twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన సినీ హీరో.. ప్రాణాలకు తెగించి పేషెంట్లకు అలాంటి సాయం!

    |

    కరోనా సంక్షోభ కాలంలో సినీ తారలందరూ తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు. కొందరు ఆర్థికంగా ముందుకొస్తుంటే.. మరికొందరు వస్తువుల రూపేణ, వైద్యం అందిచే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కన్నడకు చెందిన నటుడు అర్జున్ గౌడ ఎవరూ ఊహించని బాధ్యతను భుజానికెత్తుకొన్నారు. అర్జున్ చేస్తున్న మహాకార్యం గురించి మరిన్ని వివరాలు..

    కరోనావైరస్ పేషెంట్లకు అండగా

    కరోనావైరస్ పేషెంట్లకు అండగా


    బెంగళూరులో కరోనావైరస్‌తో బాధపడుతున్న పేషెంట్లను సకాలంలో వైద్యం అందించేందుకు అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌గా మారారు. కోవిడ్ పేషెంట్లకు వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు. అర్జున్ గౌడకు చెందిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    కొద్ది రోజులుగా రోడ్లపైనే అంబులెన్స్‌తో

    కొద్ది రోజులుగా రోడ్లపైనే అంబులెన్స్‌తో

    గత కొద్ది రోజులుగా నేను రోడ్లపైనే అంబులెన్స్‌లో తిరుగుతున్నాను. క్లిష్టపరిస్థితుల్లో వైద్యం అవసరమైన పేషెంట్లను హాస్పిటల్‌కు తరలిస్తున్నాను. హాస్పిటల్‌లో మరణించిన వాళ్లను శ్మశాన వాటికకు తరలించి వారికి అంత్యక్రియలు జరిగేలా చూస్తున్నాను అని అర్జున్ గౌడ తెలిపారు.

    చాలా మందికి అంత్యక్రియలు

    చాలా మందికి అంత్యక్రియలు

    కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో బాధితులు చాలా కష్టపడుతున్నారు. వారికి సరైన సహాయం అందడం లేదు. అందుకే కొన్ని రోజులుగా అంబులెన్స్ నడుపుతూ వారికి సహాయం చేస్తున్నాను. డజన్ల కొద్ది పెషేంట్లకు సహాయం చేస్తున్నాను. చాలా మందిని అంత్యక్రియలు నిర్వహించాను అని అర్జున్ గౌడ వెల్లడించారు.

    కులం, మతం అనే తేడా లేకుండా

    కులం, మతం అనే తేడా లేకుండా

    దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఎవరికైనా సహాయం అందించాలనే నిర్ణయం తీసుకొన్నాను. కులం, మతం అనే తేడా లేకుండా, ఏ ప్రాంతం నుంచి వచ్చారనే వ్యత్యాసం లేకుండా సేవలు అందించాలని నిర్ణయించాం. సహాయం అందించడానికి ఏ ప్రాంతానికైనా వెళ్లడానికి సిద్దంగా ఉన్నాను అని అర్జున్ గౌడ తెలిపారు.

    Recommended Video

    Prabhas ప్యాన్ ఇండియా స్టార్ నుండి Universal Star గా మారుతాడు | #PrabhasNagshwin || Filmibeat Telugu
    కొన్ని నెలలపాటు ఇలానే సేవలు..

    కొన్ని నెలలపాటు ఇలానే సేవలు..

    బెంగళూరులోని కెన్‌గెరిలో ఉన్న పేషెంట్‌ను వైట్‌ఫీల్డ్‌లోని హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించేలా చేశాను. రానున్న కొన్ని నెలలపాటు ఇలా సేవలు చేయాలని నిర్ణయం తీసుకొన్నాను. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు నాకు తోచినంత సహాయం చేస్తుంటాను అని అర్జున్ గౌడ చెప్పారు.

    English summary
    Kannda actor Arjun Gowda is doing fantastic job in Lockdown imposed bangalore. He became ambulance driver to provide help Corona patients. He said, From few days, I am giving service to patients and death people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X