twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #మీటూ: అపుడు అర్జున్ షాకిచ్చాడు... ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటున్నాడా?

    |

    ప్రముఖ నటుడు అర్జున్ మీద కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ #మీటూ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 'విస్మయ' (కురుక్షేత్రం) సినిమా సమయంలో రొమాంటిక్ సీన్ రిహార్సల్ సమయంలో అర్జున్ ప్రవర్తన ఇబ్బందిగా అనిపించిందని ఆమె ఆరోపించారు.

    అయితే ఈ వివాదంలో శృతికి మద్దతు తెలుపుతూ ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగడం, అర్జున్ సారీ చెప్పాలని సూచించడం... మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప్రకాష్ రాజ్‌కు తన కుమారుడిని అనే అర్హత లేదని అర్జున్ తల్లి ఎదురు దాడి ప్రారంభించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

    తాజాగా కన్నడ నటుడు చేతన్ కుమార్ మీటూ ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతో అర్జున్ సార్జా మీద రివేంజ్ తీర్చుకుంటున్నాడనే ప్రచారం మొదలైంది.

    ఎవరీ చేతన్ కుమార్?

    ఎవరీ చేతన్ కుమార్?

    అర్జున్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో గతంలో ‘ప్రేమ బరాహ' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో హీరోగా చేతన్ కుమార్‌ను తీసుకోవాలనుకున్నారు. ఈ మేరకు అతడికి 10 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో అతడిని మార్చేసి చందన్ కుమార్‌ను హీరోగా పెట్టుకున్నారు.

    రివేంజ్ తీర్చుకోవడానికే అంటూ..

    రివేంజ్ తీర్చుకోవడానికే అంటూ..

    తనను చివరి నిమిషంలో తప్పించడంతో చేతన్ కుమార్ అప్ సెట్ అయ్యాడని, అందుకే అర్జున్ మీద ఆరోపణలు చేసిన శృతి హరి హరన్‌కు మద్దతు పలికేలా మీటూ ఉద్యమానికి సపోర్ట్ చేశాడనే వాదన తెరపైకి వచ్చింది. ‘ప్రేమ బరాహ' సినిమాకు తీసుకున్న రూ. 10 లక్షల అడ్వాన్స్ కూడా చేతన్ కుమార్ తిరిగి ఇవ్వలేదని అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ప్రశాంత్ సంబర్గి ఆరోపించారు.

    Recommended Video

    #MeToo : Prakash Raj Supports Sruthi Hariharan
    నాకు అంత డబ్బు ఇవ్వలేదు

    నాకు అంత డబ్బు ఇవ్వలేదు

    తనపై వస్తున్న ఆరోపణలపై చేతన్ స్పందించారు. తనకు రూ. 10 లక్షలు ఇవ్వలేదని, రూ. 9 లక్షలు మాత్రమే ఇచ్చారు. సినిమా కోసం ఫోటో షూట్లో పాల్గొన్నాను. ప్రాజెక్టు మీద ఆరు నెలలు పని చేశాను. అర్జున్ సర్‌కు రెగ్యులర్‌గా టచ్ లో ఉన్నాను అని తెలిపారు. తనను అర్జున్ సర్ కూడా డబ్బు తిరిగి ఇవ్వాలని అడగలేదని తెలిపారు.

    అర్జున్ సర్ మీద గౌరవం ఉంది

    అర్జున్ సర్ మీద గౌరవం ఉంది

    అర్జున్ సర్ మీద నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఇద్దరం ఫ్యూచర్లో కలిసి పని చేయాలని కూడా అనుకున్నాం. ఆయన మీద నాకు ఎలాంటి కోపం లేదని చేతన్ తెలిపినట్లు సమాచారం.

    మీటూకు అందుకే మద్దతు

    మీటూకు అందుకే మద్దతు

    పర్సనల్‌గా అర్జున్ సార్జా మీద చేతన్ కుమార్‌కు ఎలాంటి ఉద్దేశ్యాలు లేవు. దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఒక మంచి ఉద్దేశ్యంతో జరుగుతున్న ఈ మూమెంటుకు తన మద్దతు ప్రకటించారని మరికొందరు అంటున్నారు.

    English summary
    Actor Chethan Kumar is now under attack for supporting Sruthi Hariharan's '#Me Too' cause as people allege him of using this opportunity to seek revenge against Arjun Sarja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X