లు విజిట్ చేశారా?

థియేట‌ర్లు విజిట్ చేశారా?

ప్ర‌సాద్ మ‌ల్టీప్టెక్స్ తో పాటు మాస్ థియేట‌ర్ల‌లో ఆడియెన్ స్పంద‌న చూశాను. ది బెస్ట్ రెస్పాన్స్ ద‌క్కింది.

ఇంకా ఏం సినిమాలు చేస్తున్నారు?

ఇంకా ఏం సినిమాలు చేస్తున్నారు?

తెలుగు, త‌మిళంలో అవ‌కాశాలొస్తున్నాయి. ప్రస్తుతం చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

ఫ్యూచర్ ప్లానింగ్ ఏమిటి?

ఫ్యూచర్ ప్లానింగ్ ఏమిటి?

నా గ‌త చిత్రాలు మామ చంద‌మామ‌, మంచు కురిసే వేళ‌లో సినిమాల్లో నా న‌ట‌న‌కు చ‌క్క‌ని పేరొచ్చింది. తాజాగా రిలీజైన రెండు చిత్రాల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇక‌పైనా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టించాల‌నుంది. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లు అంటే ఇష్టం. ప్రేక్ష‌కులు మెచ్చే కొత్త క‌థ‌ల్ని ఎంచుకుంటాను. ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌లే కాదు.. కొంచెం ర‌గ్గ్ డ్ గా ఉండే మాస్ పాత్ర‌లు చేయాల‌నుంది.

మీ ఫ్యామిలీ గురించి...

మీ ఫ్యామిలీ గురించి...

పుట్టి పెరిగింది హైద‌రాబాద్ లో. అయితే మా కుటుంబానికి విజ‌య‌న‌గ‌రం- వైజాగ్ క‌నెక్ష‌న్ ఉంది. నాన్న‌గారు స్థిరాస్తి రంగంలో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X