Mahesh Babu: మహేశ్ బాబు ఒప్పుకొని ఉంటే.. నాగచైతన్య, సమంత పెళ్లి జరిగేది కాదేమో!
సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలు తారల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందనే విషయం ఏం మాయ చేశావే సినిమా చూస్తే కరెక్టుగా అర్దమవుతుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 2010 సంవత్సరంలో రూపొందిన ఈ చిత్రం నాగచైతన్య, సమంత జీవితాలను మలుపుతిప్పిన చిత్రంగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమాలో హీరో పాత్రకు ముందుగా అనుకొన్నది నాగచైతన్యను కాదట. ఆ విషయాన్ని తాజాగా తాను నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ అనే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ వెల్లడించిన ఆసక్తికరమైన సంఘటన గురించిన వివరాల్లోకి వెళితే..
ఏం మాయ చేశావే సినిమాను తమిళనంలో విన్నైతాండి వరువాయ సినిమాగా గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించగా ఉదయనిధి స్టాలిన తన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ద్వారా డిస్టిబ్యూట్ చేశారు. అయితే ఈ సినిమాను తెలుగులో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు సోదరి మంజులా ఘట్టమనేని నిర్మించారు. ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత జంటగా నటించగా.. త్రిషా కృష్ణన్, శింబు అతిథి పాత్రల్లో నటించారు.

డొమినిక అండ్ ది లేడీస్ పర్స్ అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. వాస్తవంగా ఏం మాయ చేశావే (విన్నైతాండి వరువాయ) సినిమా కథను మహేష్ బాబును ఊహించుకొని రాశాను. ఆయనకు ఈ సినిమా కథను నేరేట్ చేశాను. ఆయనకు కూడా కథ నచ్చింది. అయితే తన ఇమేజ్‌కు సూట్ కాదు. ఇందులో ఫైట్స్ లేవు. యాక్షన్ సీన్లు లేవు అని ఈ మూవీని సున్నితంగా తిరస్కరించారని తెలిపారు.
అయితే ఏం మాయ చేశావే సినిమాను తిరస్కరిచండంలో ఎలాంటి అసంతృప్తి లేదు. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ఎవరి కెరీర్, ఇమేజ్ వారికి ఉంటాయి. ఈ విషయంలో మహేష్ బాబు కరెక్ట్‌గానే నిర్ణయం తీసుకొన్నారని అనుకొంటాను. ఆ తర్వాత శింబుకు కథ చెబితే.. తాను చేయడానికి సిద్దపడ్డారు. ఆయన అప్పటికే రొమాంటిక్ హీరోగా చాలా సినిమాలు చేశారు. అలాగే యాక్షేన్ సినిమాల్లో కూడా నటించారు. కాబట్టి ఆయన ఈ సినిమాను చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని గౌతమ్ మీనన్ చెప్పారు.

అయితే ఏం మాయ చేశావే సినిమాలో సమంత, నాగచైతన్య ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. ఆ సినిమా షూటింగులో జరిగిన పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. ఆ ప్రేమ మరో మెట్టెక్కి పెళ్లి వరకు వచ్చింది. ఆ తర్వాత ప్రశాంతంగా నడుస్తున్న వారి కాపురంలో కలహాలు, విబేధాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకొన్న సంగతి తెలిసిందే. ఒకవేళ మహేష్ బాబు ఈ సినిమా ఒప్పుకొని ఉంటే.. చైతూ, సామ్ మధ్య ఇంత జరిగేది కాదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఏం మాయ చేశావో చిత్రం సాధారణ ప్రేక్షకులనే కాకుండా సినిమా క్రిటిక్‌ను కూడా మెప్పించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సుమారుగా 10 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో 30 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పూరీ జగన్నాథ్, సుధీర్ బాబు తదితరలు అతిథి పాత్రల్లో మెరిసారు.


Click it and Unblock the Notifications











