Detective Teekshana Trailer Review స్టార్ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక 50వ చిత్రం.. ట్రైలర్ ఎలా ఉందంటే?

కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరో ఉపేంద్రకు ఎంత క్రేజ్ ఉందో.. ఆయన సతీమణి ప్రియాంకకు కూడా అదే క్రేజ్ ఉంది. ప్రియాంక ఉపేంద్ర తన కెరీర్‌లో ఇప్పటి వరకు 49 సినిమాలతో కన్నడ, దక్షిణాది ప్రేక్షకులను ఆలరించారు. తాజాగా తన 50వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేశారు. డాక్టర్ ప్రియాంక ఉపేంద్ర 50వ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. ఈ క్రమంలో తన 50వ చిత్రం డిటెక్టివ్ తీక్షణ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బెంగళూరులోని ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక వివరాల్లోకి వెళితే..

కన్నడలో యాక్షన్ క్వీన్‌గా పేరున్న డాక్టర్ ప్రియాంక ఉపేంద్ర నటించిన 50వ చిత్ం డిటెక్టివ్ తీక్షణ సినిమాకు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట్ చరణ్, పురుషోత్తమ్ బి కోయూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ హీరో ఉపేంద్ర చేతుల మీదుగా ఆవిష్కరించారు. మర్డర్ మిస్టరీ, డ్రగ్ మాఫియాపై డిటెక్టివ్ తీక్షణగా ప్రియాంక చేసే యాక్షన్ విన్యాసాల నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా కనిపించింది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ట్రైలర్‌లో పాజిటివ్‌గా కనిపించాయి.

Detective Teekshana

డిటెక్టివ్ తీక్షణ కథ చెప్పిన వెంటనే ఈ సినిమాను చేయడానికి ఒప్పుకొన్నారు. నా టాలెంట్ గుర్తించి అవకాశం ఇచ్చిన ప్రియాంక మేడమ్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ఆమె అందించిన సహకారం జీవితాంతం గుర్తు పెట్టుకొంటాను. నా ఆలోచనలను, విజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు హార్డ్ వర్క్ చేశారు. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని మరో రెండు నెలల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం అని దర్శకుడు త్రివిక్రమ్ రఘు అన్నారు.

ప్రతీ మహిళలో డిటెక్టివ్ ఉంటుంది. మా ఇంటిలో ఇంకా ఎక్కువగానే డిటెక్టివ్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతీ భర్తకు ఓ భార్య డిటెక్టివ్‌గా ఉంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. డిటెక్టివ్ పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించిందనిపించింది. నా భార్య, నటి ప్రియాంకకు 50వ సినిమా. నా వయసు మాత్రం 46 మాత్రమే. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకొంటున్నాను. మేమిద్దరం కలిసి 100 సినిమా సైన్ చేయాలని కోరుకొంటున్నాం. కష్డపడితే తప్పకుండా ఫలితం దక్కుతుంది అని ఉపేంద్ర అన్నారు.

Detective Teekshana

నేను 50 సినిమాల్లో నటించనంటే నమ్మలేకపోతున్నాను. కానీ నాకు 50 సెకన్లు ముగిసాయా అనే ఫీలింగ్ కలుగుతున్నది. నేను 50 సినిమాలు పూర్తి చేశానంటే.. నాపై దర్శకులు, నిర్మాతలకు ఉన్న నమ్మకం వల్లే సాధ్యమైంది. నేను ప్రతీ ఒక్కరు మాట్లాడే మాటలను వింటాను. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరు కష్టపడి ఫనిచేశారు. తెల్లవారుజామున 2 గంటల వరకు పనిచేసినా అందరూ ఉత్సాహంగా పనిచేసేవారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఫిజికల్‌గా చాలా ష్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ పాత్ర నన్ను మెంటల్‌గా చాలా షార్ప్‌గా చేసింది. తివిక్రమ్ రఘుకు మంచి భవిష్కత్ ఉందని నమ్ముతున్నాను అని ప్రియాంక ఉపేంద్ర అన్నారు.

Detective Teekshana

డిటెక్టివ్ తీక్షణ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి యాక్టర్ విజయ సూర్యతోపాటు ఇతర ముఖ్యపాత్రలో కనిపించిన సిడ్లింగు శ్రీధర్, శశిధర్ మరియు ఆర్ డైరెక్టర్ నవీన్ కుమార్ హాజరయ్యారు. వీరితో పాటు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బీఏ ఎంఏ హరీష్, టాలీవుడ్ పీర్వో బీఏ రాజు's టీం (శివకుమార్ బి) కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతాన్ని పి రోహిత్ అందించారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 'డిటెక్టివ్ తీక్షణ' ను కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, ఒరియా, వంటి ఏడు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X