Sakshi Vaidya Interview హీరోయిన్ అంటే నాకే నమ్మకం కలుగలేదు.. నా జీవితం నాకే సర్‌ప్రైజ్.. సాక్షి వైద్య

యువ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఏజెంట్. స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నూతన నటి సాక్షి వైద్య తొలిసారి కెమెరా ముందుకు ఈ సినిమా ద్వారా వచ్చారు. ఈ ప్రమోషన్‌లో భాగంగా ఆమె తెలుగు ఫిల్మ్‌బీట్‌తో మాట్లాడుతూ...

ఫిజియోథెరపిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి...: నేను పూణేలో పుట్టి పెరిగాను. నేను ఫిజియోథరపిస్ట్‌ కోర్సు చదువుకొని ప్రాక్టీస్ కూడా చేశాను. కరోనా సమయంలో ఖాళీగా ఉండటంతో వీడియోలు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో బిజీ అయిపోయాను. కొన్ని ఆడిషన్స్‌కు వెళ్లడం మొదలుపెట్టాను. ముంబైలో చాలా ఆడిషన్స్‌కు వెళ్లాను. చాలా మంది నన్ను రిజెక్ట్ చేశారు. అయితే ఒక రోజు హైదరాబాద్‌లోని ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. అయితే నేను నమ్మలేదు. కానీ ముంబైలో కాస్టింగ్ మేనేజర్ నాకు కాల్ చేసి... మీకు వచ్చిన కాల్ జెన్యూన్ చెప్పారు. బిగ్ ప్రొడక్షన్ హౌస్, బిగ్ డైరెక్టర్ అని చెప్పాడు. దాంతో నేను వారిని కలిశాను. సురేందర్ రెడ్డి ఆడిషన్ చేయించి ఓకే చేశారు. దాంతో నాకు ఈ ఆఫర్ వచ్చింది.

Sakshi Vaidy

అఖిల్ నుంచి చాలా నేర్చుకొన్నాను : నేను ఈ సినిమాలో పైలెట్‌గా నటిస్తున్నాను. నాకు లవ్ మీద ఎంట్రెస్ట్ ఉండదు. ఏజెంట్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ అనేది అందరికి తెలిసిందే. అలాంటి కథలో లవ్ లేకుండా ముందుకు సాగదు. బీస్ట్ నీడ్స్ బ్యూటీ. అఖిల్ లవర్‌గా నేను కనిపిస్తాను. సినిమా మా మధ్య వచ్చే సన్నివేశాలతో మొదలవుతుంది. మా మధ్య వచ్చే సీన్లు కథలో ప్రధానమైన అంశంగా మారుతుంది. అఖిల్ గ్రేట్ పర్సన్. పెద్ద స్టార్స్ గురించి నాకు మంచి ఓపినియన్ లేదు. కానీ అఖిల్ విషయంలో నా అభిప్రాయం తప్పనిపించింది. ఆయన నుంచి చాలా నేర్చుకొన్నాను అని సాక్షి వైద్య చెప్పారు.

Sakshi Vaidy

తెలుగు భాష అసలే తెలియదు : ఏజెంట్ సినిమా రిలీజ్ కాకుండానే నాపై ప్రశంసలు కురిపించడం, అలాగే నన్ను ప్రోత్సాహించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రజలు చాలా మంచి వాళ్లు.. ప్రేమను గొప్పగా చూపిస్తారు. సినిమా చూడకుండానే నన్ను మెచ్చుకోవడంతో నాలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. నాకు తెలుగు భాష అసలే తెలియదు. అందులో నేను రాయలసీమ భాషను మాట్లాడాల్సి వచ్చింది. చాలా తెలుగు మూవీస్ చూశాను. ఇప్పుడు తెలుగు ట్యూటర్ పెట్టుకొని క్లాసులకు అటెండ్ అవుతూ తెలుగు నేర్చుకొంటున్నాను అని సాక్షి వైద్య తెలిపారు.

Sakshi Vaidy

ఏజెంట్ సినిమా చేసిన తర్వాత : ఏజెంట్ సినిమాలో నటించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకొన్నాను. ఇంతకు ముందు సినిమా చూసేటప్పుడు.. స్క్రీన్ మీద ఆ సీన్ బాగాలేదు. ఆ హీరో బాగా లేడు.. ఆ హీరోయిన్ బాగా లేదు అని కామెంట్ చేసి... లైట్ తీసుకొనే వాళ్లం. కానీ ఒక్కసారి ఏజెంట్ సినిమా షూట్‌లో పాల్గొన్న తర్వాత.. యాక్టర్లు, టెక్నిషియన్లు పడే కష్టం నాకు తెలిసి వచ్చింది. ఒక లొకేషన్ నుంచి మరో లొకేషన్, యాక్షన్ సీన్లలో వాళ్లు గాయపడటం చూసి.. సినిమా మేకింగ్‌పై మరింత గౌరవం పెరిగింది అని సాక్షి వైద్య చెప్పారు.

Sakshi Vaidy

నా జీవితం నాకే సర్‌ప్రైజ్ : నాకు డ్రీమ్ రోల్స్ చేయాలనే ఆలోచన ఇంకా రాలేదు. నేను హీరోయిన్‌గా నటించాననే విషయం తలుచుకొంటే నాకే నమ్మబుద్ది కాదు. నా జీవితం నాకే సర్‌ప్రైజ్ అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలనే ఆలోచన లేదు. కరోనా సమయంలో అలా ఆడిషన్స్ ఇవ్వడం ద్వారా యాక్టర్ అయ్యాను. యాక్టర్‌గా మారిన తర్వాత చాలా ఎమోషన్స్ మనలో కనిపిస్తాయి. చాలా విషయాలు నేర్చుకొంటాం. నిజ జీవితంలో ఆచరించని విషయాలు కూడా నటిగా మారిన తర్వాత పాటిస్తాం అని సాక్షి వైద్య అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X