twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాగిపెట్టి ముఖంపై కొట్టారు.. ప్రకాశ్ రాజ్.. విలక్షణ నటుడికి చేదు అనుభవం

    |

    సినీ రంగంలో స్టార్ యాక్టర్‌గా రాణించిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేదు అనుభవం ఎదురైంది. రాజకీయాల్లో కూడా రాణించాలనే కలతో బెంగళూరు సెంట్రల్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. మోదీపై ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించిన ఈ విలక్షణ నటుడు ఓటమిపాలయ్యాడు. ఎవరూ ఊహించని విధంగా మూడో స్థానంలో నిలువడం ఆయనను షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే..

    మూడోస్థానంలో ప్రకాశ్ రాజ్

    మూడోస్థానంలో ప్రకాశ్ రాజ్

    బెంగళూరు సెంట్రల్‌లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్, ప్రకాశ్ రాజ్ పోటీ పడ్డారు. జనవరి 1 నుంచి ప్రకాశ్ రాజ్ ప్రచారం చేపట్టారు. ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా ఆయన మూడో స్థానానికి పడిపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

    ఓటర్లు చాచిపెట్టి కొట్టారని

    ఓటర్లు చాచిపెట్టి కొట్టారని

    కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గంలో తన ఓటమిపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఓటర్లు చాచి ముఖంపై కొట్టినట్టు అనిపిస్తున్నది. నాపై దూషణలకు, ట్రోల్స్, మానసిక వేధనల మధ్య ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

     కఠినమైన పోరాటం మొదలైందని

    కఠినమైన పోరాటం మొదలైందని

    గెలుపు, ఓటములు పక్కన పెడితే లౌకిక భారత్ ఏర్పాటు కోసం నా పొరాటం కొనసాగుతుంది. ఓటమి తర్వాత మరో కఠినమైన పోరాటం మొదలైందని భావిస్తున్నాం. పోరాటం చేసే క్రమంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటాను అని ప్రకాశ్ రాజ్ మీడియాతో అన్నారు.

    ప్రకాశ్ రాజ్ ఓటమితో

    ప్రకాశ్ రాజ్ ఓటమితో

    బెంగళూరు సెంట్రల్‌లో తన గెలుపు కోసం ప్రకాశ్ రాజ్ వినూత్న ప్రచారం చేపట్టారు. సామాజిక, స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పనిచేస్తానని హమీ ఇచ్చారు. సాధారణ పౌరుడి మాదిరిగా ప్రకాశ్ ఆటో రిక్షాలో ప్రచారం చేశారు. పేద, మధ్య తరగతి ఓటర్లను ఆకట్టుకొంటున్నారనే విశ్లేషణ మధ్య ప్రకాశ్ రాజ్ మూడో స్థానంతో సరిపెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

    English summary
    Actor Prakash Raj lost Bengaluru Central constituency in latest election. Prakash was contesting the Lok Sabha Election against BJP’s sitting MP from the constituency. He said, a SOLID SLAP on my face ..as More ABUSE..TROLL..and HUMILIATION come my way..I WILL STAND MY GROUND ..My RESOLVE to FIGHT for SECULAR INDIA will continue..A TOUGH JOURNEY AHEAD HAS JUST BEGUN ..THANK YOU EVERYONE WHO WERE WITH ME IN THIS JOURNEY. .... JAI HIND
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X