కేజీఎఫ్ 2పై భారీగా రూమర్లు.. ఖండించిన యష్
కన్నడ సినీ చరిత్రలో సంచలన విజయం సాధించిన కేజీఎఫ్: చాప్టర్ 1కు సీక్వెల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్: చాప్టర్ 2 చిత్రంపై వస్తున్న రూమర్లపై సినీ హీరో యష్ క్లారిటీ ఇచ్చారు. పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారనే వార్తలను ఖండించారు. తాము ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేయడానికి రూపొందించామని, అంతేగానీ ఓటీటీలో ఎంత మాత్రం కాదని అన్నారు.
ఇలాంటి రూమర్లు ఎలా వస్తాయో, ఎక్కడ నుంచి పుడుతాయో తెలియదు గానీ.. ఈ వార్తలో వాస్తవం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటీటీ ఫ్లాట్‌ఫాం రిలీజ్ చేయం. సినిమాను బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్ కోసం రూపొందించాం. ప్రేక్షకులు ఎలాంటి అంచనాలతో ఉన్నారనే విషక్ష్ం మా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు బాగా తెలుసు. అలాగే నా ఫ్యాన్స్ ఆశలను వమ్ము చేయను అని యష్ క్లారిటీ ఇచ్చారు.

వాస్తవానికి కేజీఎఫ్ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలని భావించాం. కానీ కోవిడ్ 19 కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇంకా 20 శాతం షూటింగ్ మిగిలి ఉంది. మిగితా షూటింగును లాక్‌డౌన్ తర్వాత పూర్తి చేస్తాం అని యష్ తెలిపారు. లాక్‌డౌన్ విధించకపోతే షూటింగ్ పూర్తయి ఉండేది. ఇంకా 20 రోజుల షూటింగ్ మిగిలి ఉందన్నారు. జూలైలో షూటింగులకు అనుమతిస్తే.. ముందుగా ప్రకటించిన డేట్‌కే రిలీజ్ చేస్తాం. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అవుతున్నాయి అని అన్నారు.


Click it and Unblock the Notifications











