Yatra 2 థియేటర్లలో ఫ్రీగా యాత్ర 2 సినిమా.. డైరెక్టర్ మహీ రాఘవ క్లారిటీ ఏమిటంటే?
యువ దర్శకుడు మహీ వీ రాఘవ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, తమిళ స్టార్ హీరో జీవా నటించిన చిత్రం యాత్ర 2. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్లపై ఈ మూవీని శివ మేక నిర్మించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన ఓ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మూవీ గురించి మహీ వీ రాఘవ ఫిల్మ్‌బీట్‌తో మాట్లాడుతూ..

యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎలాంటి టెన్షన్ లేదు. పరీక్ష రాసిన తర్వాత ఫలితాల కోసం వేచి చూసే పరిస్థితి ఉంది. ప్రేక్షకుల తీర్పు కోసం వేచి చూస్తున్నాం. నేను చెప్పాలనుకొన్న కథను ఎలా రిసీవ్ చేసుకొంటారనే విషయం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అని మహీ వీ రాఘవ తెలిపారు.
వైఎస్ఆర్ మరణాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల అధారంగా ఈ సినిమాను రూపొందించాం. 2009 నుంచి 2019 వరకు జరిగిన సంఘటనలను తీసుకొన్నాం. ప్రధాన సంఘటనలను మాత్రమే చూపిస్తాం. ఈ మూవీలో షర్మిల, ఇతర పాత్రలు లేవు. రెండున్నర గంటలపాటు నడిచే డ్రామాను చెప్పాలని అనుకొన్నాం అని మహీ వీ రాఘవ చెప్పారు.

యాత్ర 2 సినిమాలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు. వైఎస్ జగన్ జీవితంలో జరిగిన సంఘటనలను మాత్రమే చెప్పాలని అనుకొన్నాం. ఎవ్వరినీ టార్గెట్ చేయాలని అనుకోలేదు. మా ఉద్దేశం కూడా అది కాదు అని మహీ వీ రాఘవ తెలిపారు.

యాత్ర 2 సినిమాను రిలీజ్ తర్వాత ఉచితంగా చూపిస్తామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మా సినిమాకు ఉచితంగా ఎవరూ పనిచేయలేదు. మేము డబ్బులు పెట్టి సినిమా తీశాం. మేము ఫ్రీగా సినిమా చూపించే పరిస్థితి లేదు. ఎవరైనా టికెట్ కొనుక్కొని మూవీ చూడాలి అని మహీ వీ రాఘవ చెప్పారు.


Click it and Unblock the Notifications











