Bhola Shanker: భోళా శంకర్ డిజాస్టర్‌కు కారణమదే,. సూటిగా చెప్పేసిన పరుచూరి బ్రదర్!
Bhola Shanker: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇటీవలే వచ్చిన సినిమా భోళా చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి సినిమా వస్తుందని కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ వేచి చూసిన మెగా అభిమానులకు ఈ సినిమా వల్ల తీవ్ర నిరాశే కలిగింది. ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ఎందుకు ఆడలేదు, అసలు ఫ్లాప్ ఎందుకు అయింది వంటి అంశాల గురించి వివరించారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా రియాల్టీతో పాటు ఎమోషన్లు సరిగ్గా ఉంటేనే సినిమా ఆడుతుందని అన్నారు. ముఖ్యంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు.
మన ప్రాంతానికి చెందిన కథలా మలిస్తే..!:భోళా శంకర్ సినిమా అన్నా చెల్లెళ్ల కథ కాదని తెలిపారు. చెల్లెలు కాని ఓ అమ్మాయిని సోదరిగా భావించి చేరదీసిన ఓ అన్న కథ అని అన్నారు. ఇది చాలా అద్భుతమైన పాయింట్ అని ఈ సినిమా మాతృత వేదాళంలో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టు అయి ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఫ్లాప్ అవడానికి చాలానే కారణాలు ఉన్నాయని, ముఖ్యంగా ఎలాంటి చిత్రంపైనైనా ప్రాంతీయత బాగా ప్రభావం చూపుతుందన్నారు. భోళా శంకర్ సినిమా మన ప్రాంతానికి చెందిన కథలా లేకపోవడమే ఈ సినిమాకు మైనస్ గా మారిందన్నారు. అలాగే సినిమా మొదట్లోనే ఇది కోల్ కతా కథ అని చూపించడంతో ఇక్కడి ప్రేక్షకులు సినిమాకు డిస్ కనెక్ట్ అయ్యారని వివరించారు. మన ప్రాంతీయతకు తగ్గట్లుగా సినిమాలో మార్పులు చేపట్టి ఉంటే సినిమా ఫలితాలు మరోలా ఉండేవని పరుచూరి గోపాల కృష్ణ వెల్లడించారు.

అలాగే భోళా శంకర్ సినిమా ప్రధానంగా మానవ అక్రమ రవాణాను అంతం చేసే హీరో కథ అని.. కానీ మరోవైపు చెల్లెలి సెంటిమెంట్ కూడా చూపించి సినిమాను రెండు స్టోరీలుగా మలిచారన్నారు. ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేయడం సరైనది కాదని.. ఒకటే నేపథ్యం తీసుకుంటేనే సినిమా అందరికీ బాగా అర్థమై హిట్టుగా నిలుస్తుందని వివరించారు. చెల్లెలి సెంటిమెంట్ సినిమాలు గతంలో చాలా వచ్చాయని, అవన్నీ దాదాపు హిట్లుగానే నిలిచాయన్నారు. ఈ సినిమాలో కూడా అదొక్క పాయింటే చూపించినా బాగుండేదని భావించినట్లు పేర్కొన్నారు. అలాగే మొదటి భాగంలోనే హీరో హత్యలు చేయడం చూపించకూడదని.. కారణాలు చెప్పాక హత్యలు చేసే సీన్లు పెడితే అందరిలోనూ హీరోపై పాజిటివ్ భావన కల్గి సినిమాను చివరి వరకూ ఎంజాయ్ చేసేవారన్నారు.

ఆ హత్యలు చూసి నేనే ఉలిక్కిపడ్డా..:స్టార్ హీరోతో.. సినిమా మొదటి భాగంలోనే హత్యలు చేయించడం చూసి తానే భయపడ్డానని, ఇలా చేయించడం సినిమాకు చాలా మైనస్ అని అన్నారు. అలాగే హీరోపై హీరోయిన్ కు ముందుగానే కోపం, ద్వేషం వంటివి ఉంటే ప్రేక్షకులకు నచ్చవనవి పరుచూరి గోపాల కృష్ణ చెప్పుకొచ్చారు. అలాగే చిరంజీవి బాడీ లాంగ్వేజీ ఈ సినిమాకు సరిపోలేదని కూడా కామెంట్లు చేశారు. ముందుగా అద్భుతమైన హీరోయిజాన్ని చూపించి.. రెండో భాగంలో అమ్మాయి ఇల్లు ఖాళీ చేయించడం, మంచి అమ్మాయికి అన్నాయంయ చేయాలని చూడడాన్ని కూడా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారని అన్నారు. ఇలా చూపిస్తే ఎవరైనా సినిమాకు డిస్ కనెక్ట్ అవుతారని అన్నారు.

శ్రీముఖికి బదులుగా వేరే అమ్మాయిని పెడ్తే బాగుండేది!:అలాగే ఈ సినిమాలో శ్రీముఖి లాంటి అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని పెట్టి ఆమెతో చిరంజీవి ప్రేమాయణం సాగిస్చున్నట్లు చూపిస్తే సినిమా అద్భుతంగా ఉండేదన్నారు. ఆ తర్వాత ఆమెకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేసినట్లు చూపిస్తే బాగుండేదని, కథను తిప్పి తిప్పి చూపించడం వల్లే ఫ్లాప్ అయిందని స్పష్టం చేశారు. తాను చెప్పినట్లుగా కథను చూపిస్తూనే, మానవ రవాణాను అంతం చేసే వ్యక్తిగా చూపించినా సినిమా హిట్టుగా నిలిచేదని తనకు అనిపించినట్లు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











