ప్రియురాలిని పెళ్లాడిన టాప్ కమెడియన్.. లాక్‌డౌన్ సమయంలో సీక్రెట్‌గా అలాంటి వివాహం!
కన్నడ స్టాండప్ కమెడియన్ డానిష్ సెయిట్ తన ప్రియురాలు అన్య రంగస్వామిని పెళ్లి చేసుకొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ బెంగళూరులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వివాహం చేసుకొన్నారు. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఒక్కటైన సందర్భంగా పలువురు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి, ప్రేమ, వ్యక్తిగత విషయాల్లోకి వెళితే...

గ్రాఫిక్ డిజైనర్ అన్య రంగస్వామితో
ముంబైకి చెందిన గ్రాఫిక్ డిజైనర్ అన్య రంగస్వామి, డానిష్ సెయిట్ ఇద్దరు కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వారిద్దరి వ్యవహారం కన్నడ మీడియాలో హైలెట్‌గా మారింది. ఈ క్రమంలో గత డిసెంబర్‌లో తమ ప్రేమ గురించి బయటపెట్టాడు. తాను నా ప్రపోజల్‌కు ఒప్పుకొన్నది. జీవితకాలం మేమిద్దరం కలిసి బతకాలని నిర్ణయించుకొన్నాం అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

జూన్ 9న వివాహం అంటూ
అయితే లాక్‌డౌన్‌లో ఎవరూ ఊహించని విధంగా జూన్ 9వ తేదీన తాను వివాహం చేసుకొన్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆర్య, నేను పెళ్లి చేసుకొన్నాం. బుధవారం జరిగిన నా ఫ్యామిలీ, స్నేహితుల్లో 15 మంది హాజరయ్యారు. మా ప్రేమ బంధానికి మీ దీవెనలు కావాలి అంటూ జూన్ 10వ తేదీన ట్వీట్ చేశారు.

మాజీ మంత్రి బంధువుగా
ఇక డానిష్ సెయిట్ విషయానికి వస్తే.. కన్నడ మాజీ మినిస్టర్ తన్వీర్ సెయిట్‌కు బంధువు. కన్నడలో స్టాండప్ కమెడియన్‌గా, టెలివిజన్ హోస్ట్‌గా, రేడియో జాకీగా సుపరిచితుడు. అతడి ప్రాంక్ కాల్స్, పేరెడీ వీడియోలు కన్నడ వాసులకు మంచి వినోదం పంచుతున్నాయి. ఐపీఎల్‌లో ఆర్సీబీకి వీరాభిమానిగా తన వంతు సపోర్టును అందిస్తూ క్రీడాభిమానులు ఆకట్టుకొంటున్నారు.
Recommended Video

కమెడియన్‌గా రక్షిత్ శెట్టితో కలిసి..
డానిష్ సెయిట్ నటుడిగా హంబుల్ పొలిటిషియన్ నోగ్‌రాజ్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రముఖ కన్నడ హీరో రక్షిత్ శెట్టితోపాటు మల్లికార్జునయ్య, హేమంతరావు నిర్మించారు. ఫ్రెంచ్ బిర్యాని చిత్రంలో నటించారు. హిందీ వెబ్ సిరీస్ అఫ్సోస్ అనే చిత్రంలో నటించారు. రక్షిత్ శెట్టి నటించిన చార్లీ 777 చిత్రంలో రక్షిత్ శెట్టితోపాటు కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











