100 రోజుల్లో టాక్సిక్ మూవీ.. అతిభీకరంగా యష్ మ్యాడ్ లుక్!
కేజీఫ్ తర్వాత కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్ . ఈ సినిమా విషయానికి వస్తే.. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణాదిలోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి లాంటి టాప్ హీరోయిన్లు నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్, టొవినో థామస్, అమిత్ తివారీ కీలక పాత్రల్లో నటించనున్నారు.
ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత రాజీవ్ రవి సినిమాటోగ్రఫర్‌గా, రవి బస్రూర్ మ్యూజిక్, ఉజ్వల్ కులకరణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు టీపీ అబిద్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి జాన్ విక్ సినిమాకు పనిచేసిన జేజే పెర్రీ యాక్షన్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాను మార్చి 19, 2026లో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా రిలీజ్ రివీల్ చేస్తూ యష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి సంబంధించి యష్ పోస్టర్ అభిమానులకు షాకింగ్ కలిగించేలా ఉంది. రక్తంతో నిండిన బాత్ టబ్‌లో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ముఖం కనిపించకుండా బలీయమైన శరీరంతో రగ్గ్‌డ్ లుక్‌తో సెక్సీగా కనిపించాడు. బాడీపై టాటూతో స్టైలిష్‌గా కనిపించారు. బ్యాడ్‌మ్యాన్‌కు ఎన్ని రకాల బిల్డప్ ఉండాలో అన్ని రకాలుగా యష్‌ను ఆవిష్కరించారు.
ఇక ఈ సినిమాకు కథను గీతూ మోహన్‌దాస్‌తో కలిసి యష్ అందించారు. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏకకాలంలో ఇంగ్లీష్‌తోపాటు కన్నడలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇతర భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు వెంకట్ కే నారాయణ, యష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్నది.
యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. వంద రోజుల్లో థియేటర్లలో పండుగ వాతావరణాన్ని నింపుతుంది. ఎంతోకాలంగా యష్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నిజమైన పండుగను తీసుకు రాబోతున్నదని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











