Who is Deepa Thomas? దీపా థామస్ హీరోయిన్‌గా ఎందుకంటే? రావు బహదూర్‌లో పాత్ర గురించి హీరో సత్యదేవ్
సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత బ్యానర్ ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం రావు బహద్దూర్. ఈ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, వికాస్ ముప్పాల, మలయాళ నటి దీపా థామస్, బాలా పరసార్, ఆనంద్ భారతీ, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా వెంకటేష్ మహా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బొల్లెబోయిన, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ పర్మార్, మ్యూజిక్: స్మరణ్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్: రోషన్ సింగ్, క్యాస్టూమ్ డిజైనర్: శిల్పా జీఎన్ఎస్, సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా జూలై 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సత్యదేవ్ ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. మహేష్ బాబు ఈ సినిమాను సమర్పించడం, చిరంజీవి ఇచ్చిన సలహాల వివరాలను వెల్లడించారు. ఇంకా ఆయన హీరోయిన్ దీపా థామస్ గురించి ఇచ్చిన వివరాల్లోకి వెళితే..

రావు బహద్దూర్ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లను ఆ పాత్రలకు తగినట్టుగా తీసుకొన్నాం. ఇప్పటి వరకు సరైన గుర్తింపు వారికి ఉండకపోవచ్చు. కానీ ఈ మూవీ తర్వాత వారి నటనకు, వారికి మంచి గుర్తింపు వస్తుంది. ఈ చిత్రంలో రేణుక అనే పాత్రను మలయాళ హీరోయిన్ దీపా థామస్ చేస్తున్నారు. మలయాళంలో చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆమె అద్బుతమైన నటి అని హీరో సత్యదేవ్ తెలిపారు.
దీపా థామస్ మలయాళంలో చాలా సినిమాలు చేసింది. తెలుగులో ఆమెకు తొలి సినిమా. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఆమె గురించి చాలా తెలుసుకొంటారు. ఈ సినిమాలో ఆమె నర్స్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆంగ్లో ఇండియన్ క్యారెక్టర్‌లో దీపా కనిపిస్తారు. ఆంగ్లో ఇండియన్ కావడంతో ఆమె కరెక్ట్‌గా సరిపోతారని భావించి ఆమెను తీసుకొన్నాం అని సత్యదేవ్ చెప్పారు.
దీపా థామస్ విషయానికి వస్తే.. కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన మోడల్, యాక్టర్. ట్రాన్స్ చిత్రంలో నటించి గుర్తింపు పొందారు. హోమ్, వైరస్, పెరుమణి, నాన్ ఇప్పో ఎంత చేయ్యా, సులైఖా మంజిల్ చిత్రాల ద్వారా పాపులారిటీని సంపాదించుకొన్నారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందుతున్న రావు బహద్దూర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.


Click it and Unblock the Notifications