Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవి సినిమా న్యూస్ త్వరలో చెబుతా, ఆచారి మిమ్మల్ని నవ్విస్తాడు!
మంచు విష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. ఈ సినిమాలో బ్రహ్మానందం కీలకపాత్రలో నటిస్తుండగా విష్ణు సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. పద్మజా పిక్చర్స్ పతాకంపై జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కీర్తి చౌదరి, కిట్టు నిర్మాతలు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తో ఇంటర్వ్యూ..
Recommended Video
ఆచారి అమెరికా యాత్ర సినిమా గురించి...
ఈ సినిమా ఫన్ ఎంటర్టైనర్, ఆడియన్స్ కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. మంచు విష్ణు, బ్రహ్మానందం మధ్య వచ్చే కామిడి సీన్స్ ఈ సినిమాలో ప్రధాన హైలెట్ కాబోతున్నాయి. ధియేటర్ కు వచ్చిన ఆడియన్స్ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు.
సినిమాలో మీ పాత్ర గురించి...
నేను ఒక ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించబోతున్నాను. కొన్ని అనుకోని కారణాల వల్ల ఇండియాకు రావడం జరుగుతుంది. అక్కడ విష్ణు తో ప్రేమ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథాంశం. కొన్ని సీన్స్ లో సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తాను, ఆ సీన్స్ బాగుంటాయి.
జి.నాగేశ్వర రెడ్డి తో వర్క్ చెయ్యడం...
నాగేశ్వర రెడ్డి గారు కామిడి టైమింగ్ బాగా తెలిసిన డైరెక్టర్, షూటింగ్ సమయంలో ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. మంచు విష్ణు, జి. నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ లో దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం మంచి సక్సెస్ అయ్యాయి.
కీర్తి చౌదరి, కిట్టు గురించి..
చాలా ఫ్రీడం ఇచ్చారు వారు. ఇంతమంచి నిర్మాతలతో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి. భవిషత్తులో వారు వారి తండ్రి ఏం.ఎల్. కుమార్ చౌదరి లాగా పెద్ద నిర్మాతలు అవుతారు.
ఆచారి అమెరికా యాత్ర ఎలా ఉండబోతోంది..
మంచి కథ, కథనాలతో కూడుకున్న కథ, కథనాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఉహించని ట్విస్ట్ చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సిరిసిల్లా పాట ప్రేక్షకులను అలరించబోతోంది.
మీ నెక్స్ట్ సినిమాలు..
చిరంజీవి సైరా లో చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలో అధికారికంగా ప్రకటిస్తాను. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తాను.