For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైరల్‌గా చిరంజీవి సర్జా చివరి వాట్సప్ ఛాట్.. ఆఖరి కోరిక తీరుకుండానే.. ప్రాణస్నేహితుడు కంటతడి

  |

  కన్నడ నటుడు చిరంజీవి సర్జా అర్ధాంతరం తనువు చాలించడం దక్షిణాది పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆదివారం సాయంత్రం చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతి వార్తతో సినీ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు తల్లడిల్లి పోయారు. తన మరణానికి ముందు చిరంజీవి సర్జా తన ప్రాణ స్నేహితుడు ప్రజ్వల్ దేవరాజ్‌తో పంచుకొన్న చివరి వాట్సప్ సందేశం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంతకు తన స్నేహితుడిని కోరిన ఆఖరి కోరిక ఏమిటంటే..

  ప్రజ్వల్ దేవరాజ్, చిరంజీవి సర్జా స్నేహం

  ప్రజ్వల్ దేవరాజ్, చిరంజీవి సర్జా స్నేహం

  కన్నడ పత్రికతో ప్రజ్వల్ దేవరాజ్ మాట్లాడుతూ నేను చిరంజీవి సర్జా ఇద్దరు ప్రాణ స్నేహితులం. బాల్యం నుంచి మా మధ్య స్నేహం ఉంది. దాంతో ఒకరంటే మరొకరు విడిచి ఉండలేని పరిస్థితి. మా మధ్య బంధం స్నేహం కంటే ఎక్కువగా, సోదరభావం మాదిరిగా ఉండేది. అయితే లాక్‌డౌన్ కారణంగా వారిద్దరూ కొన్ని నెలలుగా అందరి మాదిరిగానే దూరంగా ఉన్నాం అని తెలిపారు.

  స్కూల్‌లో నాకంటే సీనయిర్

  స్కూల్‌లో నాకంటే సీనయిర్

  చిరు స్నేహం గురించి ప్రజ్వల్ దేవరాజ్ గుర్తు చేసుకొంటూ ఆయన నాకు స్కూల్‌లో సీనియర్. చిరు గ్రూప్‌లో నేను చిన్నవాడిని. నాకు సోదరుడి లాంటి వాడు. మేమిద్దరి కలిసి తిరిగే వాళ్లం. యాక్టింగ్ కోసం కూడా కలిసి శిక్షణ తీసుకొన్నాం. ఇమ్రాన్ శాండిల్య వద్ద మేమిద్దరం డ్యాన్స్‌లో ట్రైనింగ్ పొందాం. నాకు ఎప్పుడూ సలహాలు ఇచ్చి ప్రొత్సహించే వారు. మా గ్రూప్‌లోని వారు చిరును కృష్ణుడు అని, నన్ను అర్జునుడు అని పిలిచేవారు అని ప్రజ్వల్ ఆవేదన చెందారు.

  అమ్మ చేతి వంటంటే..

  అమ్మ చేతి వంటంటే..

  చిరంజీవి సర్జాకు మా అమ్మ చేసిన వంట అంటే చాలా ఇష్టం. అమ్మ చేసే మటన్ చాప్స్ ఇష్టంగా తినేవారు. చిరు భోజన ప్రియుడు. ఇటీవల మా అమ్మ చేసిన మటన్ చాప్స్ పంపితే సంతోషంగా తిని థ్యాంక్స్ చెప్పారు. అలాంటి నా ప్రాణా స్నేహితుడు లేకపోవడం నాకు బాధగా ఉంది అంటూ చిరంజీవి సర్జా చివరిసారిగా తమ వాట్సప్ గ్రూప్‌లో చాటింగ్ చేసిన విషయాన్ని ప్రజ్వల్ బయటపెట్టారు.

  వైరల్‌గా వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్

  వైరల్‌గా వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్

  చిరంజీవి తన స్నేహితులతో వాట్సప్ ఛాటింగ్ చేస్తూ ప్రశాంతత కోసం ఫ్రెండ్స్ అందరం కలుసుకొందాం. రేపు ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ అన్నారు. అంతలోనే తన కోరిక తీరకుండా చిరంజీవి సర్జా మమల్ని వీడి పోయారని ప్రజ్వల్ తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి సర్జా వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్ వైరల్‌గా మారింది. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితులు అతడిని మానసికంగా కుంగి తీసి ఉంటాయని, అందుకే స్నేహితులతో ట్రిప్‌కు వెళ్లాలనే ప్లాన్ చేశాడని స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

  #HBDNBK Birthday Special: Caricature Pic Of Chiru Balayya & Total Tolywood Heroes Goes Viral
  పుట్టెడు దు:ఖంలో భార్య మేఘనా రాజ్

  పుట్టెడు దు:ఖంలో భార్య మేఘనా రాజ్

  యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు మేనల్లుడైన చిరంజీవి సర్జా రెండేళ్ల క్రితం హీరోయిన్ మేఘనా రాజ్‌ను వివాహం చేసుకొన్నారు. ఆయనకు తల్లిదండ్రులు, సోదరుడు ధ్రువ సర్జా ఉన్నారు. అయితే ప్రస్తుతం మేఘనా నిండు గర్బిణి. అయితే తమకు పుట్టబోయే బిడ్డను ఆహ్వానించాలని, అలాగే స్నేహితులతో ట్రిప్‌కు వెళ్లాలని భావించిన చిరు అవి తీరకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమించడం అందర్నీ కంటతడి పెట్టిస్తున్నది.

  English summary
  Chiranjeevi Sarja death news has given shock to south film industry. But Arjun Sarja death shook his wife Meghana Raj. Meghna Raj is expecting her first child. This sad happend when they are eagarly waiting to welcome the baby.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X