'అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?'
పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపారు. అయితే పుష్ఫ 2 : ది రూల్ చిత్రం భారీ సక్సెస్ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ కు ఓకే చెబుతారని అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో త్రివిక్రమ్ తో సినిమాను ప్రకటించారు. ఆ కొద్దిరోజులకే సైడ్ అయ్యారు కూడా.. అందుకు కారణం ఏంటనే సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమాలు..
టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లోని చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. వీరి కాంబోలో వచ్చి 3 చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ కావడం విశేషం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాయి. అల్లు అర్జున్నకెరీయర్ లోనే ఉత్తమ చిత్రాలుగా ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో 4వ చిత్రాన్ని కూడా ప్రకటించారు. కానీ మధ్యలోనే ఆగిపోయింది.

అల్లు అర్జున్ తో చేయాలనుకున్న చిత్రం..
త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయాలనుకున్న చిత్రం మైథాలజీ ఫిల్మ్. హిందూ పురణాల ఆధారంగా రాసిన కథను అల్లు అర్జున్ తో భారీ స్థాయిలో నిర్మించాలని త్రివిక్రమ్ అనుకున్నారు. నిర్మాతగా నాగ వంశీ ఉండటం విశేషం. అయితే అప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కు కథ కూడా చెప్పారంట. కానీ అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ తో కొలబరేట్ అయ్యారు. త్రివిక్రమ్ అదే కథను జూనియర్ ఎన్టీఆర్ తో డైరెక్ట్ చేయబోతున్నారు.
ఎందుకు మిస్సైంది..
అందుకు కారణం ఇప్పటి వరుకు అల్లు అర్జున్ మైథాలజీ ఫిల్మ్స్ లో నటించలేదు. పైగా అల్లు అర్జున్ వరల్డ్ మార్కెట్ ను ఫోకస్ చేయడంతో భారీ సై-ఫై చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నారంట. దాంతో హీరోగా అల్లు అర్జున్ రేంజ్ మరింతగా పెరుగుతుంది. ఇక మైథలాజీ చిత్రానికి ఏ మేరకు రెస్పాన్స్ ఉంటుందోననే సందేహంలో అట్లీకి ఓకే చెప్పారని అంటున్నారు.
AA22xA6తో 2000 కోట్ల టార్గెట్..
అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప చిత్రంతో రౌండప్ చేసి మరీ బెస్ట్ యాక్టర్ కెటగిరీలో నేషనల్ అవార్డ్ ను దక్కించుకున్నారు. ఇక పుష్ఫ 2 చిత్రంతో బాక్సాపీస్ వద్ద రూ.2 వేల కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని భావించారు. కానీ కుదరలేదు. ఇక AA22xA6తో మాత్రం వరల్డ్ మార్కెట్ ను ట్రిగ్గర్ చేసి ఉన్నారు. ఎలాగైనా ఇండియాలో హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన ఫిల్మ్ తనదైన ఉండాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











